సమంతకి స్టార్ ప్రొడ్యూసర్ ఫామ్ హౌజ్ గిఫ్ట్.. కొడుకు కోసం నిర్మాత అంతటి సాహసం ?
స్టార్ ప్రొడ్యూసర్.. స్టార్ హీరోయిన్ సమంతకి ఫామ్ హౌజ్ గిఫ్ట్ గా ఇచ్చాడట. ఈ క్రేజీ విషయం ఇప్పుడు తెరపైకి వచ్చింది. నిర్మాత ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
SAMANTHA
సమంత పడిలేచిన కెరటం. ఆమె జీవితంలో బాగా దెబ్బతిన్నది. ఓ వైపు నాగ చైతన్యతో విడాకులు, మరోవైపు మయోసైటిస్ అనే వ్యాధి.. ఈరెండింటి కారణంగా బాగా కుంగిపోయింది సమంత. దాన్నుంచి నెమ్మదిగా కోలుకుంటుంది. సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చి ఇప్పుడు మళ్లీ కమ్ బ్యాక్ అవుతుంది. ఈక్రమంలోనే ఆమెకి మరో షాక్ తగిలింది. సమంత నాన్న చనిపోయిన విషయం తెలిసిందే. ఇటీవలే ఆయన హఠాన్మరణం చెందారు.
read more: పుష్ప2లో పుష్ప, శ్రీవల్లి, షేకావత్ పాత్రలు మొదట చేయాల్సింది ఎవరో తెలుసా?
దీంతో సమంతకి దెబ్బ మీద దెబ్బ పడినట్టయ్యింది. మళ్లీ కోలుకోవడానికి చాలా టైమ్ పట్టేలా ఉంది. ఈ నేపథ్యంలో సమంతకి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఆమెకి ఓ స్టార్ ప్రొడ్యూసర్ ఫామ్ హౌజ్ గిఫ్ట్ గా ఇచ్చారట. తన కొడుకు కోసం ఆ నిర్మాత అంతటి సాహసం చేశాడని అంటున్నారు. మరి ఈ కథేంటో చూస్తే.
సమంత.. కుర్ర హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో `అల్లుడు శీను` సినిమా చేసింది. బెల్లంకొండకి అది మొదటి సినిమా. హీరోగా పరిచయం అవుతూ చేసిన మూవీ. అప్పటికే సమంత స్టార్ హీరోయిన్. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ వంటి సూపర్ స్టార్లతో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న టైమ్. ఆ సమయంలో ఓ కొత్త కుర్రాడితో సినిమా చేయడం అంటే మామూలు విషయం కాదు, అది కెరీర్‌కి కూడా ఇబ్బందే, కానీ నిర్మాత కోసం సాహసం చేసింది సమంత.
also read: జనసేన పార్టీలో చేరడంపై మంచు మనోజ్ ఫస్ట్ రియాక్షన్, తండ్రీకొడుకులు చేసిన పనికి ఈ నిర్ణయం?
ఆ నిర్మాత ఎవరో కాదు బెల్లంకొండ సురేష్. ఆయన టాలీవుడ్‌లో స్టార్ ప్రొడ్యూసర్‌గా రాణిస్తున్నాడు. అప్పటికే చాలా సినిమాలు నిర్మించి హిట్ కొట్టాడు. తన కొడుకు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ని హీరోగా పరిచయం చేస్తూ `అల్లుడు శీను` సినిమా నిర్మించారు. కొడుకుని గ్రాండ్ గా పరిచయం చేయాలనే ఉద్దేశ్యంతో భారీ కాస్టింగ్, టెక్నీషియన్లని తీసుకున్నారు.
కొడుక్కి జోడీగా సమంత హీరోయిన్‌గా నటించగా, స్టార్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకుడు. సినిమాని భారీ స్కేల్‌లో రూపొందించారు. రిలీజ్ అయిన ఈ మూవీకి మిశ్రమ స్పందన వచ్చింది. పోయిందని కొందరు అన్నారు. కానీ నిర్మాతగా తాను సేఫ్ అని, తన దృష్టిలో అది హిట్ అయిన సురేష్ తెలిపారు.
అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో సమంతకి హెల్త్ సమస్య వచ్చింది. స్కిన్ ప్రాబ్లమ్ అని సమాచారం. అందుకోసం మనీ కావాలి. దీంతో సమంత అడగ్గానే రూ.25లక్షలు ఇచ్చాడట బెల్లంకొండ సురేష్. ఆ తర్వాత ఆ అమౌంట్‌ని రెమ్యూనరేషన్‌లో సెటిల్ చేశారట. `అల్లుడు శీను` విడుదలై మంచి ఆదరణ పొంది, నిర్మాతగా తనకు లాభాలు తేవడంతో ఆ ఆనందంలో సమంత కోసం ఫామ్ హౌజ్ గిఫ్ట్ గా ఇచ్చాడట సురేష్.
తన కొడుకుతో స్టార్ హీరోయిన్ నటించడమే గొప్ప అనే భావనతో ఆమెకి ఫామ్ హౌజ్ గిఫ్ట్ గా ఇచ్చినట్టు సమాచారం. ఇటీవల `మిర్చీ 9` ఇంటర్వ్యూలో ఈ ప్రస్తావన వస్తే నిర్మాత ఈ విషయం తెలిపారు. మొదట 25లక్షలు ఇచ్చానని, `ఫామ్ హౌజ్ తర్వాత` ఇచ్చినట్టుగా తెలిపారు బెల్లంకొండ సురేష్. ఆయన సినిమాలకు కొంత కాలం బ్రేక్ ఇచ్చాడు. ఇప్పుడు మళ్లీ కమ్ బ్యాక్ అవుతున్నారు. ఇకపై వరుసగా సినిమాలు నిర్మించబోతున్నట్టు తెలిపారు.
read more: ఆ పని చేయలేక కాలు విరగొట్టుకున్న జూ ఎన్టీఆర్, ఇప్పటికీ అదే మొండిపట్టు