MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Peddi Collections: ఫస్ట్ డే పెద్ది బాక్సాఫీసు వద్ద ఊచకోత.. ప్రభాస్‌, ఎన్టీఆర్‌ రికార్డులు బ్రేక్‌

Peddi Collections: ఫస్ట్ డే పెద్ది బాక్సాఫీసు వద్ద ఊచకోత.. ప్రభాస్‌, ఎన్టీఆర్‌ రికార్డులు బ్రేక్‌

రామ్‌ చరణ్‌ నటించిన `పెద్ది` మూవీ మొదటి రోజు ఎంత కలెక్షన్లని సాధించబోతుందనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఈ చిత్రం ప్రభాస్‌, ఎన్టీఆర్‌ మూవీల రికార్డులను బ్రేక్‌ చేయబోతుందట. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Jun 04 2026, 08:42 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
భారీ అంచనాల మధ్య రిలీజ్‌ అయిన పెద్ది
Image Credit : Asianet News

భారీ అంచనాల మధ్య రిలీజ్‌ అయిన పెద్ది

రామ్‌ చరణ్‌ హీరోగా నటించిన `పెద్ది` సినిమా థియేటర్‌లో సందడి చేస్తుంది. చాలా సార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ మూవీ ఎట్టకేలకు ఈ గురువారం(జూన్‌ 4)న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. భారీ అంచనాల మధ్య, భారీ స్థాయిలో దీన్ని రిలీజ్‌ చేశారు. రామ్‌ చరణ్‌ చివరి మూవీ `గేమ్‌ ఛేంజర్‌` బాక్సాఫీసు వద్ద డిజప్పాయింట్‌ చేయడంతో ఈ చిత్రంపై మెగా అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. ఈ మూవీతో ఎలాగైనా హిట్‌ కొట్టాలనే కసితో ఉన్నారు. రామ్‌ చరణ్‌ కూడా అంతే కసితో సినిమాలో నటించారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
నటనతో దుమ్ములేపిన రామ్‌ చరణ్‌
Image Credit : Asianet News

నటనతో దుమ్ములేపిన రామ్‌ చరణ్‌

బుధవారం రాత్రి ప్రీమియర్స్ తో విడుదలైన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభిస్తోంది. అభిమానులను అలరించే యాక్షన్‌ సీన్లు, ఎలివేషన్లు లేవని అంటున్నారు. స్లోగా సాగుతుందనే కామెంట్‌ వస్తుంది. డ్రైగా ఉందని చెబుతున్నారు. కానీ రామ్‌ చరణ్‌ నటనకు ప్రశంసలు దక్కుతున్నాయి. నటుడిగా చరణ్‌ విశ్వరూపం చూపించారని చెబుతున్నారు. నిజానికి చరణ్‌ తన కెరీర్‌ బెస్ట్ యాక్టింగ్‌ని ఇందులో చూపించారని చెప్పొచ్చు. ఒకప్పుడు తన నటనపై విమర్శలు వచ్చేవి, కానీ ఇప్పుడు బెస్ట్ యాక్టర్‌గా పేరు తెచ్చుకోవడం విశేషం.

Related Articles

Related image1
Peddi Movie Review: పెద్ది మూవీ రివ్యూ, రేటింగ్‌.. రామ్‌ చరణ్‌, జాన్వీకపూర్‌ల సినిమా ఎలా ఉందంటే?
Related image2
Chiranjeevi Review: రామ్‌ చరణ్‌ పెద్ది సినిమాపై చిరంజీవి రివ్యూ.. తండ్రిగా గర్వపడే విషయం బయటపెట్టిన మెగాస్టార్‌
35
భారీ స్థాయిలో పెద్ధి ఓపెనింగ్స్
Image Credit : Asianet News

భారీ స్థాయిలో పెద్ధి ఓపెనింగ్స్

బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందిన `పెద్ది` సినిమాకి ఇప్పటికైతే టాక్‌ మిక్స్ డ్‌గానే ఉంది. మరో రెండు మూడు రోజులు అయితే గానీ స్పష్టంగా మూవీ రిజల్ట్ ఏంటనేది క్లారిటీ రాదు. అయితే భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ మొదటి రోజు ఎంత వసూలు చేస్తుంది. ప్రీమియర్స్ ద్వారా ఎంత వసూలు చేసిందనేది చూస్తే, ఆసక్తికర లెక్కలు వినిపిస్తున్నాయి. మొదటి రోజు భారీగా వసూలు చేయబోతుందని తెలుస్తోంది. అడ్వాన్స్ బుకింగ్స్, ఇప్పటి వరకు బుక్‌ అయిన టికెట్‌ లెక్కల ప్రకారం సినిమా గట్టిగానే రాబడుతుందని అంటున్నారు.

45
పెద్ది మొదటి రోజు కలెక్షన్ల అంచనా
Image Credit : youtube

పెద్ది మొదటి రోజు కలెక్షన్ల అంచనా

పెద్ది సినిమా ప్రీమియర్స్ ద్వారా సుమారు రూ.38కోట్లు రాబట్టిందట. ఇండియాలోనే ఇరవై కోట్ల వరకు వచ్చాయని, ఓవర్సీస్‌లోనూ గట్టిగానే సాధించిందని టాక్. ఇక పెద్ది ఓపెనింగ్ కలెక్షన్ల వివరాలు చూస్తే అదిరిపోతున్నాయి. ఈ చిత్రం మొదటిరోజు రూ.120-130 కోట్ల వరకు రాబట్టే ఛాన్స్ ఉందని ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటి వరకు సేల్‌ అయిన టికెట్లని బట్టి ఈ లెక్క చెబుతున్నారు. అయితే ఈ రోజు ఫినిష్‌ అయ్యే దాన్ని బట్టి ఇందులో స్వల్పంగా మార్పు ఉండే అవకాశం ఉంది. కానీ రామ్‌ చరణ్‌ కెరీర్‌లో మరో అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన మూవీగా `పెద్ది` నిలుస్తుందని అంటున్నారు.

55
ప్రభాస్‌, ఎన్టీఆర్‌ మూవీస్‌ ని దాటబోతున్న పెద్ది
Image Credit : Asianet News

ప్రభాస్‌, ఎన్టీఆర్‌ మూవీస్‌ ని దాటబోతున్న పెద్ది

రామ్‌ చరణ్‌ చివరా నటించిన `గేమ్‌ ఛేంజర్‌` రూ.186కోట్లు రాబట్టిందని పోస్టర్లో వేశారు. నిజానికి అందులో సగమే వచ్చాయని టాక్‌. ఆ లెక్కన `పెద్ది` చరణ్‌ గత చిత్రాన్ని దాటేస్తుందని చెప్పొచ్చు. అదే సమయంలో ప్రభాస్, ఎన్టీఆర్‌ చిత్రాలను కూడా ఈ మూవీ దాటబోతుంది. ప్రభాస్‌ చివరి మూవీ `ది రాజా సాబ్‌`. మొదటి రోజు ఇది రూ.95కోట్లు రాబట్టింది. ఎన్టీఆర్‌ నటించిన `వార్‌ 2` కూడా రూ.85కోట్లు సాధించింది. ఈ రెండు చిత్రాలను `పెద్ది` దాటబోతుందని టాక్‌. మరి ఏ స్థాయిలో సత్తా చాటుతుందో చూడాలి.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
రామ్ చరణ్ కొణిదెల
ప్రభాస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
తెలుగు సినిమా
Latest Videos
Recommended Stories
Recommended image1
Darshan Viral Video: లైవ్‌లోకి వచ్చిన దర్శన్, కన్నీళ్లు పెట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్
Recommended image2
Folk Song: వెండి తెర‌పై యూట్యూబ్ సెన్సేష‌న్‌.. ఫోక్ సాంగ్స్‌తో మెప్పించి, ఇప్పుడు సినిమాల్లో..
Recommended image3
Prabhas: ఒక హీరో మా ఇంటికొచ్చి నన్ను హగ్‌ చేసుకోవడం అదే మొదటిసారి.. ప్రభాస్‌కి షాకిచ్చిన స్టార్‌ ఎవరంటే?
Related Stories
Recommended image1
Peddi Movie Review: పెద్ది మూవీ రివ్యూ, రేటింగ్‌.. రామ్‌ చరణ్‌, జాన్వీకపూర్‌ల సినిమా ఎలా ఉందంటే?
Recommended image2
Chiranjeevi Review: రామ్‌ చరణ్‌ పెద్ది సినిమాపై చిరంజీవి రివ్యూ.. తండ్రిగా గర్వపడే విషయం బయటపెట్టిన మెగాస్టార్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved