- Home
- Entertainment
- Arijit Singh Telugu Songs: స్టార్ సింగర్ అర్జిత్ సింగ్ పాడిన తెలుగు హార్ట్ టచ్చింగ్ సాంగ్స్ ఇవే
Arijit Singh Telugu Songs: స్టార్ సింగర్ అర్జిత్ సింగ్ పాడిన తెలుగు హార్ట్ టచ్చింగ్ సాంగ్స్ ఇవే
ప్రముఖ స్టార్ బాలీవుడ్ సింగర్ అర్జిత్ సింగ్ సినిమా పాటలకు రిటైర్‌మెంట్‌ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన పాడిన తెలుగు పాటలేంటో చూద్దాం.

సినిమా పాటలకు రిటైర్‌మెంట్ ప్రకటించిన అర్జిత్ సింగ్
అర్జిత్ సింగ్ బెంగాలీ సింగర్ అయినప్పటికీ బాలీవుడ్‌లో పాపులర్ అయ్యారు. హిందీ పాటలతో విశేషమైన గుర్తింపుని తెచ్చుకున్నారు. భారతీయ శ్రోతలను అలరించారు. దాదాపు రెండు దశాబ్దాలుగా ఆయన విశేషంగా ఆకట్టుకుంటున్నారు. స్టార్ ప్లేబ్యాక్ సింగర్‌గా రాణిస్తున్నారు. అర్జిత్ సింగ్ మ్యూజిక్ డైరెక్టర్ అయినప్పటికీ సింగర్‌గానే విశేష గుర్తింపు తెచ్చుకున్నారు. బాలీవుడ్‌లో ఆయన పాడిన పాటలు యువతని ఉర్రూతలూగించాయంటే అతిశయోక్తి కాదు. అలాంటి అర్జిత్ సింగ్ సినిమా పాటలకు రిటైర్‌మెంట్ ప్రకటించడం అందరికి షాకిస్తుంది.
అర్జిత్ సింగ్ పాడిన మొత్తం పాటలు
అర్జిత్ సింగ్ బాలీవుడ్‌లోనే కాదు, తెలుగులోనూ అద్భుతమైన పాటలు పాడారు. ఆయన ఇప్పటి వరకు తన కెరీర్‌లో అన్ని భాషలు కలిపి 715 పాటలు పాడారు. వాటిలో హిందీలో 532, బెంగాలీలో 144 పాటలు, తెలుగులో 25 పాటలు, తమిళంలో నాలుగు పాటలు పాడారు. వీటితోపాటు కన్నడ, మలయాళం, మరాఠి, గుజరాతీ, అస్సామీ భాషల్లో కూడా ఆయన పాటలు పాడారు. అలాగే మ్యూజిక్ కంపోజర్‌గా దాదాపు 28 సినిమాలకు వర్క్ చేశారు.
అర్జిత్ సింగ్ పాడిన తెలుగు పాటలు
అర్జిత్ సింగ్ పాడిన తెలుగు పాటలు చూస్తే, మొదటి సారి ఆయన 2010లో `కేడీ` చిత్రానికి పాట పాడారు. ఇందులో `నీవే నా నీవేనా` అనే పాటని అలపించారు. ఆ తర్వాత మూడేళ్లకి 2013లో `స్వామిరారా`లో మూడు పాటలు పాడారు. `కృష్ణుడి వారసులంతా`, `అది ఏంటి ఒక్కసారి`, `ఈడు వాడు ఎవరో లేడు` వంటి పాటలు ఆలపించారు. అలాగే `ఉయ్యాల జంపాలా`లో `ధేర్ తక్ చాలా` అనే పాటని, `నువ్వే నా బంగారం` మూవీలో `ఒక్కరికి ఒకరం`, `మనం` మూవీలో `కనులను తాకే ఇలా` అనే పాట ఆలపించారు. ఈ పాట ఆయనకు విశేషమైన గుర్తింపుని తెచ్చిపెట్టింది.
తెలుగులో సెలక్టీవ్‌గా పాటలు పాడిన అర్జిత్ సింగ్
ఆ తర్వాత వరుసగా ఆఫర్లు అందుకున్నారు. `నీ జతగా నేనుండాలి` మూవీలో `ప్రాణమా నా ప్రాణమా`, `మనసే పెదవినా`, `రౌడీ ఫెలో` మూవీలో `రా రా రౌడీ`, `ఆ సీతాదేవి నువ్వులా`.. `దోచెయ్` మూవీలో `నచ్చితే ఏ పనైనా`, `హాయి హాయి`, `హీ ఈజ్ మిస్టర్ మోసగాడు`.. `భలే మంచి రోజు` చిత్రంలో `నింగి నీదేరా`, `ఎవరి రూపో`.. `తను నేను` చిత్రంలో `సూర్యుడినే చూసోద్దామా`, `నువ్వు తోడు వుంటే లోకం`, `కేశవ` మూవీలో `ఏడిస్తే రారెవరు`, `పో పోరాడి`, `నా పేరు సూర్య` మూవీలో `మాయా`, `హుషారు` చిత్రంలో `నువ్వే నువ్వే`, `ఓం భీమ్ భుష్`లో `అనువణువు` వంటి పాటలను ఆలపించారు అర్జిత్ సింగ్. ఆయన ఎక్కువగా మెలోడీ సాంగ్స్ ఆలపించారు. హృదయాలను కదిలించారు.
అర్జిత్ సింగ్‌కి కేంద్ర ప్రభుత్వం పద్మ శ్రీతో సత్కారం
సినిమా సంగీత ప్రపంచంలో విశేష సేవలందిస్తున్న అర్జిత్ సింగ్‌కి కేంద్ర ప్రభుత్వం గతేడాది పద్మ శ్రీ పురస్కారాన్ని అందించింది. అంతేకాదు `రెండు జాతీయ అవార్డులను అందుకున్నారు. ఎనిమిది ఫిల్మ్ ఫేర్ పురస్కారాలు దక్కాయి. ఆయన `ఫేమే గురుకుల్` అనే రియాలిటీ షోస్ ద్వారా కెరీర్ ని ప్రారంభించారు. మొదట్లో బెంగాలీలో పాటలు పాడారు. ఆ తర్వాత 2011లో `మర్డర్ 2`లో `ఫిర్ మోహబ్బత్` పాటతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. రెండు దశాబ్దాల పాటు బాలీవుడ్‌ని శాసించారు. ఇప్పుడు ఆయన సినిమా పాటలకు గుడ్ బై చెప్పారు. ఇకపై సోలోగా ఆల్బమ్స్ కి పాడబోతున్నారని తెలుస్తోంది. అర్జిత్ సింగ్ సినిమా పాటలతో ఎంతగా పాపులర్ అయ్యారో, దాన్ని మించి లైవ్ షోస్‌తో గ్లోబల్ వైడ్‌గా విశేష ఆదరణ పొందారు. ఇప్పటికీ పొందుతున్నారు.

