- Home
- Entertainment
- రాజమౌళి ని భయపెట్టిన ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా? అందుకే జక్కన్న ఆ స్టార్ తో సినిమా చేయలేదా?
రాజమౌళి ని భయపెట్టిన ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా? అందుకే జక్కన్న ఆ స్టార్ తో సినిమా చేయలేదా?
రాజమౌళి అంటేనే పనిరాక్షసుడు, సినిమా విషయంలో టార్చర్ పెడుతుంటాడని స్టార్ హీరోలు కూడా భయపడుతుంటారు. అటువంటి జక్కన్ననే భయపెట్టించిన హీరో ఎవరో తెలుసా? అందుకే ఆ హీరోతో రాజమౌళి ఒక్క సినిమా కూడా చేయలేకపోయాడా?

అపజయం లేని దర్శకుడు
టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అపజయం అంటూ లేని దర్శకుడు రాజమౌళి. తెలుగు సినీ పరిశ్రమకు ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకురావడంతో పాటు.. టాలీవుడ్ కే పరిమితం అయిన హీరోలను పాన్ ఇొియా స్టార్స్ గా మార్చిన ఘనత జక్కన్నదే. ఆయన సినిమాలతో ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్ వంటి హీరోల ఇమేజ్ మారిపోయింది. వారి స్టార్ డమ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ప్రభాస్ ని బాహుబలితో, రామ్ చరణ్, ఎన్టీఆర్ లను ఆర్ ఆర్ ఆర్ తో పాన్ ఇండియా స్టార్స్ ని చేశాడు. అంతర్జాతీయంగా మన హీరోలకు గుర్తింపు ఇచ్చిన దర్శకుడు రాజమౌళి.
రాజమౌళి అంటే స్టార్ హీరోలకు భయం..
రాజమౌళి సినిమా అంటే అది హిట్ అవుతుందా.. ప్లాప్ అవుతుందా అనే చర్చ ప్రస్తుతం లేదు.. ఆ సినిమా ఎన్ని రికార్డులు బ్రేక్ చేస్తుంది? ఎన్ని కలెక్షన్లు సాధిస్తుంది. ఎన్ని అవార్డులు సొంతం చేసుకుంటుంది అనే మాట్లాడుకుంటారు. అందుకే రాజమౌళి తో సినిమా అంటే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. అంతే కాదు జక్కన్నతో సినిమా అంటే టార్చర్ కు కూడా రెడీగా ఉండాలి. ఎంతటి స్టార్ హీరో అయినా.. జక్కన్న చెప్పినట్టు వినాల్సిందే.. ఎన్ని టేకులైనా.. పర్ఫెక్ట్ గా వచ్చే వరకూ చేయాల్సిందే. ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి హీరోలు బహిరంగంగానే రాజమౌళి టార్చర్ గురించి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. రాజమౌళి ఒక్క సీన్ కోసం 20 టేకులు తీసుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి.. ఆ 20 లో మొదటి టేక్ బాగుందంటే.. అదే ఫైనల్ చేసిన సందర్భాలు కూడా లేకపోలేదు. జక్కన్నతో వర్క్ ఎక్స్ పీరియన్స్ అలా ఉంటుంది.
రాజమౌళి పని రాక్షసుడు
రాజమౌళి సినిమా అంటే.. ఎంత పెద్ద స్టార్స్ అయినా.. అంతా ఆయన మాట వినాల్సిందే.. ఆకరికి నిర్మాతలు కూడా ఆయన కనుసన్నల్లో పని చేయాల్సిందే. ఏదో సినిమా తీశాము కదా.. మిగతాది నిర్మాత చూసుకుంటాడులే.. అని ఆయన వదిలేయడు. సినిమాకోసం ఎన్ని ప్లాన్లు వేశాడో.. అంతకు మించిన పనిని ప్రమోషన్ కోసం మొదలు పెడతాడు జక్కన్న. ఆయన బుర్రలో వచ్చే ఐడియాలు మామూలుగా ఉండవు.. తాను తీసిన సినిమాను పెద్ద రిస్క్ లు లేకుండానే విపరీతంగా ప్రమోట్ చేయగలడు రాజమౌళి. ఆ సినిమాకు తాను అనుకున్నంత మార్కెట్ చేసిన తరువాతే ఆయన కాస్త ఊపిరిపీల్చుకుంటాడు. అందుకే రాజమౌళి ని పని రాక్షసుడు అంటారు.
రాజమౌళి నే బయపెట్టిన తెలుగు హీరో ఎవరు?
తన పనితో స్టార్ హీరోలను కూడా భయపెట్టించే రాజమౌళి కి ఓ హీరో అంటే చాలా భయం అట. అందుకే ఆయనతో ఒక్క సినిమా కూడా చేయలేదట. ఇంతకీ ఆ హీరో ఎవరో కాదు... నందమూరి బాలకృష్ణ. ఈ విషయం రాజమౌళి గతంలో జరిగిన అన్ స్టాపబుల్ షోలో వెల్లడించారు. బాలకృష్ణ అడిగిన ప్రశ్నకు సమాధానంగా రాజమౌళి తన మనసులో మాట బయటపెట్టాడు. ఇప్పటి వరకు మన కాంబినేషన్ పడలేదు. మా అభిమానులు రాజమౌళి తో మూవీ ఎందుకు చేయలేదని అడిగారు. మీరు నన్ను హ్యాండిల్ చేయలేను అన్నారట... అని బాలకృష్ణ నేరుగా అడిగేశాడు. దానికి సమాధానంగా ''నిజానికి మీరంటే నాకు భయం. అందుకే సినిమా చేయలేదు. కానీ మీరు డైరెక్టర్ ఫ్రెండ్లీ హీరో. ఎంత చిన్న హీరో అయినా.. చెప్పింది చెప్పినట్టు చేసి.. వారికి గౌవరం ఇస్తారు. పేకప్ చెప్పేవరకూ క్యారవాన్ లోకి కూడా వెళ్లరు. మీ గురించి చాలా మంది దర్శకులు గొప్పగా చెప్పిన సందర్బాలు చాలా ఉన్నాయి.'' అని రాజమౌళి అన్నారు.
రాజమౌళి బాలయ్య కాంబోలో మిస్ అయిన సినిమా?
బాలయ్య అంటే కోపం ఎక్కువ అన్న పేరు పడిపోయింది. ఆయన ఆలోచన ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. అభిమానులపై చేయి చేసుకున్న సందర్భాలు అనేకం. దాంతో కొంత మంది బాలకృష్ణది దురుసు స్వభావం అనే అభిప్రాయానికి వస్తుంటారు. కానీ ఆయన ఎంత మంచి వ్యక్తి అనేది చాలామంది దర్శకులు ఇంటర్వ్యూలలో చెప్పిన్ప్పుడే అసలు విషయం తెలుస్తుంది. ఇక రాజమౌళి బాలయ్య కాంబినేషన్ లో ఓ సినిమా మిస్ అయ్యిందని మీకు తెలుసా? ఆసినిమా ఏదో కాదు.. సింహాద్రి. అవును అసలు ముందుగా సింహాద్రి కథను మొదట బాలయ్యకే రాజమౌళి వినిపించాడట. ఆయన రిజెక్ట్ చేయడంతో అది ఎన్టీఆర్ దగ్గరకు వెళ్లింది.

