- Home
- Entertainment
- శ్రీదేవి ని ఎత్తుకోనని పట్టుబట్టిన శోభన్ బాబు, డైరెక్టర్ రాఘవేంద్రరావు చేసిన సాహసం ఏంటో తెలుసా?
శ్రీదేవి ని ఎత్తుకోనని పట్టుబట్టిన శోభన్ బాబు, డైరెక్టర్ రాఘవేంద్రరావు చేసిన సాహసం ఏంటో తెలుసా?
షూటింగ్స్ లో చాలా సీరియస్ గా ఉండేవారు నటభూషణ్ శోభన్ బాబు. హీరోయిన్ల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించేవారు. ఓ సారి హీరోయిన్ శ్రీదేవిని ఎత్తుకోవలసి వస్తే.. నావల్ల కాదు అనిముఖం మీదే చెప్పేశాడట. ఆ టైమ్ లో దర్శకుడు ఏం చేశాడో తెలుసా?

శోభన్ బాబు - శ్రీదేవి కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ..
శ్రీదేవి, శోభన్ బాబు కాంబినేషన్ లో ఎన్నో సూపర్ హిట్ మూవీస్ వచ్చాయి. కానీ తెలుగు ఆడియన్స్ మనసుల్లో నిలిచిపోయిన సినిమా మాత్రం దేవత. రాఘవేంద్రరావు డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలో శోభన్ బాబు, శ్రీదేవి కాంబోతో పాటు..జయప్రద కూడా నటించింది. ఈ సినిమాలో జయప్రద, శ్రీదేవి అక్కా చెల్లెలుగా నటించి మెప్పించారు. అక్క కోసం జీవితాన్ని త్యాగం చేసే చెల్లెలి పాత్రలో శ్రీదేవి అద్భుతం చేసింది. లవ్, రొమాన్స్, ఎమోషన్ కలగలిపిన కథతో.. డైరెక్టర్ రాఘవేంద్రరావు ఈసినిమాను రూపొందించారు. దర్శకేంద్రుడి సినిమాలంటే ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈసినిమా కూడా అదే మార్క్ తో రిలీజ్ అయ్యింది.
దేవత పాటలు చాలా ప్రత్యేకం..
దేవత సినిమా కథ ఎంత అద్భుతంగా వర్కౌట్ అయ్యిందో.. ఈసినిమా విజయంలో సంగీతం కూడా అంతే పాత్రను పోషించింది. చక్రవర్తి అందించిన భాణీలు సినిమాకే హైలెట్ అయ్యాయి. మరీ ముఖ్యంగా.. ఈసినిమాలో వెల్లువచ్చి గోదారమ్మ సాంగ్ అయితే ఎవర్ గ్రీన్ గా నిలిచింది. ట్యూన్, బాలు, సుశీల గాత్రం తో పాటు శోభన్ బాబు, శ్రీదేవిల అభినయం పాటను బ్లాక్ బస్టర్ హిట్ చేశాయి. ఇప్పటికీ ఈ పాట ఎక్కడో ఒక చోట వినిపిస్తూనే ఉంటుంది. అయితే ఈ సాంగ్ కు ఓ ప్రత్యకత ఉంది. ఈ పాట షూటింగ్ లో ఓ అనుకోని సంఘటన జరిగింది.
గోదావరి పాయల మధ్య షూటింగ్..
వెల్లువచ్చి గోదారమ్మ సాంగ్ షూటింగ్ అంతా గోదావరి నది పాయల మధ్య ఉండే ఇసుక తిన్నెలలో జరిగింది. అందుకోసం వందల బిందెలు, ఇతర మెటీరియల్స్ అక్కడికి తరలించారు. ఆ బిందెలే సాంగ్ కు ప్రత్యేక ఆకర్శణగానిలిచాయి. పాటలో శ్రీదేవి గ్లామర్ కూడా అప్పటి యువతను బాగా ఆకర్శించింది. అయితే ఈ లొకేషన్ కు చేరుకోవడం కోసం ఓ చిన్న గోదారి పాయను దాటాల్సి వచ్చింది. ఎవరికి వారు ఆ నది దాటి అక్కడికి చేరుకున్నారు. కానీ శ్రీదేవి విషయంలోనే ఓ సమస్య ఏర్పడింది. శ్రీదేవి నది బయటే కాస్ట్యూమ్, మేకప్ వేసుకుని సిద్ధం అయ్యేదట. ఆ నీటి పాయలో దిగితే శ్రీదేవి బట్టలు తడిసిపోతాయి.
శ్రీదేవిని ఎత్తుకోడానికి నో చెప్పిన శోభన్ బాబు..
శ్రీదేవి నడుచుకుంటు నది దాటటంకష్టం ఆమెను ఎత్తుకుని నది దాటించడానికి అక్కడి టెక్నీషియన్స్ ను అడగలేదు. దాంతో హీరో శోభన్ బాబును రాఘవేంద్రరావు అడిగారట... శ్రీదేవిని భుజాలపై ఎక్కించుకుని పాయ దాటించమని. అందుకు శోభన్ బాబు ఒప్పుకోలేదట. ఇక చేసేది లేక శ్రీదేవిని రాఘవేంద్రరావు ఎత్తుకుని ఆ నీటి పాయ దాటించాడట. ఆ సాంగ్ షూటింగ్ పూర్తి అయ్యే వరకు రాఘవేంద్రరావుకి శ్రీదేవిని ఎత్తుకుని ఏరు దాటించడం తప్పలేదట. శోభన్ బాబు నా వల్ల కాదనడంతో శ్రీదేవితో రాఘవేంద్రరావు ఆ ఇబ్బంది తప్పలేదట.
బ్లాక్ బస్టర్ హిట్ సినిమా..
ఈ విషయాన్ని ఓ కార్యక్రమంలో రాఘవేంద్రరావు స్వయంగా వెల్లడించారు. అప్పుడు అక్కడ శ్రీదేవి కూడా ఉన్నారు. ఇక టాలీవుడ్ అందాల నటుడు, సోగ్గాడు శోభన్ బాబు, అతిలోక సుందరి శ్రీదేవి, జయప్రద కాంబినేషన్ రూపొందిన సినిమా దేవత. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని సురేశ్ ప్రొడక్షన్స్ పతాకంపై డి. రామానాయుడు నిర్మించారు. 1982 సెప్టెంబర్ 10న ఘనంగా విడుదలైన ‘దేవత' భారీ సక్సెస్ ను సాధించింది. ఆ ఏడాది రిలీజ్ అయిన సినిమాలన్నింటిలో భారీ కలెక్షన్స్ సాధించి, టాప్ గ్రాసర్స్ లో ఒకటిగా నిలచింది. గతంలోదేవత టైటిల్ తో రెండు సినిమాలు వచ్చినా.. ఈసినిమా తెలుగు ప్రేక్షకులను ఎంతగానో మురిపించిందీ. ఎమోషన్స్, సెంటిమెంట్ ప్రధానంగా తెరకెక్కిన దేవత ఫ్యామిలీ ఆడియన్స్ ను కన్నీరు పెట్టించింది.

