MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Chiranjeevi Songs: ఆ హీరో చిరంజీవి సాంగ్స్ చేయడం మెగా ఫ్యామిలీకి ఇష్టం లేదా ? అందుకే ఆపేశా అంటూ కామెంట్స్

Chiranjeevi Songs: ఆ హీరో చిరంజీవి సాంగ్స్ చేయడం మెగా ఫ్యామిలీకి ఇష్టం లేదా ? అందుకే ఆపేశా అంటూ కామెంట్స్

Chiranjeevi Songs: సాయిధరమ్ తేజ్ తన సినిమాల్లో చిరంజీవి సినిమా పాటలని రీమిక్స్ చేశారు. చిరంజీవి సినిమా పాటలని రీమిక్స్ చేయడం తనకు ఇష్టం లేదు అని సాయిధరమ్ తేజ్ తెలిపారు. ఆయన ఎందుకు అలా అన్నారో ఈ కథనంలో తెలుసుకోండి.

2 Min read
Author : Tirumala Dornala
Published : Oct 07 2026, 11:46 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Sai Dharam Tej
Image Credit : Asianet News

Sai Dharam Tej

మెగాస్టార్ చిరంజీవి డ్యాన్సులు, ఆయన సినిమాల్లోని పాటలు ఇప్పటికీ ఆడియన్స్ కి కిక్ ఇస్తూ ఉంటాయి. చిరంజీవి సినిమాల్లో ఎన్నో క్లాసిక్ సూపర్ హిట్ సాంగ్స్ ఉన్నాయి. చిరంజీవి సినిమాల్లో క్రేజీ అంశాలని హీరోలు ఇప్పటికీ తమ సినిమాల్లో వాడుతుంటారు. అదే విధంగా రాంచరణ్, సాయిధరమ్ తేజ్ లాంటి హీరోలు తమ సినిమాల్లో చిరంజీవి పాటలని రీమిక్స్ చేశారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
చిరంజీవి పాటల రీమిక్స్
Image Credit : instagram

చిరంజీవి పాటల రీమిక్స్

రాంచరణ్ మగధీరలో బంగారు కోడి పెట్ట, రచ్చలో వాన వాన వెల్లువాయె, నాయక్ లో శుభలేఖ రాసుకున్న లాంటి పాటలని రీ మిక్స్ చేశారు. సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ కూడా అందం ఇందోళం, గువ్వా గోరింకతో లాంటి పాటలని రీమిక్స్ చేశారు. ఇంటెలిజెంట్ లాంటి ఫ్లాప్ మూవీలో కూడా చమక్ చమక్ చామ్ అనే సాంగ్ ని తేజు రీమిక్స్ చేశారు. కానీ ఒకదశకు చేరుకున్న తర్వాత చిరంజీవి పాటలని రీమిక్స్ చేయడం చిరు ఆపేశారు.

35
నాకు ఇష్టం లేదు
Image Credit : Asianet News

నాకు ఇష్టం లేదు

దీనికి కారణం ఏంటి అని ఓ ఇంటర్వ్యూలో అడగగా తేజు సమాధానం ఇచ్చారు. వాస్తవంగా చెప్పాలి అంటే చిరంజీవి గారి సాంగ్స్ చేయడం నాకు ఇష్టం లేదు. చిరంజీవి పాటలు చిరంజీవి పాటలు లాగే ఉండిపోవాలి. కానీ నిర్మాతలు, దర్శకులు కోరుకోవడం వల్ల.. సినిమాకు ఉపయోగపడుతుంది అని చెప్పడం వల్ల వాళ్ళ నిర్ణయాన్ని గౌరవించి చేశాను కానీ ఇష్టంతో చేయలేదు అని తేజు తెలిపారు. అభిమానులు కూడా నాకు చెప్పారు. అన్నా మేము మీ పాటలు చూడాలి అనికుంటున్నాం.. చిరంజీవి గారి పాటలు మేము ఆల్రెడీ చూశాం కదా మళ్ళీ ఎందుకు చేస్తున్నారు అని అడిగారు. వాళ్ళు చెప్పింది కూడా నిజమే కదా.

45
మెగా ఫ్యామిలీకి ఇష్టం లేదా ?
Image Credit : our own

మెగా ఫ్యామిలీకి ఇష్టం లేదా ?

రాంచరణ్ చేస్తున్నారు కదా అని అడిగితే.. చిరంజీవి గారి కొడుకుగా చరణ్ కి ఆయన పాటలు చేసే రైట్ ఉంది. అందులో సందేహం లేదు అని తేజు తెలిపారు. చిరంజీవి గారి పాటలు తేజు రీమిక్స్ చేయడం మెగా ఫ్యామిలీలో చాలా మందికి ఇష్టం లేదు. అందుకే ఆపేశారు అనే ప్రచారం ఉంది.. ఎంతవరకు నిజం అని యాంకర్ ప్రశ్నించారు. దీనికి తేజు సమాధానం ఇస్తూ.. అస్సలు నిజం లేదు. మెగా ఫ్యామిలీకి ఇష్టం లేకుంటే ఇన్ని పాటలు ఎలా చేయగలిగేవాడిని అని తేజు అన్నారు.

55
సాయిధరమ్ తేజ్ నెక్స్ట్ మూవీ
Image Credit : our own

సాయిధరమ్ తేజ్ నెక్స్ట్ మూవీ

ఇదిలా ఉండగా సాయిధరమ్ తేజ్ ప్రస్తుతం తన కెరీర్ లోనే అత్యంత భారీ ప్రాజెక్ట్ సంబరాల ఏటి గట్టు చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీని హనుమాన్ నిర్మాతలు చైతన్య రెడ్డి, నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Nagarjuna: ఛి.. ఛి ఇదేం పని అనుకున్న నాగార్జున, బిగ్ బాస్ హోస్ట్ ఎలా అయ్యాడు, కింగ్ షాకింగ్ కామెంట్స్
Recommended image2
Master Bharath: యాక్టర్ నుంచి డాక్టర్ గా.. తల్లి చివరి కోరిక తీర్చడానికి కెరీర్ ను త్యాగం చేసిన మాస్టర్ భరత్...
Recommended image3
Soundarya: చనిపోవడానికి ముందు మేనకోడలితో సౌందర్య ఏమన్నారంటే? చివరి మాటలు ఇవే
Related Stories
Recommended image1
Gunasekhar: ఒక్కడు తర్వాత ఆ మూవీ చేయాల్సింది, హేళన చేశారు.. ఎన్టీఆర్ తో రిస్క్ అన్నారు, డైరెక్టర్ కామెంట్స్
Recommended image2
Ram Charan: మా సినిమా బాగలేక కాదు, రాంచరణ్ వల్లే ఫ్లాప్.. నా భార్య కూడా తిట్టేసింది, డైరెక్టర్ కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved