- Home
- Entertainment
- Sudigali Sudheer: పెళ్లిపై ఓపెన్ అయిన సుడిగాలి సుధీర్, ఆల్రెడీ స్టార్ట్, మ్యారేజ్ ఎప్పుడంటే?
Sudigali Sudheer: పెళ్లిపై ఓపెన్ అయిన సుడిగాలి సుధీర్, ఆల్రెడీ స్టార్ట్, మ్యారేజ్ ఎప్పుడంటే?
సుడిగాలి సుధీర్ ఇంకా పెళ్లి చేసుకోలేదు. తాజాగా పెళ్లిపై ఆయన రియాక్ట్ అయ్యాడు. త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పే అవకాశం ఉందట. సుమకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఆసక్తికర కామెంట్ చేశాడు.

గోట్ మూవీతో రాబోతున్న సుధీర్
సుడిగాలి సుధీర్.. జబర్దస్త్ కామెడీ షోతో పాపులర్ అయిన విషయం తెలిసిందే. ఓ రకంగా స్టార్ కమెడియన్‌గా ఎదిగాడు. ఆ తర్వాత కామెడీ షోని వదిలేసి సినిమాల్లోకి వెళ్లాడు. అక్కడ హీరోగా తొలి చిత్రంతో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత పలు సినిమాలు ఆడాయి. కానీ బ్రేక్ రాలేదు. కొన్ని సినిమాలు ఆగిపోయాయి. ఈ క్రమంలో మళ్లీ ఇప్పుడు బుల్లితెరపై రాణిస్తున్నాడు. పలు షోస్‌తో ఆకట్టుకుంటున్నాడు. ఈ క్రమంలో ఇప్పుడు మళ్లీ బిగ్ స్క్రీన్‌పై సందడి చేసేందుకు వస్తున్నాడు. ఆయన నటించిన `గోట్` మూవీ ఈ నెల 12న విడుదల కాబోతుంది.
పెళ్లిపై సుధీర్ రియాక్షన్, మ్యారేజ్ ఎప్పుడంటే
ఈ చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొన్నాడు సుధీర్. సుమతో చేసిన చిట్ చాట్ లో మ్యారేజ్ గురించి రియాక్ట్ అయ్యాడు. ఇప్పుడు హాయిగా, హ్యాపీగా ఉన్నానని, వర్క్ పై ఫోకస్ పెట్టినట్టు తెలిపారు. అప్పుడే పెళ్లి చేసి స్వేచ్ఛని దూరం చేయడం ఎందుకు అనేలా మాట్లాడాడు సుధీర్. సుమ ఫోర్స్ చేయడంతో ఇంట్లో సంబంధాలు చూడటం స్టార్ట్ చేశారని, ఈ ఏడాది ఎలాగైనా మ్యారేజ్ చేయాలని నిర్ణయించుకున్నారని తెలిపారు. ఇంట్లో మ్యారేజ్ విషయంలో సీరియస్‌గా ఉన్నారని, ఏం జరుగుతుందో చూడాలని తెలిపాడు సుధీర్. దీనికి సుమ రియాక్ట్ అవుతూ ఈ ఏడాది పరాభావ సంవత్సరం అని, అనుకున్నవి జరగవు అని, అనుకోనివి జరుగుతాయని తెలిపింది. పెళ్లి వద్దు అనుకుంటున్నావ్గా కదా, జరుగుతుందనే విషయాన్ని ఆమె వెల్లడించింది. మొత్తంగా అన్నీ కుదిరితే, అమ్మాయి సెట్ అయితే ఈ ఏడాదిలోనో, లేదంటే వచ్చే సమ్మర్ వరకు సుధీర్ పెళ్లి చేసుకుంటాడని తెలుస్తోంది.
రష్మితో సుధీర్ లవ్ ట్రాక్ నిజమేనా?
ఇదిలా ఉంటే సుధీర్, బుల్లితెరపై యాంకర్ రష్మి గౌతమ్‌తో క్రష్ ఉన్న విషయం తెలిసిందే. `జబర్దస్త్` టైమ్‌లో ఇద్దరి మధ్య బాగానే లవ్ ట్రాక్ నడిచింది. వీళ్లిద్దరు పెళ్లి చేసుకుంటారని అంతా అనుకున్నారు. కానీ తమ మధ్య అలాంటిది లేదని, మంచి స్నేహితులమని తెలిపారు. ఆ తర్వాత సుధీర్ షో వదిలేయడంతో ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చింది. మరోవైపు ఇండస్ట్రీలోకి వస్తున్న తొలి రోజుల్లోనే సుధీర్‌కి ఎంగేజ్మెంట్ అయ్యిందట. అందులో జబర్దస్త్ కమెడియన్లు కూడా కనిపించారు. ఆ మధ్య కొన్ని ఫోటోలు వైరల్ అయ్యాయి. పెళ్లి చేసుకునేందుకు రెడీ అయ్యాడని, ఆ తర్వాత క్యాన్సిల్ చేసుకున్నారని టాక్. ఆ తర్వాత కెరీర్ పై సుధీర్ ఫోకస్ పెట్టాడని సమాచారం. దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.













