- Home
- Entertainment
- ఎన్టీఆర్ మూవీపై హైప్ ఇచ్చిన స్టార్ ప్రొడ్యూసర్, ఆ సస్పెన్స్ కి తెర.. ఈ సారి దానికి మించి
ఎన్టీఆర్ మూవీపై హైప్ ఇచ్చిన స్టార్ ప్రొడ్యూసర్, ఆ సస్పెన్స్ కి తెర.. ఈ సారి దానికి మించి
ఎన్టీఆర్, త్రివిక్రమ్‌తో చేయాల్సిన బిగ్ మూవీ మిస్ అయ్యింది. అది క్యాన్సిల్ అయినందుకు చాలా బాధపడినట్టు చెప్పాడు నాగవంశీ. కానీ ఇప్పుడు చేయబోయే మూవీ దాన్ని మించి ఉంటుందన్నారు.

Jr NTR
ఎన్టీఆర్ ప్రస్తుతం మూడు సినిమాలు లైన్‌లో ఉన్నాయి. ఈ క్రమంలో కొత్త సినిమాకి సంబంధించిన హైప్ ఇచ్చాడు స్టార్ ప్రొడ్యూసర్ నాగవంశీ. తాను తారక్‌తో చేయబోతున్న సినిమాకి సంబంధించి ఆయన అదిరిపోయే విషయాన్ని వెల్లడించారు.
Junior NTR
ఎన్టీఆర్ నెక్ట్స్ కోలీవుడ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. అనిరుథ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించబోతుందని తెలుస్తుంది. అయితే ఈ మూవీకి సంబంధించిన ఇప్పటి వరకు ఉన్నది గాసిప్పే. టీమ్ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు.
NTR, naga vamsi
ఈ నేపథ్యంలో తాజాగా నిర్మాత నాగవంశీ కన్ఫమ్ చేశారు. ఎన్టీఆర్‌తో నెక్ట్స్ చేయబోతున్న సినిమా వేరే లెవల్లో ఉంటుందని చెప్పారు. అది నెల్సన్ మూవీనే అని ఆయన చెప్పకనే చెప్పారు.
Jr NTR
నిజానికి సితార బ్యానర్(హారికా అండ్ హాసిని క్రియేషన్స్)లో ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్ ఓ మూవీ రావాల్సి ఉంది. కానీ అది క్యాన్సిల్ అయ్యింది. ఆ తర్వాత త్రివిక్రమ్ మహేష్‌తో మూవీ చేశాడు. ఎన్టీఆర్ కొరటాలతో సినిమా చేశాడు. అదే `దేవర`. ఇది విశేష ఆదరణ పొందిన విషయం తెలిసిందే.
అలా ఎన్టీఆర్, త్రివిక్రమ్‌తో చేయాల్సిన బిగ్ మూవీ మిస్ అయ్యింది. అది క్యాన్సిల్ అయినందుకు చాలా బాధపడినట్టు చెప్పాడు నాగవంశీ. కానీ ఇప్పుడు చేయబోయే మూవీ దాన్ని మించి ఉంటుందని, త్వరలో అది చూస్తారని ఎన్టీఆర్, నెల్సన్ మూవీపై భారీ హైప్ ఇచ్చాడు నాగవంశీ. మరి ఇది ఏం రేంజ్‌లో ఉంటుందో చూడాలి.
NTR,
నెల్సన్ `జైలర్` చిత్రాలతో ఆకట్టుకున్నాడు. ఇప్పుడు `జైలర్2 ` తెరకెక్కిస్తున్నారు. వాటి తరహాలోనే భారీ యాక్షన్ మూవీని ప్లాన్ చేస్తున్నారట. ఎన్టీఆర్ రోల్ వేరే లెవల్ అని సమాచారం. దెబ్బకి వెయ్యి కోట్లు పక్కా అనేలా ఉంటుందని సమాచారం. ఈ మూవీ కోసం తారక్ ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ ఏడాది ద్వితీయార్థంలో ఈ మూవీ ప్రారంభమయ్యే ఛాన్స్ ఉందట.
read more: రాజశేఖర్, సుమన్ మధ్య చిచ్చు పెట్టిన యాక్షన్ హీరో, స్ట్రాంగ్ వార్నింగ్.. చివరికి ఇద్దరికీ ఝలక్
also read: చిరంజీవికి నటనలో శిక్షణ ఇచ్చిన స్టార్ హీరో ఎవరో తెలుసా?, కట్ చేస్తే తన సినిమాలోనే సైడ్ రోల్