MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Romanchakam Movie Review
Ayodhya Ram Mandir CEO
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • Anchor Suma Remuneration: యాంకర్‌ సుమ ఎంత పారితోషికం తీసుకుంటుందో తెలిస్తే మతిపోవాల్సిందే.. స్టార్‌ హీరోల రేంజ్‌

Anchor Suma Remuneration: యాంకర్‌ సుమ ఎంత పారితోషికం తీసుకుంటుందో తెలిస్తే మతిపోవాల్సిందే.. స్టార్‌ హీరోల రేంజ్‌

యాంకర్‌ సుమ కనకాల ఒకప్పుడు టీవీ షోస్‌తో బిజీగా ఉండేది, ఇప్పుడు సినిమా ఈవెంట్లతో బిజీగా ఉంటోంది. ఆమె స్టార్‌ హీరోల రేంజ్‌లో సంపాదిస్తోంది. మరి సుమ ఒక్కో ఈవెంట్ కి ఎంత పారితోషికం తీసుకుంటుందో తెలుసా? 

2 Min read
Author : Aithagoni Raju
Published : Apr 22 2026, 11:08 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
బుల్లితెరని ఏలేస్తున్న యాంకర్‌ సుమ
Image Credit : facebook.com/SumaKanakala

బుల్లితెరని ఏలేస్తున్న యాంకర్‌ సుమ

బుల్లితెరపై రారాజుగా వెలుగుతోంది యాంకర్‌ సుమ. ఆమె దాదాపు రెండు దశాబ్దాలుగా తిరుగులేని స్టార్‌ యాంకర్‌గా రాణిస్తోంది. తనే నెంబర్‌ వన్‌లో ఉంటోంది. ఎంతో మంది యాంకర్లు వచ్చారు, పోయారు, తాను మాత్రం లోకల్‌ అనిపించుకుంది. యాంకర్‌గా తిరుగులేని స్టార్‌డమ్‌తో రాణిస్తోంది. అదే సమయంలో అత్యంత ఖరీదైన యాంకర్‌గానూ నిలుస్తోంది. అవును.. ఇప్పుడు తెలుగు యాంకర్లలో యాంకర్‌ సుమ చాలా కాస్ల్టీ అని చెప్పొచ్చు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఈవెంట్లతో బిజీగా ఉన్న సుమ కనకాల
Image Credit : Asianet News

ఈవెంట్లతో బిజీగా ఉన్న సుమ కనకాల

యాంకర్‌ సుమ సినిమా ఈవెంట్లు చేస్తుంటుంది. ప్రత్యేక ఈవెంట్లు చేస్తుంది. టీవీ షోస్‌ చేస్తుంటుంది. అలాగే సెలబ్రిటీ ఇంటర్వ్యూలు, సినిమా ప్రమోషనల్‌ ఇంటర్వ్యూలు చేస్తుంటుంది. దీనితోపాటు సొంతంగా యూట్యూబ్‌ వీడియోలు, ఫన్నీ కామెడీ వీడియోలు చేస్తుంటుంది. ప్రమోషనల్‌ వీడియోలు చేస్తుంటుంది. ఇలా సుమ రెండు చేతులా కాదు, పది రకాలుగా సంపాదిస్తోంది. మరి యాంకర్‌ సుమ ఒక్కో షోకి ఎంత పారితోషికం తీసుకుంటుంది. ఒక్క ఈవెంట్‌ చేస్తే నిర్మాతలు ఎంత ఇచ్చుకోవాల్సి ఉంటుంది. సినిమా టీమ్‌ ఇంటర్వ్యూలు చేస్తే ఎంత డిమాండ్‌ చేస్తుందనే వివరాలు తెలుసుకుంటే ఆమె నెలకు ఎంత సంపాదిస్తుందో తెలిస్తే మైండ్‌ బ్లాక్‌ కావాల్సిందే.

Related Articles

Related image1
Top 10 Actress: నయనతారని దెబ్బకొట్టిన రష్మిక, నెం 1 హీరోయిన్‌ ఎవరంటే?
Related image2
MSG 100 Days: మన శంకర వర ప్రసాద్‌ గారు టోటల్‌ కలెక్షన్లు.. కూతురు సుస్మిత లైఫ్‌ సెట్‌ చేసిన చిరంజీవి
35
యాంకర్‌ సుమ పారితోషికం
Image Credit : suma insta

యాంకర్‌ సుమ పారితోషికం

పెద్ద హీరోల నుంచి యంగ్‌ స్టర్స్ వరకు అందరు హీరోల సినిమాల ఈవెంట్లకి యాంకర్‌ గా సుమ ఉండాల్సిందే. ఆమె యాంకరింగ్‌ చేస్తే ఆ ఈవెంట్‌ సందడిగా ఉంటుంది. దానికో కళ వస్తుంది. నిర్మాతలు నమ్మేది, ఆమెని తీసుకునేది అందుకే. తను ఎలాంటి విషయాన్ని అయినా ఈజీగా మ్యానేజ్‌ చేయగలదు. ఈవెంట్‌ని సక్సెస్‌ చేయగలదు. అందుకే అందరు సుమకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తుంటారు. ఈ విషయంలో ఖర్చుకి వెనకాడరు. మరి ఒక్క సినిమా ఈవెంట్‌ చేస్తే సుమ ఎంత పారితోషికం తీసుకుంటుందనేది చూస్తే, ఆమె ఆరు లక్షలు తీసుకుంటుందని సమాచారం. తనకు నచ్చిన ఈవెంట్ అయితే 4 లక్షలు ప్లస్‌ జీఎస్‌టీ ఉంటుంది. నచ్చలేదు, బలవంతంగా చేయాల్సి వస్తుందంటే మాత్రం ఒక్కో ఈవెంట్‌కి 6 లక్షలు ప్లస్‌ జీఎస్‌టీ ఇచ్చుకోవాల్సిందే. ఇందులో తన టీమ్‌ ఖర్చులు అదనం. అన్నింటికి మరో యాభై వేలు అవుతుందని చెప్పొచ్చు. ఇలా ఆరున్నర లక్షల వరకు నిర్మాతలు సుమకి సమర్పించుకోవాల్సిందే.

45
సుమకి ప్యాకేజీ రెమ్యూనరేషన్‌
Image Credit : suma insta

సుమకి ప్యాకేజీ రెమ్యూనరేషన్‌

దీంతోపాటు సినిమా ప్రమోషన్స్ లో భాగంగా, చిత్ర బృందంతో ఇంటర్వ్యూలు చేస్తుంటారు, కొన్నిసార్లు సింగిల్‌గా చేయాల్సి వస్తుంటుంది. అలాంటి వాటికి మూడు లక్షల వరకు తీసుకుంటుందని సమాచారం. అయితే ఇందులో మరో ప్యాకేజీ సిస్టమ్‌ కూడా ఉంది. కొన్నిసార్లు ఈవెంట్‌తోపాటు టీమ్‌ ఇంటర్వ్యూలు కూడా ఉంటాయి. అలాంటి సందర్భాల్లో తనకు నచ్చితే 6.5-7లక్షల వరకు ఇవ్వాల్సి వస్తుంది. నచ్చకపోతే మరో రెండు లక్షలు అదనంగా ఇచ్చుకోవాలి. ఇలా రెండు రకాలుగా యాంకర్‌ సుమ పారితోషికం తీసుకుంటుంది.

55
టీవీ షోస్‌కి సుమ ఎంత తీసుకుంటుందంటే?
Image Credit : suma insta

టీవీ షోస్‌కి సుమ ఎంత తీసుకుంటుందంటే?

దీంతోపాటు టీవీ షోస్‌ కూడా చేస్తుంది సుమ. ఒకప్పుడు బుల్లితెరని ఏలిన ఆమె ఇప్పుడు తగ్గించింది. `సుమ అడ్డ` పేరుతోనే ఒక్క షో చేస్తుంది. దీనికి ఎపిసోడ్‌కి రెండున్నర లక్షలు తీసుకుంటుందట. ఇలా నెలకు నాలుగు ఎపిసోడ్లు చేస్తే పది లక్షలు అందుకుంటోంది. మరోవైపు ఈవెంట్లు, ఇంటర్వ్యూలు ద్వారా కూడా గట్టిగానే సంపాదిస్తోంది యాంకర్‌ సుమ. నెలకు ఈజీగా పది వరకు ఈవెంట్లు చేస్తుంది. అంటే ఆమె నెలకు రూ.60-70లక్షల వరకు వీటి ద్వారా సంపాదిస్తుందని చెప్పొచ్చు. టీవీ షో మరో పది లక్షలు, ఇతర ప్రమోషన్స్, కమర్షియల్‌ యాడ్స్, యూట్యూబ్‌ వీడియోలో ఇలా అన్ని కలిపితే సుమ నెలకి కోటి రూపాయల వరకు సంపాదిస్తుందని ఇండస్ట్రీ వర్గాల టాక్‌. ఇలా ఏడాదికి రూ.12కోట్లకుపైగానే సంపాదిస్తోంది. ఇది స్టార్‌ హీరోల పారితోషికంతో సమానం. ఈ లెక్కల స్టార్‌ హీరోల రేంజ్‌లో యాంకర్‌ సుమ సంపాదిస్తోందని చెప్పొచ్చు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Mokshagna: మోక్షజ్ఞ గ్రాండ్ ఎంట్రీపై క్లారిటీ? ముహూర్తం ఫిక్స్ చేసిన బాలకృష్ణ, రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
Recommended image2
Krishna Movies: కృష్ణాష్టమికి చూడాల్సిన 7 యానిమేటెడ్ సినిమాలు ఇవే!
Recommended image3
భయపెడుతూ నవ్వించి, 180 కోట్లు కొల్లగొట్టిన హారర్ సినిమా.. ఓటీటీలో ఇప్పటికీ ట్రెండింగే!
Related Stories
Recommended image1
Top 10 Actress: నయనతారని దెబ్బకొట్టిన రష్మిక, నెం 1 హీరోయిన్‌ ఎవరంటే?
Recommended image2
MSG 100 Days: మన శంకర వర ప్రసాద్‌ గారు టోటల్‌ కలెక్షన్లు.. కూతురు సుస్మిత లైఫ్‌ సెట్‌ చేసిన చిరంజీవి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved