- Home
- Entertainment
- Varshini: నరేష్ ని గెలిపించిన సన్నీ, ఎవ్వరూ సపోర్ట్ చేయడం లేదు అంటూ వెక్కి వెక్కి ఏడ్చిన వర్షిణి
Varshini: నరేష్ ని గెలిపించిన సన్నీ, ఎవ్వరూ సపోర్ట్ చేయడం లేదు అంటూ వెక్కి వెక్కి ఏడ్చిన వర్షిణి
బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో భాగంగా ఈ వారం హౌస్ లోకి గెస్ట్ లు ఒక్కొక్కరుగా వస్తున్నారు. 81వ రోజు సిరి హనుమంత్, సన్నీ, నిఖిల్ మలియక్కల్ లాంటి వాళ్ళు సందడి చేశారు.

Bigg Boss Telugu 10
బిగ్ బాస్ హౌస్ లోకి సిరి హనుమంత్, సన్నీ, నిఖిల్ మలియక్కల్, పృథ్వీ గెస్ట్ లుగా వెళ్లి సందడి చేశారు. గేమ్స్ కూడా ఆడారు. ముందుగా హౌస్ లోకి సిరి, సన్నీ ఎంట్రీ ఇచ్చారు, సన్నీ ప్రతి హౌస్ మేట్ గురించి చాలా చక్కగా మాట్లాడారు. వారిలో పాజిటివ్, నెగిటివ్ అంశాలు లేవనెత్తారు. ఆ తర్వాత సిరి, సన్నీ ఇద్దరూ గేమ్ లో పాల్గొన్నారు.
నరేష్ ని గెలిపించిన సన్నీ
వర్షిణి, సిరి ఒక జట్టుగా గేమ్ అడగా.. మరో జట్టుగా సన్నీ, నరేష్ ఆడారు. ఇది కంప్లీట్ గా ఫిజికల్ ఎనెర్జీ పెట్టాల్సిన గేమ్. తమ ముందు ఉన్న షీట్ ని బ్రేక్ చేసి బంతులని సొంతం చేసుకోవాలి. ఆ బంతులని తమ పార్ట్నర్ కి ఇస్తే అతడు వాటిని బ్యాలెన్స్ చేస్తూ నిలబడాలి. ఈ గేమ్ లో నరేష్ తన షీట్ ని బ్రేక్ చేయడానికి సర్వ శక్తులు ఒడ్డాడు. దీనితో త్వరగా బ్రేక్ చేసి బంతులని సన్నీకి అందించాడు. వర్షిణి మాత్రం తన షీట్ తో చాలా సేపు పోరాడింది. దానిని బ్రేక్ చేసేందుకు ఆమె చెమటలు చిందించాల్సి వచ్చింది. ఈ లోపు నరేష్ గేమ్ ఆల్మోస్ట్ ఫినిష్ చేశాడు. ఆ విధంగా నరేష్ ఈ గేమ్ లో విజయం సాధించి కెప్టెన్సీ కంటెండర్ పోటీకి అర్హత సాధించాడు.
వెక్కి వెక్కి ఏడ్చిన వర్షిణి
తాను ఓడిపోవడంతో వర్షిణి వెక్కి వెక్కి ఏడ్చింది. అందరూ నేను ఫిజికల్ గేమ్స్ ఆడడం లేదు అని తిడుతున్నారు. కానీ నేను ఆడుతుంటే ఒక్కరు కూడా సపోర్ట్ చేయడం లేదు. ముకేష్ తప్ప నాకు ఎవరూ సపోర్ట్ చేయరు. అందరూ నరేష్ కే సపోర్ట్ చేశారు అంటూ ఏడ్చేసింది. ఆ తర్వాత హౌస్ లోకి నిఖిల్ మలియక్కల్, పృథ్వీ ఎంట్రీ ఇచ్చారు. నిఖిల్, సుధీర్ ఒక టీంగా.. పృథ్వీ, వంశీ మరో టీంగా గేమ్ ఆడారు. ఈ గేమ్ లో సుధీర్, నిఖిల్ విజయం సాధించారు. అసలైన కెప్టెన్సీ టాస్క్ శుక్రవారం రోజు జరగనుంది.















