MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • 3 సినిమాలు, ఒక్కో సినిమాకు 100 కోట్లు కొల్లగొట్టిన ప్రభాస్ హీరోయిన్ ఎవరో తెలుసా..?

3 సినిమాలు, ఒక్కో సినిమాకు 100 కోట్లు కొల్లగొట్టిన ప్రభాస్ హీరోయిన్ ఎవరో తెలుసా..?

3 సినిమాలతో లక్కీ హీరోయిన్ గా మారిపోయింది ఓబ్యూటీ. ఒక్కో సినిమాతో 100 కోట్ల కలెక్షన్స్ ను కొల్లగొట్టిన ఈ స్టార్ హీరోయిన్ ఎవరు..? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Feb 04 2025, 02:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
వసూళ్ల రాణి

వసూళ్ల రాణి

ప్రేక్షకుల మనసు దోచుకున్న సగం హీరోయిన్లు కేరళ నుండి వచ్చినవారే. మలయాళ సినిమా గుర్తించని ఈ బ్యూటీస్ తెలుగు, తమిళ సినిమాలలొ రాణిస్తున్నారు. మలయాళం వారు వద్దు అనుకున్నా.. తెలుగు,తమిళ ప్రేక్షకులు మాత్రం వీరిని నెత్తిమీద పెట్టుకుని చూసుకుంటారు.  అలాంటి  నటి గురించి మనం చూద్దాం.  

Also Read: కోర్టుకెక్కిన ఐశ్వర్యరాయ్ కూతురు ఆరాధ్య, గూగుల్‌, యూట్యూబ్ కు కోర్టు నోటీసులు

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
3 సినిమాలు 100 కోట్ల వసూళ్లు

3 సినిమాలు 100 కోట్ల వసూళ్లు

ఆ నటి తమిళంలో రజినీకాంత్ సినిమాతో పరిచయమైంది. ఆ తర్వాత విజయ్‌కి జంటగా నటించిన ఆమె, ఇప్పటివరకు తమిళంలో నటించిన నాలుగు సినిమాల్లో మూడు థియేటర్లలో విడుదలయ్యాయి. ఆ మూడు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర 100 కోట్లకు పైగా వసూలు చేశాయి. ఈ లక్కీ  హీరోయిన్ ఖాతాలో  ప్రస్తుతం అరడజను సినిమాలు ఉన్నాయి.

Also Read: మాజీ ప్రధాని మనవరాలు, స్టార్ హీరోకు రెండో భార్య,

36
మాళవిక మోహనన్

మాళవిక మోహనన్

ఆ బ్యూటీ మరెవరో కాదు మాళవిక మోహనన్. కేరళలో పుట్టి పెరిగిన మాళవికకు గుర్తింపు తెచ్చింది తమిళ సినిమా. తమిళంలో రజినీ 'పేట' సినిమాతో పరిచయమైన మాళవికకు రెండో సినిమానే విజయ్‌కి జంటగా నటించే అవకాశం వచ్చింది. లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించిన 'మాస్టర్' చిత్రంలో విజయ్ పాత్రకు జంటగా చారు పాత్రలో నటించారు మాళవిక.

Also Read: 4 నెలల్లో 3 హిట్లు, 850 కోట్ల కలెక్షన్స్ కొల్లగొట్టిన లక్కీ హీరోయిన్ ఎవరోొ తెలుసా..?

 

46
వరుస సినిమా అవకాశాలు

వరుస సినిమా అవకాశాలు

'మాస్టర్' సినిమా విజయం మాళవికను బాలీవుడ్‌కు తీసుకెళ్లింది. అక్కడ 'యుద్ధ'తో సహా కొన్ని సినిమాల్లో నటించిన మాళవిక, తర్వాత పా.రంజిత్ దర్శకత్వం వహించిన 'తంగలాన్' సినిమాతో  రీఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రంలో ఆదివాసీ మహిళ ఆరతి పాత్రలో అదరగొట్టారు. ఇక్కడ ఆశ్చర్యం ఏమిటంటే, ఆమె నటించి థియేటర్లలో విడుదలైన మూడు సినిమాలు 100 కోట్లకు పైగా వసూలు చేశాయి.

Also Read: Keerthy Suresh: తాళి ఎక్కడ? పెళ్ళైన రెండు నెలలకే షాకింగ్ లుక్ లో కీర్తి సురేష్, నెటిజన్లు ఏమంటున్నారంటే..?

56
మాళవిక ఖాతాలోని సినిమాలు

మాళవిక ఖాతాలోని సినిమాలు

ప్రస్తుతం తెలుగులో ప్రభాస్ జంటగా 'రాజాసాబ్' సినిమాలో నటిస్తున్నారు మాళవిక మోహనన్. ఇది పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతోంది. ఇది కాకుండా మలయాళంలో మోహన్‌లాల్‌తో కలిసి ఒక సినిమాలో నటించడానికి కూడా ఒప్పుకున్నారు. తమిళంలో కూడా నటి మాళవిక మోహనన్ వద్ద 'సర్దార్ 2' సినిమా ఉంది. పి.ఎస్.మిత్రన్ - కార్తి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు మాళవిక.

66
ఇన్‌స్టా బ్యూటీ

ఇన్‌స్టా బ్యూటీ

అలు సినిమాలు ఇటు సోషల్ మీడియాలో కూడా బిజీ బిజీగా ఉంటుంది మాళవిక.  సినిమాల్లో బిజీగా ఉన్నప్పటికీ ఫోటోషూట్‌లపై ఆసక్తి ఉన్న మాళవిక, ఆ ఫోటోలను తన ఇన్‌స్టా పేజీలో పోస్ట్ చేస్తుంటుంది. ఆమె అందచందాలను చూసేందుకే ఆమెను ఇన్‌స్టాలో 43 లక్షలకు ఫాలోవర్స్ ఉన్నారు. 

 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తమిళ సినిమా
తెలుగు సినిమా
Latest Videos
Recommended Stories
Recommended image1
Namitha: బాయ్ ఫ్రెండ్ పక్కనే ఉండగా నమితని అసభ్యంగా అలా చేయమన్న డైరెక్టర్, రివేంజ్ తీర్చుకున్న హీరో
Recommended image2
Mrunal Thakur: అన్నంలో ఐస్‌క్రీమ్.. హీరోయిన్ వింత అలవాటు వెనుక పెద్ద ఏంటో తెలుసా?
Recommended image3
Jr NTR: 70 ఏళ్ల హీరో కోసం రాసుకున్న కథతో.. ఎన్టీఆర్ యమదొంగ చేసిన రాజమౌళి.. విజయేంద్ర ప్రసాద్ ఏమన్నాడంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved