Amitabh in Hyderabad : అమితాబ్ బచ్చన్ ను హైదరాబాద్ కు పిలిపించిన ఆర్జీవీ.. ఎందుకంటే?

బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) హైదరాబాద్ కు వచ్చారు. రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) ప్రత్యేకంగా పిలిపించడం ఆసక్తికరంగా మారింది.
 

Amitabh Bachchan came to Hyderabad for Director Ram Gopal Varma NSK

డాషింగ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఇప్పుడంటే కాంట్రవర్సీలకు సంబంధించిన చిత్రాలు.. గ్లామర్ డోస్ ఉంటున్న చిత్రాలు తీసుకున్నారు కానీ... అప్పట్లో తన చిత్రాలతో సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా బాలీవుడ్ లో ఆర్జీవీ ఓ సంచలనం. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఆయన ఫ్యాక్టరీ నుంచి వచ్చిన వారే 50 శాతం మంది టెక్నీషియన్లు, డైరెక్టర్లు ఇతర డిపార్ట్ మెంట్ లో ఉండటం విశేషం. 

ఇదిలా ఉంటే... రామ్ గోపాల్ వర్మ తెలుగులో కింగ్ నాగార్జునను ఎంతగానో అభిమానిస్తారు. అలాగే బాలీవుడ్ లో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan)ను కూడా చాలా గౌరవిస్తారు. అమితాబ్ తో ఆర్జీవీ బంధం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆర్జీవీ మాటకు ఎప్పుడూ అమితాబ్ నో చెప్పలేదు. ఈ విషయాన్ని ఆర్జీవీ పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు. 

అయితే.. తాజాగా ఆర్జీవీ అమితాబ్ ను హైదరాబాద్ కు పిలిపించడం ఆసక్తికరంగా మారింది. ఆయన ప్రస్తుతం తెరకెక్కిస్తున్న పొలిటికల్ డ్రామా ‘వ్యూహం’ (Vyooham) రెండు రోజుల్లో విడుదల కాబోతోంది. మార్చి 1న రిలీజ్ కానుండగా.. ఇవ్వాళ ప్రీమియర్ షోను ప్రదర్శించినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా అమితాబ్ బచ్చన్ కు స్పెషల్ షోను ప్రదర్శించారంట. అందుకోసమే అమితాబ్ బచ్చన్ హైదరాబాద్ కు వచ్చారని తెలుస్తోంది. 

కాగా, వ్యూహం సినిమాను అమితాబ్ బచ్చన్ ప్రత్యేకంగా చూపించాల్సిన అవసరం ఏముందని అందరూ చర్చించుకుంటున్నారు. తన సినిమా ప్రమోషన్ కోసమా అంటే.. ఆర్జీవీ సినిమాలను ప్రమోట్ చేసుకోవడంలో ఎంత దిట్టనో అందరికీ తెలిసిందే... ఇంకేమై ఉంటుందని ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో మళ్లీ వీరి కాంబోలో ఏమైనా సెట్ అవ్వుద్దా అని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం అమితాబ్ తో ఆర్జీవీ ఉన్న ఫొటో వైరల్ గా మారింది. గతంలో ‘సర్కార్‘, ‘నిశబ్ద్’, ‘రాన్‘, ‘ఏఏజీ’ వంటి సినిమాలు వచ్చాయి.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios