- Home
- Entertainment
- Ram Charan: భారీ ఫ్లాపుల తర్వాత రాంచరణ్ తో సినిమా..వాడేం విన్నాడో తెలియదు, కథ వినకుండానే ఒట్టేసిన చిరు
Ram Charan: భారీ ఫ్లాపుల తర్వాత రాంచరణ్ తో సినిమా..వాడేం విన్నాడో తెలియదు, కథ వినకుండానే ఒట్టేసిన చిరు
రాంచరణ్ నటించిన ఓ సినిమాని చిరంజీవి కథ వినకుండానే ఓకె చేశారు. పైగా ఆ టైంలో దర్శకుడు వరుస ఫ్లాపులతో ఫేడ్ అవుట్ అయ్యే స్థితిలో ఉన్నారు. ఆ దర్శకుడు ఎవరు, ఆ సినిమా ఏంటి అనేది ఈ కథనంలో తెలుసుకోండి.

Ram Charan
టాలీవుడ్ క్రియేటర్ డైరెక్టర్ కృష్ణ వంశీ తన కెరీర్ లో ఎన్నో ఆణిముత్యాల్లాంటి సినిమాలను ప్రేక్షకులకు అందించారు. అదే విధంగా కొన్ని ఫ్లాపులు కూడా కృష్ణ వంశీ కెరీర్ లో ఉన్నాయి. ఖడ్గం తర్వాత ఆయన కెరీర్ ఆశించిన స్థాయిలో సాగలేదు. హిట్ల కంటే ఫ్లాపులే ఎక్కువ ఉన్నాయి. తనని బాగా కుంగదీసిన 2 ఫ్లాప్ సినిమాల గురించి కృష్ణ వంశీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహాత్మ లాంటి డీసెంట్ మూవీ తర్వాత కృష్ణ వంశీ గోపీచంద్ హీరోగా మొగుడు అనే సినిమా తెరకెక్కించారు. అది దారుణమైన డిజాస్టర్ గా నిలిచింది. కృష్ణ వంశీ ఇంత చెత్త సినిమా తీశారా అంటూ విమర్శలు తప్పలేదు. ఆ తర్వాత సినిమా పరిస్థితి కూడా అంతే. నేచురల్ స్టార్ నానితో తెరకెక్కించిన పైసా మూవీ కూడా డిజాస్టర్ అయింది. దీనితో ఇక కృష్ణ వంశీ పనైపోయింది అనే టాక్ మొదలైంది.
కృష్ణ వంశీ ఫ్లాపులు
మొగుడు సినిమా చేస్తున్నప్పుడే ఈ మూవీ వర్కౌట్ కాదు అని తనకు అర్థం అయినట్లు కృష్ణ వంశీ తెలిపారు. చాలా సమస్యలు వచ్చాయి. ఈ మూవీ ఎలాగోలా కంప్లీట్ అయితే చాలు అని అనుకున్నా. ఆ తర్వాత పైసా సినిమా కూడా అంతే. త్వరగా షూటింగ్ కంప్లీట్ కావాల్సింది వివిధ కారణాల వల్ల 3 ఏళ్ళు పట్టింది. ఆ రెండు ఫ్లాపుల తర్వాత డిప్రెషన్ కి గురయ్యా. హీరోలకు కథ చెబుదాం అని వెళుతుంటే బిజీగా ఉన్నాను సార్ అంటూ రకరకాల కారణాలు చెప్పి రిజెక్ట్ చేసేవారు.
డోర్స్ అన్నీ క్లోజ్ అయిపోయాయి
దీనితో మెంటల్ గా మరింత స్ట్రగుల్ అయ్యాను. నా డోర్స్ అన్నీ క్లోజ్ అయిపోయినట్లు అనిపించింది. ఆ టైంలో అన్నయ్య చిరంజీవి గారు గతంలో చెప్పిన మాట గుర్తుకు వచ్చింది. చరణ్ ఒక ఫ్యామిలీ సినిమా చేయాలి. నీ దగ్గర ఏదైనా ఫ్యామిలీ కథ ఉంటే చెప్పు అని గతంలో చిరంజీవి చెప్పిన మాట గుర్తుకు వచ్చింది. చిరంజీవి గారు చెప్పారు కానీ.. నేను ఫ్లాపుల్లో ఉన్న ఈ టైంలో రాంచరణ్ ఓకె చేస్తాడు అనే నమ్మకం నాకు లేదు. సరే ప్రయత్నించి చూద్దాం అని కబురు పెట్టాను. అరగంటలో రాంచరణ్ నుంచి నాకు కాల్ వచ్చింది.
జ్వరం అయినప్పటికీ చరణ్ టైం ఇచ్చాడు
అన్నపూర్ణ స్టూడియోలో ఉన్నాను ఒకసారి రాగలరా అని చరణ్ అడిగారు. వేంటనే వెళ్ళాను. ఆ రోజు చరణ్ జ్వరంతో ఉన్నప్పటికీ షూటింగ్ చేస్తూ నన్ను మీట్ కావడానికి కూడా అంగీకరించాడు. ఒక కథ ఉంది ఇంకా పూర్తిగా డెవలప్ చేయలేదు. నీకు కుదిరినప్పుడు 20 నిముషాలు టైం ఇస్తే నేరేషన్ ఇస్తాను అని చెప్పా. సరే ఈ ఆదివారం ఫ్రీగా ఉంటా వచ్చేయండి అని రాంచరణ్ చెప్పారు. ఆదివారం రోజు కథ వినిపించా. ఈ కథలో మూమెంట్స్ చాలా బావున్నాయి. ఒకసారి నాన్నగారికి కూడా కథ వినిపించండి, నేను చెబుతాను అని చరణ్ తెలిపారు.
కథ వినకుండా ఒట్టేసిన చిరంజీవి
ఆ టైంలో చిరంజీవిగారు సెంట్రల్ మినిష్టర్ గా ఉన్నారు. ఆయనకు ఎలాగూ టైం ఉండదు. ఇక ఈ సినిమా జరగదులే అని మనసులో అనుకున్నా. 2 రోజుల్లోనే చిరంజీవి గారి నుంచి పిలుపు వచ్చింది. ఉదయం 8 గంటలకే వెళ్లాను. నేను వెళ్ళగానే చిరంజీవి గారు ఒక మాట అన్నారు. నువ్వేం చెప్పావో, వాడు ఏం విన్నాడో నాకు తెలియదు.. సరస్వతీ దేవి మీద ఒట్టేసి చెబుతున్నా ఈ సినిమా మనం చేస్తున్నాం అంతే. ఇప్పుడు కథ చెప్పు అన్నారు. ఆయన అలా అనడంతో నా మైండ్ బ్లాక్ అయింది. వెంటనే నెరేషన్ ఇవ్వడం ప్రాజెక్ట్ ఓకె కావడం జరిగింది అని కృష్ణ వంశీ తెలిపారు. ఆ సినిమానే గోవిందు అందరి వాడేలే. ఈ మూవీ గొప్పగా ఆడలేదు కానీ డీసెంట్ మూవీగా నిలిచింది.








