Aishwarya rai : అందానికి మరో రూపం ఐశ్వర్యరాయ్.. ఆమె జీవితంలో ఏం జరిగిందంటే.. ?
Aishwarya rai : అందం అంటే ముందుగా మనకు గుర్తుకు వచ్చే ఏకైక పేరు ఐశ్వర్యరాయ్, ఎంత మంది అందమైన హీరోయిన్లు ఉన్నా ఈ విశ్వసుందరి అందం తర్వాతే అనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.
Aishwarya rai : ఐశ్వర 1973 నవంబర్ 1న కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరులో జన్మించింది. క్రిష్ణరాజ్ రాయ్, వ్రింద రాయ్ తల్లిదండ్రులు. ఐషుకి సోదరుడు ఆదిత్య రాయ్ ఉన్నాడు. 2007లో అభిషేక్ బచన్ ను మ్యారేజ్ చేసుకుంది. ఐశ్వర్యకు కూతురు ఆరాధ్య బచన్ ఉంది.
విశ్వసుందరిగా..
తను ముంబైలోని డీజీ రుపేరల్ ఆఫ్ ఆర్ట్స్ కాలేజీలో చదువుకునే రోజుల్లోనే మోడలింగ్, టీవీ యాడ్స్ లో నటించిన ఐశ్వర్య మంచి గుర్తింపు పొందింది. తన సక్సెస్ జీవితాన్ని పొందేందుకు ఎంతో కృషి చేసింది. మోడలింగ్ తో పాటు కొన్ని టీవీ ప్రకటనల్లో నటించిన ఐశ్వర్య మిస్ ఇండియా పోటీల్లో రెండో ప్లేస్ లో నిలిచింది. తొలుత 1994లో నిర్వహించిన మిస్ ఇండియా పోటీల్లో సుస్మితా సేన్ మొదటి స్థానం పొందగా, ఐశ్వర్య రెండో స్థానంలో నిలిచింది. అదే ఏడాది నిర్వహించిన మిస్ వరల్డ్ కాంపిటీషన్లో విశ్వసుందరిగా నిలిచారు ఐశ్వర్య. అంతేకాకుండా మిస్ వరల్డ్ టైటిల్, మిస్ కాట్ వాక్, మిస్ మిరాకులస్, మిస్ ఫొటోజెనిక్, మిస్ పర్ఫెక్ట్ టెన్, మిస్ పాపులర్ టైటిళ్లు గెలుచుకుంది. ఈమె నటించిన పెప్సీ యార్డ్ తో చాలా ప్రఖ్యాతి పొందింది.
సినీ ప్రస్థానం :
మిస్ వరల్డ్ గా పేరొందిన ఐషు, ఆపై వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ తన కేరీర్ ను ప్రారంభించింది. 1977 తమిళంలో మణిరత్నం దర్శకత్వం వహించిన పొలిటికల్ డ్రామా ‘ఇరువర్’(తెలుగులో ఇద్దరు)లో నటించి తేరంగేట్రం చేసింది. ఈ మూవీ ఐషుకి డెబ్యూ ఫిల్మ్. అదే సంవత్సరంలో బాలీవుడ్ లో డెబ్యూ ఫిల్మ్ ‘ఔర్ ప్యార్ హో గయా’లో నటించి మంచి గుర్తింపు పొందింది. జీన్స్, హమ్ దిల్ దే చుకే సనమ్ నటించింది. తెలుగు, హిందీ, తమిళ్, బెంగాలీ, ఇంగ్లీష్ భాషల్లో మొత్తం 45 సినిమాల్లో పని చేసింది. రెండు డాక్యుమెంట్రీల్లోనూ నటించింది. జోదా అక్బర్, దూమ్ 2, రోబో వంటి చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల మన్నలను పొందింది.
అవార్డ్స్...
తమిళ్ లో నటించిన జీన్స్ సినిమాతో మొదటి హిట్ అందుకు ఐశ్వర్య, హమ్ దిల్ దే చుకే సనమ్ (1999), దేవదాస్ సినిమాల్లోని నటనకుగానూ ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారాలు అందుకున్నారు. 2009లో ఆమెను ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది.