MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • MSG 100 Days: మన శంకర వర ప్రసాద్‌ గారు టోటల్‌ కలెక్షన్లు.. కూతురు సుస్మిత లైఫ్‌ సెట్‌ చేసిన చిరంజీవి

MSG 100 Days: మన శంకర వర ప్రసాద్‌ గారు టోటల్‌ కలెక్షన్లు.. కూతురు సుస్మిత లైఫ్‌ సెట్‌ చేసిన చిరంజీవి

చిరంజీవి హీరోగా రూపొందిన `మన శంకర వర ప్రసాద్‌ గారు` మూవీ సంక్రాంతికి విడుదలై పెద్ద హిట్‌ అయ్యింది. ఇప్పుడు ఏకంగా వంద రోజులు పూర్తి చేసుకుంది. మరి ఈ చిత్రానికి ఇప్పటి వరకు ఎన్ని కోట్ల కలెక్షన్లు వచ్చాయనేది చూస్తే.  

2 Min read
Author : Aithagoni Raju
Published : Apr 21 2026, 07:43 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మన శంకర వర ప్రసాద్‌ గారు ఇండస్ట్రీ హిట్‌
Image Credit : Asianet News

మన శంకర వర ప్రసాద్‌ గారు ఇండస్ట్రీ హిట్‌

మెగాస్టార్‌ చిరంజీవి చాలా రోజుల తర్వాత హిట్‌ కొట్టారు. ఈ సంక్రాంతికి `మన శంకర వర ప్రసాద్‌ గారు` మూవీతో ఆడియెన్స్ ని అలరించిన విషయం తెలిసిందే. తన రేంజ్‌ ఏంటో తెలియజేసే బ్లాక్‌ బస్టర్‌ని అందుకున్నారు. ఈ సినిమా ఏకంగా రీజనల్‌ మూవీస్‌లో ఇది ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. అయితే ఈ సినిమా ఇప్పుడు సరికొత్త మైల్‌ స్టోన్‌ని చేరుకుంది. వంద రోజులు పూర్తి చేసుకుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
వంద రోజులు పూర్తి చేసుకున్న చిరంజీవి మూవీ
Image Credit : X/@Shine_Screens

వంద రోజులు పూర్తి చేసుకున్న చిరంజీవి మూవీ

ఇప్పుడున్న కాలంలో ఒక సినిమా పది రోజులు ఆడితే గ్రేట్‌. నెల రోజులు ఆడితే రికార్డు. యాభై రోజులు ప్రదర్శించబడితే అది అరుదైన రికార్డుగా చెబుతుంటారు. అయితే చిరంజీవి హీరోగా వచ్చిన `మన శంకర వర ప్రసాద్‌ గారు` మూవీ మాత్రం ఏకంగా వంద రోజులు పూర్తి చేసుకుంది. మైదుకూరు లోని వెంకటేశ్వర థియేటర్లో, అలాగే ఎర్రగుండ్లలని హేమ పిక్చర్ ప్యాలెస్‌లో  వంద రోజులు పూర్తి చేసుకోవడం విశేషం. దీంతో చిరంజీవి సినిమా సరికొత్త రికార్డుని క్రియేట్‌ చేసిందని చెప్పొచ్చు.

35
మన శంకర వరప్రసాద్‌ గారు మూవీ బిజినెస్‌
Image Credit : X/@Shine_Screens

మన శంకర వరప్రసాద్‌ గారు మూవీ బిజినెస్‌

`మన శంకర వర ప్రసాద్‌ గారు` మూవీ వంద రోజులు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఈ చిత్రానికి ఇప్పటి వరకు ఎన్ని కలెక్షన్లు వచ్చాయి. ఈ సినిమాని నిర్మించడం వల్ల నిర్మాతలు ఎంత లాభాలు గడించారనేది చూస్తే. ఈ మూవీకి అయిన బడ్జెట్‌ రూ.150-200కోట్లు అని సమాచారం. ఈ చిత్రానికి రూ.120కోట్ల థియేట్రికల్‌ బిజినెస్‌ అయ్యింది. ఓటీటీ రైట్స్, శాటిలైట్‌, ఆడియో రైట్స్ కలుపుకొని సుమారు రూ.60కోట్లకుపైగా వచ్చినట్టు సమాచారం. అంటే ఈ సినిమా రిలీజ్‌ కి ముందే ప్రాఫిట్‌లో ఉంది.

45
మన శంకర వర ప్రసాద్‌ గారు మూవీ టోటల్ కలెక్షన్లు
Image Credit : Asianet News

మన శంకర వర ప్రసాద్‌ గారు మూవీ టోటల్ కలెక్షన్లు

ఇక ఈ చిత్రం మొత్తం వంద రోజుల్లో సుమారు రూ.305-310 కోట్ల గ్రాస్‌ వసూలు చేసింది. థియేట్రికల్‌ రైట్స్ పోనూ సుమారు రూ.60-70కోట్ల లాభాలు తెచ్చింది. ఈ మూవీని సాహు గారపాటితో కలిసి చిరంజీవి కూతురు సుస్మిత కొణిదెల నిర్మించారు. `మనశంకర వర ప్రసాద్‌గారు` ద్వారా నిర్మాతలకు గట్టిగానే లాభాలు వచ్చాయని చెప్పొచ్చు. అటు బయ్యర్లు, ఎగ్జిబిటర్లు కూడా లాభాలు చూశారు. ఈ సినిమాతో చిరంజీవి కూతురు ఇక నిర్మాతగా సెట్‌ అయ్యిందని, ఆమె లైఫ్‌లోనూ సెటిల్‌ అయ్యిందని చెప్పొచ్చు. భవిష్యత్‌లో భారీ సినిమాలు రూపొందించే ప్లాన్‌లో ఉందని సమాచారం.

55
ఆడియెన్స్ కి ఫుల్‌ మీల్స్ పెట్టిన మన శంకర వర ప్రసాద్‌ గారు
Image Credit : X/@Shine_Screens

ఆడియెన్స్ కి ఫుల్‌ మీల్స్ పెట్టిన మన శంకర వర ప్రసాద్‌ గారు

చిరంజీవి హీరోగా, నయనతార హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించారు. ఇందులో వెంకటేష్ క్యామియో రోల్‌ చేశారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రం విడుదలైంది. క్లైమాక్స్ కి ముందు వచ్చిన ఆయన మూవీని మరో స్థాయికి తీసుకెళ్లారు. అయితే ఇదొక రెగ్యూలర్‌ కమర్షియల్‌ మూవీ. కామెడీ బాగా వర్కౌట్‌ చేయడంలో దర్శకుడు సక్సెస్‌ అయ్యాడు. అదే సమయంలో ఫ్యామిలీ అంశాలను పర్‌ ఫెక్ట్ గా బ్లెండ్‌ చేశాడు.  చిన్నపిల్లలకు కనెక్ట్ అయ్యే అంశాలను, ఆడవాళ్లకి సంబంధించిన సీన్లు కూడా పెట్టాడు‌. మొత్తంగా మంచి ఫుల్‌ మీల్స్ పెట్టాడని చెప్పొచ్చు. దీంతో ఆడియెన్స్ బ్రహ్మరథం పట్టారు. మూవీని బ్లాక్‌ బస్టర్‌ చేశారు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
నయనతార
దగ్గుబాటి వెంకటేష్
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Rakul Preet Singh IT Raid: రకుల్ ప్రీత్ సింగ్, వాసు భగ్నానీ ఇళ్లపై ఐటీ దాడులు.. దృశ్యం 3 నిర్మాణ సంస్థపై కూడా
Recommended image2
Bigg Boss Telugu 10: కట్టలు తెచ్చుకున్న ముఖేష్‌, వర్షిణి రొమాన్స్.. పాపం దేబ్జానీ బకరా అయిపోయిందిగా
Recommended image3
30 కోట్ల రెమ్యునరేషన్, 300 కోట్లకుపైగా ఆస్తులు, 4000 కోట్ల బడ్జెట్ సినిమా చేస్తున్నహీరో?
Related Stories
Recommended image1
Top 10 Heroes: విజయ్‌కి దిమ్మతిరిగే షాక్‌ ఇచ్చిన అల్లు అర్జున్‌.. పడిపోయిన చరణ్‌, పవన్‌.. నెం 1 ఎవరంటే?
Recommended image2
ఫస్ట్ రూ.10కోట్ల పారితోషికం తీసుకున్న హీరో ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved