Anirudh Kavya Maran Wedding: అనిరుధ్ - కావ్య మారన్ పెళ్లి ప్లాన్‌లో సడెన్ చేంజ్?
Anirudh Kavya Maran Wedding: మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్, కావ్య మారన్ల పెళ్లి పీటలెక్కబోతున్న సంగతి తెలిసిందే. అయితే, వీళ్ల వెడ్డింగ్ ప్లాన్‌లో సడెన్‌గా ఓ మార్పు జరిగిందట.

అనిరుధ్ - కావ్య మారన్ వెడ్డింగ్ ప్లాన్
అనిరుధ్ - కావ్య మారన్ పెళ్లి కోలీవుడ్‌లో ఇప్పుడు హాట్ టాపిక్. వీళ్లు నవంబర్ 11న పెళ్లి చేసుకోబోతున్నారు. ఆ తర్వాత నవంబర్ 21న చెన్నైలో గ్రాండ్‌గా రిసెప్షన్ జరగనుంది. ప్రస్తుతం పెళ్లి పనులు ఫుల్ స్వింగ్‌లో ఉన్నాయి. ఈ పెళ్లికి సినీ ప్రముఖులతో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా వస్తారని తెలుస్తోంది.
వెడ్డింగ్ రిసెప్షన్ ఎప్పుడు?
అనిరుధ్ - కావ్య మారన్ పెళ్లి గురించి రోజూ ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. పెళ్లికి కేవలం అత్యంత సన్నిహితులు, బంధువులు మాత్రమే హాజరవుతారని సమాచారం. నవంబర్ 21న జరిగే రిసెప్షన్‌కు మాత్రం సినీ, రాజకీయ ప్రముఖులు వస్తారట. ఇవి కాకుండా మరో రెండు రిసెప్షన్లు కూడా ప్లాన్ చేస్తున్నారని ముందుగా వార్తలు వచ్చాయి.
వెడ్డింగ్ ప్లాన్‌లో వచ్చిన మార్పు ఇదే
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. చెన్నైలో జరిగే గ్రాండ్ రిసెప్షన్‌కు మాత్రమే సినీ, రాజకీయ ప్రముఖులు వస్తారు. అనిరుధ్ తరపున మరో రిసెప్షన్ ఉంటుందని ముందుగా అనుకున్నారు. కానీ అది రిసెప్షన్ కాదట. అనిరుధ్ తన క్లోజ్ ఫ్రెండ్స్ కోసం ఒక గెట్ టుగెదర్ ప్లాన్ చేశాడు. నవంబర్ 22న ఐటీసీ చోళా హోటల్లో ఈ పార్టీ జరగనుంది.
కళానిధి మారన్ భారీ విందు ఇస్తారా?
సన్ గ్రూప్ ఉద్యోగుల కోసం కళానిధి మారన్ ప్రత్యేకంగా రిసెప్షన్ ప్లాన్ చేస్తున్నారని టాక్ నడిచింది. కానీ అది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. బహుశా తన స్టాఫ్ అందరికీ ఆయన ఒక భారీ విందు ఇచ్చే ఆలోచనలో ఉన్నారట. ఈ పెళ్లితో రజనీకాంత్‌కు కళానిధి మారన్ దగ్గరి బంధువు కాబోతున్నారు.








