Entertainment

పుష్ప2లో పుష్ప, శ్రీవల్లి, షేకావత్ గా మొదట చేయాల్సింది ఎవరో తెలుసా?

'పుష్ప 2' బాక్సాఫీస్ సునామీ

బాక్సాఫీస్ దగ్గర 'పుష్ప 2' సునామీలా కలెక్షన్లు రాబడుతోంది. 11 రోజుల్లో 902 కోట్ల నెట్ కలెక్షన్, ప్రపంచవ్యాప్తంగా 1400 కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించింది.

పుష్పగా అల్లు అర్జున్ ఫస్ట్ ఛాయిస్ కాదు

సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 'పుష్ప' సినిమాకి అల్లు అర్జున్ ఫస్ట్ ఛాయిస్‌ కాదు. శ్రీవల్లి, భన్వర్ సింగ్ పాత్రలకు కూడా వేరే వాళ్ళను అనుకున్నారు.

పుష్పగా ఎవరిని అనుకున్నారు?

పుష్ప పాత్రకు సూపర్ స్టార్ మహేష్ బాబును తీసుకోవాలని సుకుమార్ అనుకున్నారట. కానీ ఆయన వద్దనడంతో అల్లు అర్జున్ కి దక్కింది.

మహేష్ ఎందుకు వద్దన్నారు?

ఈ పాత్రకు ఫిజికల్ ట్రాన్స్ ఫర్మేషన్ అవసరం. అంతేకాదు నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర కావడంతో మహేష్ వద్దన్నారట.

శ్రీవల్లిగా ఎవరిని అనుకున్నారు?

'రంగస్థలం' తర్వాత సమంతకు 'పుష్ప' ఆఫర్ చేశారట. కానీ మళ్ళీ ఊరి పిల్ల పాత్ర చేయడం ఇష్టం లేక ఆమె వద్దని చెప్పింది.

ఐటెం సాంగ్ చేసిన సమంత

సమంత 'పుష్ప 1' లో 'ఊ అంటావా' ఐటెం సాంగ్ చేసింది. ఆమె వద్దనగానే శ్రీవల్లి పాత్ర రష్మికకు వెళ్ళింది.

భన్వర్ సింగ్ గా విజయ్ సేతుపతి

విలన్ భన్వర్ సింగ్ పాత్రకు విజయ్ సేతుపతిని అనుకున్నారట. కానీ డేట్స్ సరిపోకపోవడంతో ఫహాద్ ఫాసిల్ కి వెళ్ళింది.

కమల్ హాసన్ నిర్మించిన టాప్‌ బ్లాక్‌ బస్టర్ సినిమాలు

అల్లు అర్జున్ అత్యధిక టాక్స్ పేయర్.. ఎంత కట్టాడో తెలుసా?

సాయి పల్లవి చిన్నప్పుడు ఇలా ఉండేదా?

చిరు, బాలయ్య, చైతూ.. ఈ ఏడాది వెండితెరపై కనిపించని హీరోలు వీరే