- Home
- Entertainment
- Diwali Bash: అల్లు అర్జున్, ఉపాసన, నమ్రత, అల్లు స్నేహారెడ్డి, రేణు దేశాయ్, ఆధ్య.. దీపావళి సెలబ్రేషన్లో రచ్చ
Diwali Bash: అల్లు అర్జున్, ఉపాసన, నమ్రత, అల్లు స్నేహారెడ్డి, రేణు దేశాయ్, ఆధ్య.. దీపావళి సెలబ్రేషన్లో రచ్చ
దీపావళి పండుగ వేడుకల్లో అల్లు, మెగా ఫ్యామిలీ సందడి చేసింది. ముఖ్యంగా స్టార్స్ వైఫ్స్ ఉపాసన, నమ్రత, అల్లు స్నేహారెడ్డి, పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ దీపావళిని సెలబ్రేట్ చేసుకున్నారు. ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

దీపావళి సెలబ్రేషన్లో హీరోల భార్యలు
దీపావళి పండగని టాలీవుడ్ సెలబ్రిటీలు గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. పటాసులు కాలుస్తూ, దీపాలు వెలిగిస్తూ తన ఆనందాన్ని పంచుకున్నారు. మరికొందరు దీవాళి బాష్‌లో సెలబ్రేట్ చేసుకోవడం విశేషం. ఇందులో ముఖ్యంగా హీరోల భార్యలు స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచారు. ఉపాసన హైలైట్‌గా నిలవడం విశేషం.
దీపావళి సెలబ్రేషన్లో అల్లు అర్జున్ ఫ్యామిలీ
అల్లు అర్జున్ ఆదివారం రాత్రి తన ఫ్యామిలీతో కలిసి దీపావళిని సెలబ్రేట్ చేసుకున్నారు. దివాళి బాష్‌ని ఏర్పాటు చేశారు. ఇందులో వారి కుటుంబం పాల్గొంది. పటాసులు కాలుస్తూ ఎంజాయ్ చేశారు. అల్లు అర్జున్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచారు. ఆయన కూడా స్వయంగా క్రాకర్స్ పేల్చడం విశేషం. ఆయనతోపాటు భార్య స్నేహారెడ్డి, అల్లు అరవింద్, అల్లు బాబీ, ఆయన భార్య, అల్లు శిరీష్, ఆయన భార్య పాల్గొన్నారు.
నమ్రతతో కలిసి ఉపాసన దివాళి సెలబ్రేషన్
మెగా కోడలు ఉపాసన.. దీపావళి సెలబ్రేషన్లో పాల్గొన్నారు. మహేష్ బాబు భార్య నమ్రత, ఇతర స్నేహితులతో కలిసి ఆమె దీపావళి బాష్ లో సందడి చేయడం విశేషం. ఈ పిక్స్ ని ఉపాసన తన ఇన్ స్టాగ్రామ్‌లో పంచుకున్నారు.
అల్లు స్నేహారెడ్డితో ఉపాసన
అలాగే అల్లు అర్జున్ ఇంట్లో జరిగిన దివాళి బాష్‌లోనూ ఉపాసన పాల్గొంది. ఆమె అల్లు స్నేహారెడ్డితో కలిసి దీపావళిని సెలబ్రేట్ చేసుకున్నారు. ఇందులో రెడ్ శారీలో ఉపాసన, బ్లాక్ శారీలో స్నేహారెడ్డి అదిరిపోయేలా ఉన్నారు.
ఫ్యామిలీ మెంబర్స్ తో ఉపాసన
అల్లు అర్జున్ ఇంట్లో జరిగిన దివాళి బాష్‌లో ఉపాసన స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచారు. ఆమెతోపాటు కుటుంబ సభ్యులు, స్నేహితులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫోటోలకు పోజులిచ్చారు. అల్లు స్నేహారెడ్డి సైతం అందరి చూపు తనవైపు తిప్పుకుంది.
కూతురుతో రేణు దేశాయ్
ఇక దీపావళి సెలబ్రేషన్లో పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ సందడి చేశారు. ఆమె తన కూతురు ఆధ్యతో కలిసి ఈ పండగని సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా వీరిద్దరు చీరకట్టులో దిగిన ఫోటోలను రేణు దేశాయ్ సోషల్ మీడియాలో పంచుకుంది. అవి వైరల్ అవుతున్నాయి.
ఆధ్య స్పెషల్ ఎట్రాక్షన్
పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్‌లకు ఆధ్య జన్మించిన విషయం తెలిసిందే. ఆమె చాలా వరకు తల్లి వద్దనే ఉంటుంది. అప్పుడప్పుడు పవన్ వద్దకు వెళ్తుంటుంది. తాజాగా చీరకట్టులో ఆధ్య చూడముచ్చటగా ఉంది. పవన్ అభిమానులను ఆకట్టుకుంటుంది.













