- Home
- Entertainment
- Scene 3 Days Collections: సూర్య సీన్ బాక్సాఫీస్ ర్యాంపేజ్.. జస్ట్ 3 రోజుల్లోనే వంద కోట్లు
Scene 3 Days Collections: సూర్య సీన్ బాక్సాఫీస్ ర్యాంపేజ్.. జస్ట్ 3 రోజుల్లోనే వంద కోట్లు
సూర్య వరుస హిట్లతో దూసుకుపోతున్నారు. లేటెస్ట్ గా ఆయన సీన్ మూవీతో ఆడియెన్స్ ముందుకు వచ్చారు. ఈచిత్రం బాక్సాఫీసు వద్ద దుమ్ములేపుతోంది. మూడు రోజుల్లోనే వంద కోట్లు దాటేసింది.

బాక్సాఫీసు వద్ద సూర్య సీన్ రచ్చ
ఒకప్పుడు హిట్ కోసం నానా కష్టాలు పడ్డారు సూర్య. `జైభీమ్` తర్వాత ఆయన లెక్క మారిపోయింది. `కంగువా` వంటి భారీ డిజాస్టర్ తర్వాత ఆయన రూట్ మార్చారు. డిఫరెంట్ స్టోరీస్ సెలెక్ట్ చేసుకుంటూ వస్తున్నారు. వరుస విజయాలు అందుకుంటున్నారు. ఇప్పటికే `కరుప్పు`, `విశ్వనాథ్ అండ్ సన్స్` చిత్రాలతో విజయాలు అందుకున్నారు. ఇప్పుడు `సీన్` మూవీతో సైలెంట్ హిట్ కొట్టారు. శుక్రవారం విడుదలైన ఈ మూవీ అదిరిపోయే విజయాన్ని అందుకుంది. బాక్సాఫీసు వద్ద దుమ్ములేపుతోంది. ఈ చిత్రానికి జీతు మాధవన్ దర్శకత్వం వహించగా, ఇందులో నజ్రియా నజీమ్ హీరోయిన్గా నటించింది. నస్లెన్ నెగటివ్ రోల్ చేశారు. లాల్ కీలక పాత్ర పోషించారు. సూర్య నిర్మించిన ఈ చిత్రం మూడు రోజుల్లోనే వంద కోట్లు రాబట్టింది. బాక్సాఫీసు వద్ద స్ట్రాంగ్ గా నిలబడింది.
సీన్ మూవీ 3 రోజుల కలెక్షన్లు
సీన్ మూవీ కలెక్షన్లు చూస్తే, ఆదివారం ఈ సినిమాకి అదిరిపోయే వసూళ్లు రావడం విశేషం. ఇండియాలో మూడో రోజు ఏకంగా రూ.27కోట్లు వసూలు చేసింది. తొలి రోజు రూ.22.25కోట్లు, రెండు రోజు రూ.23.65కోట్లతో పోల్చితే మూడో రోజు ఎక్కువ రావడం విశేషం. సినిమా బాక్సాఫీసు వద్ద దుమ్మురేపుతోంది అనడానికి ఇదే నిదర్శనం. ఇక ఓవర్సీస్లో మూడో రోజు దాదాపు పది కోట్లు వసూలు చేయడం మరో విశేషం. 3వ రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.37కోట్లు కలెక్ట్ చేసింది. ఓవరాల్‌గా ఈ చిత్రం 3 రోజుల్లో ఇండియాలో రూ.72.90కోట్ల గ్రాస్, రూ.62.75కోట్ల నెట్‌ని వసూలు చేయగా, ప్రపంచ వ్యాప్తంగా రూ.116.65కోట్లు రాబట్టడం విశేషం. దీంతో జస్ట్ మూడు రోజుల్లోనే ఇది వంద కోట్ల క్లబ్లో చేరిపోయింది. సూర్య కెరీర్లోనే బెస్ట్ ఓపెనింగ్స్ ని, వీకెండ్ కలెక్షన్లని సాధించిందీ మూవీ.
సీన్ స్టేట్ వైడ్ కలెక్షన్లు
స్టేట్ వైడ్ కలెక్షన్లు చూస్తే, తెలుగు స్టేట్స్ లో మూడో రోజు రూ.4.75కోట్లు వసూలు చేయగా, తెలుగులో మొత్తంగా, 12.75కోట్లు కలెక్ట్ చేసింది. తమిళంలో రూ.36కోట్లు, కర్నాటకలో రూ.6.90కోట్లు, కేరళాలో రూ.16కోట్లు, హిందీలో రూ.1.25కోట్లు రాబట్టింది. తెలుగులో మంచి వసూళ్లు వస్తున్నాయి. ఓవర్సీస్లో రూ.43.75కోట్లు కలెక్ట్ చేయడం విశేషం.
సూర్య సీన్, బడ్జెట్, బిజినెస్, బ్రేక్ ఈవెన్ టార్గెట్
సూర్య సీన్ మూవీకి సుమారు రూ.60కోట్ల బడ్జెట్ అయ్యిందట. నాన్ థియేట్రికల్‌గా ఓటీటీ, శాటిలైట్, ఆడియో రైట్స్ కలుపుకొని దాదాపు రూ.115కోట్ల వరకు వచ్చిందని సమాచారం. రిలీజ్‌కి ముందే నిర్మాతలు డబుల్ లాభాల్లో ఉన్నారు. ఇక థియేట్రికల్‌గా ఈ మూవీకి రూ.85కోట్ల వ్యాపారం జరిగింది. తమిళనాడులో రూ.42కోట్లు, తెలుగు రాష్టాల్లో రూ.14కోట్లు, కర్నాటకలో ఆరు కోట్లు, కేరళాలో ఏడు కోట్లు, ఓవర్సీస్లో రూ.15కోట్లకు అమ్మారట. ఓవర్సీస్లో ఇప్పటికే బ్రేక్ ఈవెన్ అయ్యింది. ఓవరాల్‌గా దాదాపు 60శాతం రికవరీ అయ్యింది. ఈ వారంలో సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుందని చెప్పొచ్చు. అంతేకాదు థియేట్రికల్‌గానూ లాభాల్లోకి వెళ్తుందని సమాచారం. ఈ మూవీ ద్వారా నిర్మాతలకు లాభాలే లాభాలు అని చెప్పొచ్చు.













