ఆ పని చేయలేక కాలు విరగొట్టుకున్న జూ ఎన్టీఆర్, ఇప్పటికీ అదే మొండిపట్టు
ఎన్టీఆర్ తనకు నచ్చనిది ఏ పనిచేయడట. ఈ విషయంలో ఏం చేయడానికైనా రెడీ. ఈ క్రమంలో ఆయన కాలు విరగొట్టుకున్నాడట.
జూ ఎన్టీఆర్.. ఇటీవల `దేవర` సినిమాతో హిట్ అందుకున్నాడు. సినిమాకి మిశ్రమ స్పందన లభించినా, నార్త్ ఆడియెన్స్ ని బాగా ఆకట్టుకుంది. ఈ మూవీతో పాన్ ఇండియా హీరోగా స్థిరపడిపోయాడు తారక్. ఇప్పుడు ప్రశాంత్ నీల్ సినిమా కోసం సిద్ధమవుతున్నాడు.
read more: పుష్ప2లో పుష్ప, శ్రీవల్లి, షేకావత్ పాత్రలు మొదట చేయాల్సింది ఎవరో తెలుసా?
NTR
ఇదిలా ఉంటే ఎన్టీఆర్ కి పట్టుదల ఎక్కువ అట. అదే సమయంలో మొండిపట్టు కూడా ఎక్కువే. తనకు నచ్చని పని చేయాలంటే చేయడట. అది ఎలాంటి పని అయినా తనకు నచ్చకపోతే ఇక అంతే చేయడానికి అస్సలు ఇష్టపడడు. అందుకోసం ఏమైనా చేస్తాడు. ఈ క్రమంలో కాలు విరగొట్టుకున్నాడట జూ ఎన్టీఆర్. మరి ఆ కథేంటో చూస్తే.
చిన్నప్పట్నుంచి సినిమాలంటే ఇష్టం. స్టడీస్‌పై పెద్దగా ఆసక్తి లేదు. బోర్డింగ్ స్కూల్‌కి వెళ్లను వెళ్లను అంటూ బోర్డింగ్ స్కూల్‌కి పంపించారట. విజ్ఞాన్ కాలేజీకి పంపించారు. అందులో వడ్లమూడి రత్తయ్య ప్రిన్సిపల్. నేను చదవను అంటూ నానా రభస చేశాడట. తిరిగి ఇంటికి రావడానికి కాలుని రాయికి వేసి కొట్టుకున్నాడట. దీంతో ఫ్యాక్చర్ కూడా అయ్యిందట. దీంతో అయినా ఇంటికి పంపిస్తారని.
NTR
ముందే అమ్మకి ఫోన్ చేశాడట. నేను ఇక్కడ చదవను అంటే ఫోన్ కట్ చేసేదట. ఇలా చాలా సార్లు అయ్యింది. దీంతో మొండిపట్టుదలకుపోయాను కాలు విరగొట్టుకున్నాను అని తెలిపారు తారక్. ఆ మొండి లక్షణాలు ఇప్పటికీ కూడా ఉన్నాయని, అవి పోవు అని తెలిపారు తారక్. నాకు నచ్చని పనిని నేను చేయలేను, నాకది డైజెస్ట్ కాదు, దీంతో చేయలేకపోతాను. అజీర్తి లాగా ఉంటుందన్నారు ఎన్టీఆర్.
also read: చిరంజీవికి గాలం వెయ్యాలనే ఆలోచన అల్లు రామలింగయ్యది కాదా? తెరవెనుక ఉన్న ఆ లేడీ ఎవరు?
`నిన్ను చూడాలని` సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయం అయ్యాడు ఎన్టీఆర్. `స్టూడెంట్ నెం 1`తో హిట్ కొట్టాడు. `ఆది`తో తొలి బ్రేక్ అందుకున్నారు. `సింహాద్రి`తో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. `యమదొంగ`, `అదుర్స్`, `బృందావనం`, `టెంపర్`, `నాన్నకు ప్రేమతో`, `జనతా గ్యారేజీ`, `జై లవకుశ`, `అరవింద సమేత`, `ఆర్‌ఆర్‌ఆర్`, `దేవర` చిత్రాలతో విజయాలు అందుకున్నారు. ఇప్పుడు ప్రశాంత్ నీల్‌తో సినిమా చేస్తున్నాడు. మరోవైపు `దేవర 2` కూడా చేయాల్సి ఉంది.
read more: జనసేన పార్టీలో చేరడంపై మంచు మనోజ్ ఫస్ట్ రియాక్షన్, తండ్రీకొడుకులు చేసిన పనికి ఈ నిర్ణయం?