MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Baby Story: 'బేబీ' కథని కాపీ చేసి హిట్ కొట్టారా.. సాయి రాజేష్, ఎస్‌కే‌ఎన్ లకు తెలంగాణ హైకోర్టు నోటీసులు

Baby Story: 'బేబీ' కథని కాపీ చేసి హిట్ కొట్టారా.. సాయి రాజేష్, ఎస్‌కే‌ఎన్ లకు తెలంగాణ హైకోర్టు నోటీసులు

‘బేబీ’ సినిమా కథను తన అనుమతి లేకుండా కాపీ చేశారంటూ దర్శకుడు శిరిన్ శ్రీరామ్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు దర్శకుడు సాయి రాజేష్, నిర్మాత ఎస్‌కేఎన్‌లకు నోటీసులు జారీ చేసింది.

2 Min read
Author : Tirumala Dornala
Published : Nov 26 2026, 11:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
బేబీ మేకర్స్ కి హైకోర్టు నోటీసులు
Image Credit : Asianet News

బేబీ మేకర్స్ కి హైకోర్టు నోటీసులు

తెలుగు చిత్రం ‘బేబీ’ దర్శకుడు సాయి రాజేష్, నిర్మాత SKNలకు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దర్శకుడు శిరిన్ శ్రీరామ్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు ఈ మేరకు నోటీసులు జారీ చేసింది. తన కథను అనుమతి లేకుండా ఉపయోగించారని, మోసం చేశారని, తన క్రియేటివ్ హక్కులను ఉల్లంఘించారని శిరిన్ శ్రీరామ్ తన పిటిషన్‌లో ఆరోపించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
కథ కాపీ చేశారు
Image Credit : google

కథ కాపీ చేశారు

శిరిన్ శ్రీరామ్, తన రచయితల బృందంతో కలిసి అభివృద్ధి చేసిన ‘ప్రేమించొద్దు’ (Preminchoddu) సినిమా కథను తమ అనుమతి లేకుండానే ‘బేబీ’ సినిమా నిర్మాణంలో ఉపయోగించారని ఆరోపిస్తున్నారు.

35
అనుమతి లేకుండా కథ తీసుకున్నారు
Image Credit : Social Media

అనుమతి లేకుండా కథ తీసుకున్నారు

శిరిన్ శ్రీరామ్ తెలిపిన వివరాల ప్రకారం, తొలుత సాయి రాజేష్ ‘ప్రేమించొద్దు’ సినిమాను నిర్మించాలనే ఆసక్తితో తనను సంప్రదించారు. ఈ క్రమంలో శిరిన్ శ్రీరామ్, తన రచయితల బృందంతో కలిసి దాదాపు ఒక సంవత్సరం పాటు శ్రమించి కథను అభివృద్ధి చేశారు. అయితే, కథకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుని, దాని అభివృద్ధి ప్రక్రియ పూర్తయిన తర్వాత సాయి రాజేష్ తమతో సంబంధం లేకుండా, ఆ కథాంశాన్ని ఆధారంగా చేసుకుని స్వతంత్రంగా ‘బేబీ’ సినిమాను తెరకెక్కించారని శిరిన్ ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంలో తాను, తన రచయితల బృందం మోసపోయామని ఆయన పేర్కొన్నారు.

45
బేబీ లీక్స్ పుస్తకం
Image Credit : google

బేబీ లీక్స్ పుస్తకం

ఈ వివాదం తొలుత ఫిబ్రవరి 2024లో వెలుగులోకి వచ్చింది. తన కథను అనుమతి లేకుండా ఉపయోగించారంటూ శిరిన్ శ్రీరామ్ రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన అనంతరం, కథను కాపీ చేయడం, మోసం చేయడం వంటి ఆరోపణలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. అప్పట్లో మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా అని పలువురు ప్రశ్నించినప్పుడు "బేబీ లీక్స్" అని ఒక పుస్తకం కూడా విడుదల చేశారు దర్శకుడు శిరిన్ శ్రీరామ్

55
వివాదం పెద్దదవుతుందా ?
Image Credit : our own

వివాదం పెద్దదవుతుందా ?

పిటిషనర్ తరఫున న్యాయవాది జి. సురేందర్ వాదనలు వినిపించగా, వాటిని పరిగణనలోకి తీసుకున్న గౌరవ తెలంగాణ హైకోర్టు ‘బేబీ’ దర్శకుడు సాయి రాజేష్, నిర్మాత SKNలకు నోటీసులు జారీ చేసింది. ఈ ఆరోపణలపై తమ వివరణ తెలియజేయాలని ఆదేశించింది. రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదుతో ప్రారంభమైన ఈ వివాదం ఇప్పుడు తెలంగాణ హైకోర్టుకు చేరుకోవడంతో, ఈ కేసులో తదుపరి పరిణామాలపై ఆసక్తి నెలకొంది.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 
2nd TEST • NZ vs IND 2026
NZNZ
Fri, 27 Nov, 2026
INDIND
03:30 am
Match yet to begin.
Schedule ›
32nd T20 • WBBLT20
abandoned
MS-WMS-W
159/7
MR-WMR-W
28/0
Match abandoned
Schedule ›
31st T20 • WBBLT20
Result
BH-WBH-W
142/9
AS-WAS-W
179/4
Adelaide Strikers Women beat Brisbane Heat Women by 37 runs
Schedule ›
30th T20 • WBBLT20
Result
SS-WSS-W
123/6
PS-WPS-W
142/7
Sydney Sixers Women beat Perth Scorchers Women by 4 wickets (D/L) method
Schedule ›
29th T20 • WBBLT20
Result
HH-WHH-W
151/2
ST-WST-W
150/5
Hobart Hurricanes Women beat Sydney Thunder Women by 8 wickets
Schedule ›
28th T20 • WBBLT20
Result
AS-WAS-W
168/5
MR-WMR-W
165/4
Adelaide Strikers Women beat Melbourne Renegades Women by 5 wickets
Schedule ›
27th T20 • WBBLT20
Result
BH-WBH-W
225/3
ST-WST-W
226/4
Sydney Thunder Women beat Brisbane Heat Women by 6 wickets
Schedule ›
26th T20 • WBBLT20
Result
HH-WHH-W
120
PS-WPS-W
148
Perth Scorchers Women beat Hobart Hurricanes Women by 28 runs
Schedule ›
1st TEST • NZ vs IND 2026
Result
NZNZ
368 & 239/5
INDIND
720/9
Match drawn
Schedule ›
3rd ODI • AUS vs ENG 2026
Result
AUSAUS
231
ENGENG
328
ENG beat AUS by 97 runs
Schedule ›
2nd TEST • PAK vs SL 2026
Result
PAKPAK
325 & 90/2
SLSL
98 & 316
PAK won by 8 wickets
Schedule ›
33rd T20 • WBBLT20
MR-WMR-W
Wed, 25 Nov, 2026
BH-WBH-W
01:40 pm
Match yet to begin.
Schedule ›
34th T20 • WBBLT20
ST-WST-W
Thu, 26 Nov, 2026
AS-WAS-W
10:10 am
Match yet to begin.
Schedule ›
35th T20 • WBBLT20
SS-WSS-W
Thu, 26 Nov, 2026
MS-WMS-W
01:40 pm
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Dads Little Friend Movie Review: డాడ్స్ లిటిల్‌ ఫ్రెండ్‌ మూవీ రివ్యూ.. చిన్నపిల్లల ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
Recommended image2
Varshini: నరేష్ ని గెలిపించిన సన్నీ, ఎవ్వరూ సపోర్ట్ చేయడం లేదు అంటూ వెక్కి వెక్కి ఏడ్చిన వర్షిణి
Recommended image3
Ravi Mohan - Aarthi Case: రవి మోహన్, ఆర్తి విడాకుల వ్యవహారం.. సింగర్ కెనిషాకు హైకోర్టు సమన్లు
Related Stories
Recommended image1
Chiranjeevi: రాంచరణ్ కి సూపర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్..పవన్, బాలయ్య, చిరుతో సినిమాలు ఎందుకు ఆగిపోయాయో తెలుసా ?
Recommended image2
Nithiin: అలియాస్ రుక్మిణి ట్రైలర్ రివ్యూ..అలాంటి నవలలు రాసే రచయిత జీవితంలో ట్విస్ట్ లు, నితిన్ ఫస్ట్ టైం ఇలా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved