- Home
- Entertainment
- Movie Reviews
- Dads Little Friend Movie Review: డాడ్స్ లిటిల్ ఫ్రెండ్ మూవీ రివ్యూ.. చిన్నపిల్లల ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
Dads Little Friend Movie Review: డాడ్స్ లిటిల్ ఫ్రెండ్ మూవీ రివ్యూ.. చిన్నపిల్లల ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
బాలలను బేస్ చేసుకొని తాజాగా `డాడ్స్ లిటిల్ ఫ్రెండ్` చిత్రం రూపొందింది. శరత్ రూపొందించిన ఈ చిత్రం ఆడియెన్స్ ముందుకు వచ్చింది. మరి సినిమా ఎలా ఉందంటే?

డాడ్స లిటిల్ ఫ్రెండ్ మూవీ రివ్యూ
చిన్న పిల్లలను బేస్ చేసుకొని సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి. వాటికి కమర్షియల్‌గా ఆదరణ దక్కకపోవడంతో మేకర్స్ ఆ దిశగా పెద్దగా ఫోకస్ చేయడం లేదు. కానీ ఇటీవల అలాంటి చిత్రాలు వరుసగా వస్తున్నాయి. మొన్న `సమ్మర్ హాలిడేస్` మూవీ వచ్చి ఆకట్టుకుంది. ఇప్పుడు `డాడ్స్ లిటిల్ ఫ్రెండ్` పేరుతో మరో చిత్రం వచ్చింది.
ఇందులో రజత్ రాఘవ్, కాజల్ చౌదరీ, బేబీ పరినీత రుద్రరాజు, హసిని సుధీర్ వంటి వారు ప్రధాన పాత్రలు పోషించారు. శరత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వెన్నెల సిల్వర్ స్క్రీన్ పతాకంపై దూప దీపక్ నిర్మించారు. ఈ చిత్రం శుక్రవారం(నవంబర్ 27)న విడుదలవుతుంది. ముందుగా ప్రీమియర్స్ ప్రదర్శించారు. మరి సినిమా ఎలా ఉందనేది రివ్యూలో తెలుసుకుందాం.
డాడ్స్ లిటిల్ ఫ్రెండ్ మూవీ కథ
ఆకాంక్ష(కాజల్ చౌదరి) ఒంటరి. తనకు కూతురు పరిణీత(పరిణీత రుద్రరాజు) ఉంటుంది. భర్త ఏమయ్యాడనేది తెలియదు. తన కూతురుని చైల్డ్ కేర్ సెంటర్లో చేర్పిస్తుంది. కానీ ఆ చిన్నారి ఉండదు. కట్ చేస్తే అమ్మ చనిపోతుంది. పరి ఒంటరిగానే ఉంటుంది. తన స్నేహితుడుతో కలిసి ఆడుకుంటుంది. పరికి స్ట్రింగ్ ఆర్టిస్ట్. ధారాలతో ఆర్ట్ వేయడం దీని ప్రత్యేకత. తాను ఈ స్ట్రింగ్ ఆర్ట్ తో డబ్బులు సంపాదిస్తుంది. రోజువారి ఖర్చులకు వాడుకుంటుంది.
అయితే తాను ఉండేందుకు ఇళ్లు, స్కూల్ ఫీజులు వాళ్ల అమ్మ ఒకేసారి పే చేస్తుంది. కానీ పేరెంట్స్ లేని బాధ పరిని తరచూ వెంటాడుతుంది. కానీ అమ్మ చెప్పినట్టుగానే తన రెగ్యూలర్ లైఫ్‌ని లీడ్ చేస్తుంది. అయితే ఓ రోజు చిల్డ్రన్ కేర్ సెంటర్ నుంచి ఇద్దరు వచ్చి పరిని చెక్ చేస్తారు. ఆ సమయంలోనే తానే పరి నాన్నని అంటూ రాహుల్(రజత్) వస్తాడు. తను ఎన్ఆర్ఐ. అతనెవరో పరికి తెలియదు. అతన్ని తండ్రి యాక్సెప్ట్ చేయదు పరి, కానీ ఆమెకి దగ్గర కావాలని చాలా ప్రయత్నాలు చేస్తుంటాడు రాహుల్.
మరి మరి ఇంతకి రాహుల్ పరి కోసం ఎందుకు వచ్చాడు? తానే తండ్రిని అని ఎందుకు చెబుతున్నాడు? పరి తల్లి తన తండ్రి గురించి ఎందుకు చెప్పలేదు? ఇందులో ఉన్న ట్విస్ట్ ఏంటి? రాహుల్‌కి పరి దగ్గరయ్యిందా? లేదా? ఆయనకు ఆకాంక్షకి ఉన్న సంబంధం ఏంటి? అనేది మిగిలిన కథ.
డాడ్స్ లిటిల్ ఫ్రెండ్ మూవీ విశ్లేషణ
ఇటీవల కాలంలో బాలల నేపథ్యంలోని చిత్రాలు ఊపందుకుంటున్నాయి. తాజాగా `డాడ్స్ లిటిల్ ఫ్రెండ్` మూవీ ఆ కోవకు చెందిందే. అయితే దీన్ని ఎంత వరకు ఆకట్టుకునేలా తెరకెక్కించారనేది ఆసక్తికరం. ఆ విషయంలో ఈ చిత్ర మేకర్స్ చాలా వరకు సక్సెస్ అయ్యారు. కాకపోతే కథనం విషయంలో మరింత కేర్ తీసుకోవాల్సింది, వేగంగా కథనాన్ని నడిపించాల్సింది.
ఈ మూవీ ప్రారంభంలో తల్లి, కూతురుకి సంబంధించిన సీన్లు చూపించి కథని ఎస్లాబ్లిష్ చేశారు. ఆ తర్వాత సస్పెన్స్ అంశాలతో సాగుతుంది. తల్లి ఏమైందనే మిస్టరీతో కథ రన్ అవుతుంది. చిన్నారి ఒక్కతే ఇంట్లో ఉండటం, తన అమ్మ నుంచి వచ్చిన స్ట్రింగ్ ఆర్ట్ ని వేస్తూ రిలాక్స్ అవడం, దాన్ని తన ఆదాయ వనరుగా మార్చుకోవడం ఆగుంది. స్కూల్‌కి ఎక్కువగా వెళ్లకపోవడం, వెళ్లినా తన అమ్మ గుర్తుగా ఉన్న టీషర్ట్ తోనే వెళ్లడంతో బేబీ పరి తన అమ్మ జ్ఞాపకాల్లో ఎంత మమేకమైందనే విషయాన్ని చూపించారు.
మధ్యలో హీరో పాత్ర ఎంట్రీతో కథనం ఇంట్రెస్టింగ్గా మారుతుంది, అతను ఎవరనేది అమ్మాయికి సస్పెన్స్. కానీ తానే తండ్రిని అని అతను చెప్పడంతో సినిమా ఆసక్తికరంగా టర్న్ తీసుకుంటుంది. ఆమెని కన్విన్స్ చేయడానికి తను చేసే ప్రయత్నాలు ఫన్నీగా ఉంటాయి. ఆమె రియాక్షన్స్ ఆకట్టుకుంటాయి. కాకపోతే అవి సాగదీసినట్టుగా ఉంటాయి. ఇంటర్వెల్స్ ఎంగేజింగ్‌గా ఉంటుంది.
సెకండాఫ్ మొత్తం అమ్మాయిని కన్విన్స్ చేసే ప్రయత్నాలు, ఆమెని తన ఆర్ట్ వర్క్ తో సర్ప్రైజ్ చేయడం, బర్త్ డే సెలబ్రేషన్ వంటివి ఎమోషనల్‌గా ఉంటాయి. క్లైమాక్స్ మరింత ఎంగేజింగ్‌గా, ఇంట్రెస్టింగ్ గా, ఎమోషనల్‌గా ఉంటుంది. అదే సమయంలో ట్విస్ట్ కూడా ఆకట్టుకుంటుంది. తల్లికి సంబంధించిన గదిలోని సీన్లు, రాహుల్‌ని వాటిని చూడటం, అందులో వాళ్లు రాసుకున్న డైరీ ఎమోషనల్‌గా ఉంటుంది. సినిమా ఎండింగ్ ఆద్యంతం అలరించేలా ఉంది. భావోద్వేగానికి గురి చేస్తుంది.
అదే సమయంలో పిల్లలకు పేరెంట్స్ ఇంపార్టెన్స్ ని, ఇండిపెండెన్సీని, ఫ్యామిలీ పరిస్థితులు, ఆవేశంలో చేసే చిన్న చిన్న తప్పులు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయనే విషయాలు చర్చించిన తీరు బాగుంది. పిల్లలు, పెద్దలు చూడాల్సిన మూవీ అని చెప్పొచ్చు.
డాడ్స్ లిటిల్ ఫ్రెండ్ మూవీలో ఆర్టిస్ట్ లు, టెక్నీషియన్ల పనితీరు
నటీనటులు
పరి పాత్రలో బేబీ పరిణీత అదరగొట్టింది. అదిరిపోయే ఎక్స్ ప్రెషన్స్ తో ఆకట్టుకుంది. చాలా మెచ్యూర్డ్ గా నటించి మెప్పించింది. సినిమాని తన భుజాలపై నడిపించిందని చెప్పొచ్చు. ఇక రాహుల్ పాత్రలో రజత్ సైతం బాగా చేశాడు. సెటిల్డ్ యాక్టింగ్‌తో మెప్పించాడు. అతని నటన చాలా పరిణతితో కూడి ఉండటం విశేషం. పరి తల్లిగా కాజల్ చౌదరి ఉన్నంతలో మెప్పించింది. పరి ఫ్రెండ్‌గా కుర్రాడు నవ్వించాడు, నటనతో ఆకట్టుకున్నాడు. రాహుల్‌పై ఇంట్రెస్ట్ చూపే అమ్మాయిగా హసిని సుధీర్ ఉన్నంతలో మెప్పించింది. కానీ లవ్ ట్రాక్ పండలేదు. గుండు సుదర్శన్ పాత్ర అలరించేలా ఉంది. మిగిలిన వాళ్లు ఓకే అనిపించారు.
టెక్నీకల్‌గా
సినిమా టెక్నీకల్‌గా బాగుంది. దీనికి ఆర్ హెచ్ విక్రమ్ సంగీతం బాగుంది. బీజీఎం అదిరిపోయింది. ఎమోషనల్ సీన్లలో ఆర్ఆర్ ఎలివేట్ అయ్యింది. కుశ్వంత్ కుమార్ కెమెరా వర్క్ సినిమాకి మరో ప్లస్. విజువల్స్ కలర్ఫుల్గా ఉన్నాయి. కనువిందు చేసేలా ఉన్నాయి. సినిమా స్థాయిని పెంచేశాయి. ఎడిటింగ్ పరంగా మరింత కేరింగ్ అవసరం. దర్శకుడు శరత్ మంచి కథని ఎంచుకున్నాడు, కానీ దాన్ని డ్రామా పరంగా బాగా ఆవిష్కరించడంలో కొంత తడబాటు ఉందని చెప్పొచ్చు. సన్నివేశాలను బాగా సాగదీశాడు, ఎమోషనల్ డెప్త్ మిస్ అయ్యింది. లాజిక్స్ మిస్ అయ్యాయి. పరి అమ్మ పాత్రకి సంబంధించిన క్లారిటీ మిస్ అయ్యింది. ట్విస్ట్ కూడా గొప్పగా లేదు. కానీ సెకండాఫ్‌ని, క్లైమాక్స్ ని బాగా డీల్ చేశాడు. మెప్పించే ప్రయత్నం చేశాడు.
ఫైనల్‌గా
పిల్లలను సంబంధించిన ఎమోషన్స్ ని ఆవిష్కరించే ఫీల్‌గుడ్ ఎమోషనల్ డ్రామా `డాడ్స్ లిటిల్ ఫ్రెండ్`. టైమ్‌పాస్‌కి పిల్లలు, పెద్దలు కలిసి చూడొచ్చు.
రేటింగ్: 2.75














