ఆ హీరోయిన్‌తో 30ఏళ్ల ఘాటు ప్రేమ, సన్నీ డియోల్ ఆమెని పెళ్లెందుకు చేసుకోలే
సన్నీ డియోల్, డింపుల్ కపాడియా 30 ఏళ్ల ప్రేమకథ ఇప్పటికీ చర్చనీయాంశమే. సినిమా సెట్స్ నుండి బస్ స్టాప్ వరకు వీరి ప్రేమకథ గురించి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. మరి పెళ్లేందుకు చేసుకోలేదు.
15

Image Credit : our own
సన్నీ డియోల్ 30ఏళ్ల ప్రేమ కథ
కొన్ని బాలీవుడ్ కథలు కాలంతో పాతబడవు, మరింత ఆసక్తికరంగా మారతాయి. అలాంటిదే సన్నీ, డింపుల్ కథ. బహిరంగంగా బయటపడని ప్రేమకథ, ఇండస్ట్రీలో మాత్రం 30 ఏళ్లుగా చర్చనీయాంశం. ఇన్‌స్టా పోస్ట్‌లు లేవు, రెడ్ కార్పెట్ మీద కలిసి నడవలేదు, అయినా వీరిద్దరి పేర్లు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి.
25
Image Credit : our own
సన్నీ, డింపుల్ ప్రేమ ప్రారంభం అప్పుడే
1984లో ‘మంజిల్ మంజిల్’ సినిమా సెట్లో సన్నీ, డింపుల్ కలిశారు. డింపుల్ రాజేష్ ఖన్నాకి దూరమయ్యారు. సన్నీ డియోల్ కెరీర్ ప్రారంభంలో ఉన్నారు. వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. డింపుల్ ఇంట్లో సన్నీ ఉండేవారని ప్రచారం.
35
Image Credit : our own
90లలో వైరల్ అయిన ఆధారాలు
1990లలో బస్ స్టాప్, సముద్రతీరంలో సన్నీ, డింపుల్ కలిసి ఉన్న ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. వీరిద్దరి మధ్య ఉన్న సంబంధాన్ని ఇవి ధృవీకరించాయి. సన్నీ ఈ విషయంపై ఎప్పుడూ మాట్లాడలేదు.
45
Image Credit : our own
సన్నీ డియోల్, డింపుల్ పెళ్లి ఎందుకు చేసుకోలేదు..?
1. సన్నీకి ఇదివరకే పెళ్లయింది. 2. డియోల్ కుటుంబంలో ఇదివరకే గొడవలు ఉన్నాయి. 3. డింపుల్ స్వేచ్ఛను ఇష్టపడతారు.
55
Image Credit : our own
ఇప్పటికీ సంబంధం ఉందా?
ఇద్దరూ కలిసి బహిరంగంగా కనిపించడం చాలా తక్కువ. కానీ వీరి మధ్య ఇప్పటికీ బలమైన బంధం ఉందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
Latest Videos