- Home
- Entertainment
- Arijit Singh: స్టార్ సింగర్ అరిజిత్ సింగ్ సంచలన ప్రకటన.. ఇకపై పాటలకు గుడ్ బై.. కానీ ట్విస్ట్ ఏంటంటే
Arijit Singh: స్టార్ సింగర్ అరిజిత్ సింగ్ సంచలన ప్రకటన.. ఇకపై పాటలకు గుడ్ బై.. కానీ ట్విస్ట్ ఏంటంటే
స్టార్ సింగర్ అరిజిత్ సింగ్ సంచలన ప్రకటన చేశారు. కొత్తగా సినిమాలకు పాటలు పాడటం లేదని ప్రకటించారు. అదే సమయంలో కొత్త జర్నీ స్టార్ట్ చేయబోతున్నట్టు వెల్లడించారు.

స్టార్ సింగర్ అరిజిత్ సింగ్ సంచలన ప్రకటన
ప్రముఖ స్టార్ ప్లేబ్యాక్ సింగర్ అరిజిత్ సింగ్ తన అభిమానులకు షాక్ ఇచ్చాడు. పాటలకు రిటైర్‌మెంట్ ప్రకటించారు. తాజాగా ఆయన సోషల్ మీడియా ద్వారా ఈ ప్రకటన చేశారు. ఇకపై కొత్తగా అసైన్‌మెంట్స్ తీసుకోవడం లేదని, దీన్ని ఇంతటితో ఆపేస్తున్నట్టు ప్రకటించారు. ఆయన పెట్టిన పోస్ట్ వైరల్ అవుతుంది. అభిమానులను కలవరానికి గురి చేస్తోంది.
ప్లేబ్యాక్ సింగర్‌గా రిటైర్‌మెంట్
అరిజిత్ సింగ్ ఇంతకి ఏం చెప్పాడంటే, అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇన్నేళ్లుగా శ్రోతలుగా నాకు ఇంతటి ప్రేమని అందించినందుకు మీ అందరికి ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. ఇకపై నేను ప్లే బ్యాక్ సింగర్‌గా ఎలాంటి కొత్త అవకాశాలు తీసుకోవడం లేదని ప్రకటిస్తున్నందుకు సంతోషంగా ఉంది. నేను ఇకపై దీన్ని ఆపేస్తున్నాను. ఇదొక అద్భుతమైన ప్రయాణం. దేవుడు నా పట్ల చాలా దయతో ఉన్నాడు.
సంగీతం ఆపబోనని ప్రకటన
నేను మంచి సంగీతానికి అభిమానిని, భవిష్యత్‌లో ఒక చిన్న కళాకారుడిగా మరింత నేర్చుకుని నా సొంతంగా మరిన్ని పనులు చేస్తాను. మీ అందరి సపోర్ట్ కి మరోసారి మరోసారి ధన్యవాదాలు. నేను ఇంకా కొన్ని పెండింగ్‌లో ఉన్న పనులు(పాటలు) పూర్తి చేయాల్సి ఉంది. వాటిని పూర్తి చేస్తాను. కాబట్టి ఈ ఏడాది మీరు కొన్ని పాటలను నా నుంచి చూడొచ్చు. అదే సమయంలో నేను సంగీతం చేయడం ఆపనని స్పష్టం చేయాలనుకుంటున్నాను` అని తెలిపారు అర్జిత్ సింగ్. సోషల్ మీడియా ద్వారా ఆయన ఈ పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఇది వైరల్‌గా మారింది.
సోలోగా పాటలు పాడబోతున్న అరిజిత్ సింగ్
అరిజిత్ సింగ్ ఇకపై ప్రొఫేషనల్ వర్క్ ఆపేస్తున్నారు. కానీ సొంతంగానే పాటలు పాడబోతున్నారనే విషయాన్ని ఈ దిగ్గజ సింగర్ వెల్లడించారు. ఇకపై ఆయన సినిమాలకు పాటలు పాడటం గానీ, మ్యూజిక్ చేయడం గానీ చేయబోడనే విషయాన్ని స్పష్టం చేశాడు. అర్జిత్ సింగ్ ప్లేబ్యాక్ సింగర్‌గా, మ్యూజిక్ కంపోజర్‌గా, మ్యూజిక్ ప్రొడ్యూసర్‌గా రాణిస్తున్నారు. ఆయన మ్యూజిక్ డైరెక్టర్ ప్రీతమ్ సంగీత సారథ్యంలో ఎక్కువగా పాటలు పాడారు.
అరిజిత్ సింగ్ పాటలు పాడిన తెలుగు సినిమాలు
అరిజిత్ సింగ్ ఇప్పటి వరకు తన కెరీర్‌లో 715పాటలు పాడారు. వాటిలో హిందీలో 532, బెంగాలీలో 144 పాటలు, తెలుగులో 25 పాటలు, తమిళంలో నాలుగు పాటలు పాడారు. అలాగే మ్యూజిక్ కంపోజర్‌గా దాదాపు 28 సినిమాలకు వర్క్ చేశారు. ఇక ఆయన తెలుగులో `కేడీ`, `మనం`, `స్వామి రారా`, `ఉయ్యాల జంపాలా`, `రౌడీ ఫెలో`, `దోచెయ్`, `భలే మంచి రోజు`, `తను నేను`, `కేశవ`, `నా పేరు సూర్య`, `హుషారు`, `బ్రహ్మాస్త్ర`, `ఓం భీమ్ భుష్` వంటి చిత్రాల్లో పాటలు పాడారు. `మనం`లో కనులను తాకే ఇలా అనే పాటని ఆయనే పాడారు. హిందీలో అనేక సూపర్ హిట్ సాంగ్స్ ని అలపించారు అరిజిత్ సింగ్.

