- Home
- Entertainment
- చూడ్డానికి విలన్ లా ఉన్నాడే, ఈయన హీరోనా ? చిరంజీవి ని అంత మాట అన్న హీరోయిన్ ఎవరో తెలుసా?
చూడ్డానికి విలన్ లా ఉన్నాడే, ఈయన హీరోనా ? చిరంజీవి ని అంత మాట అన్న హీరోయిన్ ఎవరో తెలుసా?
మెగాస్టార్ చిరంజీవి 45 ఏళ్ల కెరీర్ లో ఎంతో మంది హీరోయిన్స్ తో కలిసి నటించాడు. ఎందరో తారలను తన సినిమాల ద్వారా స్టార్స్ గా మార్చాడు మెగాస్టార్. అయితే చిరంజీవితో చాలా సినిమాల్లో నటించిన ఓ హీరోయిన్ మాత్రం ఆయన హీరోలా లేడు విలన్ లా ఉన్నాడని అనేసిందట.

విలన్ పాత్రల నుంచి హీరోగా..
మెగాస్టార్ చిరంజీవి మాత్రమే కాదు.. మోహన్ బాబు, రజినీకాంత్ లాంటి స్టార్ హీరోలు కూడా కెరీర్ బిగినింగ్ లో విలన్ పాత్రలు చేసినవారే. ఒక రకంగా చెప్పాలంటే.. నెగెటీవ్ రోల్స్ చేసి.. హీరోలుగా మారిన తరువాతే ఇండస్ట్రీలో వారు స్టార్లుగా గుర్తింపు సాధించారు. చిరంజీవి అయితే.. చిన్న చిన్న పాత్రలతో కెరీర్ ను స్టార్ట్ చేసి.. హీరోగా, సుప్రీమ్ హీరోగా, మెగాస్టార్ గా ఎదిగాడు. అయితే చిరంజీవి కెరీర్ బిగినింగ్ లో.. వరుసగా హిట్లు కొడుతున్న టైమ్ లో.. ఓ హీరోయిన్ మెగాస్టార్ ను పట్టుకుని..హీరోలా లేడే.. అని కామెంట్ చేసింది.. ఆతరువాత ఆమె చిరుతో ఎక్కవ సినిమాలు చేసింది.
చిరంజీవి సుహాసిని కాంబినేషన్..
చిరంజీవిపై కామెంట్లు చేసిన హీరోయిన్ ఎవరో కాదు సుహాసిని. ఈ విషయాన్ని ఆమే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. 80స్ లో చిరంజీవి హీరోగా ఎదుగుతూ.. వరుసగా సినిమాలు చేస్తూ వచ్చాడు. అప్పుడే సుహాసినితో కాంబినేషన్ కుదిరింది. వీరిద్దరు కలిసి. మగమహారాజు, చంటబ్బాయి, లాంటి హిట్ సినిమాలు చేశారు. చిరంజీవి జోడీగా సుహాసిన నటించిన మొదటి సినిమా మగమహారాజు. ఈసినిమా షూటింగ్ టైమ్ లోనే ఓ విచిత్ర సంఘటన జరిగింది.
సుమలతతో సుహాసిని ఏం చెప్పింది?
మగమహారాజు సినిమా చేస్తున్న టైమ్ లో.. సుహాసిని.. మరో హీరోయిన్ సుమలత ఓ తమిళ సినిమా షూటింగ్ లో కలసుకున్నారట. అప్పుడు సుమలత సుహాసినితో మాట్లాడుతూ..'' చిరంజీవితో సినిమా చేస్తున్నావట కదా.. చాలా లక్కీ నువ్వు.. అక్కడ అప్ కమింగ్ స్టార్ అతను. తమిళంలో కమల్ లాగా.. తెలుగులో చిరంజీవి'' అని చెప్పిందట. వెంటనే సుహాసిని.. " అవునా.. కానీ హీరోలా లేడే.. విలన్ ఫేస్ కట్ ఉంది కదా'' అని కామెంట్ చేసిందట.
మెగాస్టార్ దగ్గర సుహాసిని ఇరికించిన సుమలత..
సుహాసిని చేసిన ఈ కామెంట్స్ ను సుమలత చిరంజీవితో చెప్పేసింది. దాంతో నెక్ట్స్ డే షూటింగ్ నుంచి సుహాసినికి సెట్ లో ర్యాగింగ్ తప్పలేదు. షూటింగ్ లోకి వెళ్లినప్పటి నుంచి.. సుహాసినిని పట్టుకుని చిరంజీవి ఏడిపించడం మొదలు పెట్టారట. '' విలన్లతో ఎందుకు నటిస్తారులే.. విలన్ ఫేస్ కట్ ఉన్నవారితో సినిమాలెందుకు చేస్తారులే..'' అని టైమ్ దొరికినప్పుడల్లా.. చిరు సుహాసినిని టీజ్ చేసేవారట. ఈ విషయాలు ఎందుకు చెప్పావ్ అని సుమలతను అడిగిందట సుహాసిని. ఇదంతా చెపుతూ.. సుహాసిని అప్పటి రోజులను గుర్తు చేసుకున్నారు. ఆతరువాత రోజుల్లో చిరంజీవి, సుహాసిని ఎన్నో సినిమాల్లో నటించడంతో పాటు.. బెస్ట్ ఫ్రెండ్స్ కూడా అయ్యారు.
70 ఏళ్లు వచ్చినా తగ్గేదేలే..
చిరంజీవి తన కెరీర్ ను ట్రెండ్ ను బట్టి మార్చుకుంటూ వెళ్తున్నారు. ప్రజెంట్ జనరేషన్ కు సింక్ అయ్యేలా.. తనను తాను మార్చుకుంటున్నారు. 70 ఏళ్ల వయసులో కూడా అదే గ్రేస్, అదే స్టెప్స్ తో అదరగొడుతున్నాడు మెగాస్టార్. ఫిట్ నెస్ ను ప్రాపర్ గా మెయింటేన్ చేస్తూ.. కుర్రహీరోలకు కుళ్ళు పుట్టేలా చేస్తున్నాడు. ప్రస్తుతం అనిల్ రావిపూడి డైరెక్షన్ లో మన శంకరవరప్రసాదుగారు సినిమాలో నటిస్తున్నాడు చిరంజీవి. ఈమూవీలో డిఫరెంట్ మేకోవర్ తో అభిమానులను అలరించబోతున్నాడు. సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈసినిమా రిలీజ్ కాబోతోంది. ఈమూవీ నుంచి రిలీజ్ అయిన హుక్ స్టెప్ కు భారీగా రెస్పాన్స్ వస్తోంది. ఈ ఏజ్ లో కూడా చిరంజీవి అలాంటి స్టెప్ ను ఎలా వేయగలిగాడు అని అంతా షాక్ అవుతున్నారు.
చిరంజీవి సినిమాల లైన్ అప్..
వరుస ఫెయిల్యూర్స్ తో ఇబ్బంది పడ్డ చిరంజీవి బోలా శంకర్ తరువాత సినిమాలకు లాంగ్ గ్యాప్ ఇచ్చాడు.. రీ ఫ్రెష్ అయ్యి.. విశ్వంభరతో సినిమాలు మొదలు పెట్టాడు. అయితే ఈసినిమా గ్రాఫిక్స్ వర్క్ పెండింగ్ ఉండటంత.. విశ్వంభరను సమ్మర్ కు సెట్ చేసి.. అనిల్ రావిపూడితో.. ఫుల్లీ ఎంటర్టైనర్ ను ముందుకు తీసుకొచ్చాడు. ఈ రెండు సినిమాలతో పాటు.. బాబీ డైరెక్షన్ లో మరో మూవీ చేస్తున్నాడు మెగాస్టార్. ఈసినిమా షూటింగ్ త్వరలో స్టార్ట్ అవుతుందని సమాచారం. వీటితో పాటు శ్రీకాంత్ ఓదేల, వెంకీ కుడుముల సినిమాలపై క్లారిటీ రావాల్సి ఉంది.

