MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Jr Ntr Devara 2 నుంచి మైండ్ బ్లోయింగ్‌ అప్‌ డేట్‌.. చిరంజీవికి సమాధానం చెప్పే టైమ్‌ వచ్చినట్టేనా?

Jr Ntr Devara 2 నుంచి మైండ్ బ్లోయింగ్‌ అప్‌ డేట్‌.. చిరంజీవికి సమాధానం చెప్పే టైమ్‌ వచ్చినట్టేనా?

ఎన్టీఆర్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన `దేవర` మూవీ మంచి ఆదరణ పొందింది. కానీ `దేవర 2` ఆగిపోయిందనే వార్తలు వినిపించాయి. దీనిపై క్లారిటీ ఇచ్చారు నిర్మాత. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Jan 27 2026, 07:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
దేవర 2పై అనేక రూమర్స్
Image Credit : our own

దేవర 2పై అనేక రూమర్స్

ఎన్టీఆర్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన `దేవర 2` మూవీ రెండేళ్ల క్రితం ఆడియెన్స్ ముందుకు వచ్చి మెప్పించింది. మిశ్రమ స్పందన రాబట్టుకున్నా ఈ చిత్రం నార్త్ ఆడియెన్స్ ని బాగా ఆకట్టుకుంది. అక్కడి నుంచి ఊహించని రెస్పాన్స్ పొందింది. ఈ క్రమంలో `దేవర 2`పై భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ అనూహ్యంగా ఈ మూవీపై చాలా రోజులుగా విభిన్నమైన వార్తలు వస్తున్నాయి. సినిమా ఆగిపోయిందంటూ ప్రచారం జరిగింది.

25
దేవర 2 పై కొనసాగిన సస్పెన్స్
Image Credit : our own

దేవర 2 పై కొనసాగిన సస్పెన్స్

`దేవర 2` మూవీ ఆగిపోయిందని ఇటీవల రూమర్స్ వినిపించాయి. ఎన్టీఆర్‌ నటించిన `వార్‌ 2` ఫెయిల్యూర్‌ కావడంతో `దేవర 2`పై తారక్‌ ఆసక్తిగా లేరని అన్నారు. ఇక ఈ మూవీని పక్కన పెట్టినట్టే అనుకున్నారు. `వార్ 2` డిజాస్టర్‌ కారణంగా తారక్ ఓ బాలీవుడ్‌ మూవీని పక్కన పెట్టారు. నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌తో చేయాల్సిన మూవీని పక్కన పెట్టారని టాక్‌. చాలా ఫ్రెష్‌గా వెళ్లబోతున్నారనే వార్తలు వినిపించాయి. అందులో భాగంగా `దేవర 2` కూడా ఆగిపోయిందని అనుకున్నారు.

Related Articles

Related image1
The Raja Saab: భారీ రేట్‌కి రాజా సాబ్‌ ఓటీటీ డీల్‌, నిర్మాత బతికిపోయాడు.. ప్రభాస్‌ మూవీ టోటల్ లాస్‌ ఎంతంటే
Related image2
Superstar Krishna సంక్రాంతి మొనగాడుగా నిలవడానికి భీజం వేసిన సినిమా ఏంటో తెలుసా? ఎన్టీఆర్‌, శోభన్‌ బాబుకి ఝలక్
35
దేవర 2 నుంచి మైండ్‌ బ్లోయింగ్‌ అప్‌ డేట్‌
Image Credit : our own

దేవర 2 నుంచి మైండ్‌ బ్లోయింగ్‌ అప్‌ డేట్‌

కానీ `దేవర 2`కి సంబంధించిన అదిరిపోయే అప్‌ డేట్‌ ఇచ్చారు నిర్మాత మిక్కిలినేని సుధాకర్‌. ఆయన ఇటీవల జనగాంలో జరిగిన ఓ ఈవెంట్‌లో పాల్గొని `దేవర 2` ఉండబోతుందని చెప్పారు. మేలో సినిమా స్టార్ట్ అవుతుందని వెల్లడించారు. వచ్చే ఏడాది సినిమా రిలీజ్‌ అవుతుందని, `దేవర 2` పెద్ద బ్లాక్‌ బస్టర్‌ అవుతుందని పేర్కొన్నారు. దీంతో ఈ వార్త ఇప్పుడు తారక్‌ అభిమానులకు హ్యాపీ చేస్తుంది. దీన్ని వారంతా వైరల్‌ చేస్తున్నారు. మరో బ్లాక్‌ బస్టర్‌ లోడింగ్‌ అంటున్నారు. అంతేకాదు పెద్ద హీరోకి సమాధానం చెప్పే రోజులు వచ్చాయని కామెంట్‌ చేస్తున్నారు.

45
కొరటాల శివ సమాధానం చెప్పే టైమ్‌ వచ్చిందా?
Image Credit : Youtube/YuvaSudha

కొరటాల శివ సమాధానం చెప్పే టైమ్‌ వచ్చిందా?

దర్శకుడు కొరటాల శివపై మెగాస్టార్‌ చిరంజీవి `ఆచార్య` సమయంలో పరోక్షంగా పలు విమర్శలు చేశారు. దర్శకులు ఎలా సినిమా తీయాలి, ఎలా ఉండాలనేది తెలిపారు. అది కొరటాల శివనే అని అంతా భావించారు. అలానే ప్రచారం జరిగింది. బాగా ట్రోల్‌ నడిచింది. `వాల్తేర్ వీరయ్య` సమయంలో చిరు ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత `దేవర`తో హిట్‌ కొట్టాడు కొరటాల శివ. కానీ మళ్లీ ఇటీవల కాలంలో కొరటాలకి పరోక్షంగా విమర్శలు తగులుతూనే ఉన్నాయి. పైగా `దేవర 2` ఆగిపోయిందనే వార్తలతో మరింతగా విమర్శలు వచ్చాయి. వస్తున్నాయి. ఈ నేపథ్యంలో  `దేవర 2` ఉండబోతుందని నిర్మాత క్లారిటీ ఇవ్వడం, పైగా బ్లాక్‌ బస్టర్‌ పక్కా అని చెప్పడంతో ఇప్పుడు మళ్లీ కొరటాల టైమ్‌ స్టార్ట్ అయ్యిందని చెప్పొచ్చు. అదే సమయంలో మెగాస్టార్‌కి సమాధానం చెప్పే టైమ్‌ కూడా వచ్చిందని ఆయన అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. మరి ఈ అవకాశాన్ని కొరటాల ఎలా ఉపయోగించుకుంటారో చూడాలి.

55
డ్రాగన్‌తో బిజీగా ఎన్టీఆర్‌
Image Credit : our own

డ్రాగన్‌తో బిజీగా ఎన్టీఆర్‌

ఎన్టీఆర్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో 2024లో రూపొందిన `దేవర` మూవీ దాదాపు రూ.450కోట్ల వరకు వసూలు చేసింది. ఇందులో జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటించగా, సైఫ్‌ అలీ ఖాన్‌ నెగటివ్‌ రోల్‌ చేశారు. శ్రీకాంత్‌, ప్రకాష్‌ రాజ్‌, అజయ్‌, శ్రుతి మరాఠే వంటి వారు ముఖ్య పాత్రలు పోషించారు. ఎన్టీఆర్‌ ఆర్ట్స్, యువసుధా ఆర్ట్స్ పతాకాలపై కళ్యాణ్‌ రామ్‌, సుధాకర్‌ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ సంయుక్తంగా నిర్మించారు. 

ఇక ప్రస్తుతం ఎన్టీఆర్‌.. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో `డ్రాగన్‌` చిత్రంలో నటిస్తున్నారు. రుక్మిణి వసంత్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీ ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. దీన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
Latest Videos
Recommended Stories
Recommended image1
Bhoot Bangla: అక్షయ్ కుమార్, టబు లకు షాకింగ్ రెమ్యునరేషన్.. ఈ మూవీ కోసం ఒక్కొక్కరు ఎంత తీసుకున్నారో తెలుసా
Recommended image2
Dhurandhar : ధురంధర్ మూవీలో మిస్టేక్.. దొరికిపోయిన చిత్ర యూనిట్, నెటిజన్ల ఫన్నీ కామెంట్స్ వైరల్
Recommended image3
Rashmika Mandanna: ఇంతలా దిగజారాలా ? వేధింపులకు హద్దుల్లేకుండా పోయింది..ఆడియో లీక్ వివాదంపై రష్మిక ఫైర్
Related Stories
Recommended image1
The Raja Saab: భారీ రేట్‌కి రాజా సాబ్‌ ఓటీటీ డీల్‌, నిర్మాత బతికిపోయాడు.. ప్రభాస్‌ మూవీ టోటల్ లాస్‌ ఎంతంటే
Recommended image2
Superstar Krishna సంక్రాంతి మొనగాడుగా నిలవడానికి భీజం వేసిన సినిమా ఏంటో తెలుసా? ఎన్టీఆర్‌, శోభన్‌ బాబుకి ఝలక్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved