MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • రాజశేఖర్‌, సుమన్‌ మధ్య చిచ్చు పెట్టిన యాక్షన్‌ హీరో, స్ట్రాంగ్‌ వార్నింగ్‌.. చివరికి ఇద్దరికీ ఝలక్‌

రాజశేఖర్‌, సుమన్‌ మధ్య చిచ్చు పెట్టిన యాక్షన్‌ హీరో, స్ట్రాంగ్‌ వార్నింగ్‌.. చివరికి ఇద్దరికీ ఝలక్‌

Suman-Rajasekhar: రాజశేఖర్‌, సుమన్‌ ఒకప్పుడు యాక్షన్‌ హీరోగా రాణించారు. కానీ మరో యాక్షన్‌ హీరో వీరి మధ్య చిచ్చు పెట్టాడు. ఇద్దరు గొడవ పడే పరిస్థితికి తీసుకెళ్లాడు. మరి ఆయన ఎవరు? ఆ కథేంటి చూస్తే  

2 Min read
Author : Aithagoni Raju
Published : Mar 19 2025, 01:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
suman, rajasekhar

suman, rajasekhar

Suman-Rajasekhar: రాజశేఖర్‌, సుమన్‌ అప్పట్లో స్టార్‌ హీరోలుగా వెలిగారు. చిరు, బాలయ్య, వెంకీ, నాగ్‌లకు దీటుగా సినిమాలు చేశారు. వారికి సమానమైన ఇమేజ్‌, క్రేజ్‌ని సంపాదించుకున్నారు.

కానీ వాళ్లలా ఆ ఇమేజ్‌, మార్కెట్‌ని కంటిన్యూ చేయలేకపోయారు. అయితే స్టార్లుగా వెలుగుతున్న సమయంలోనే ఇద్దరి మధ్య గొడవలు తలెత్తాయి. కారణం మరో యాక్షన్‌ హీరో. మరి ఆయన ఎవరు? వీరి గొడవేంటి? అనేది చూస్తే. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
rajasekhar

rajasekhar

డాక్టర్‌ అయిన రాజశేఖర్‌ సినిమాలపై ఆసక్తితో ఈ రంగంలోకి వచ్చారు. మొదట్లో ఒకటి రెండు సినిమాల్లో నెగటివ్‌ షేడ్‌ ఉన్న రోల్స్ చేసినా తర్వాత హీరోగా రాణించాడు. స్టార్‌ హీరోగా ఎదిగాడు. యాంగ్రీ యంగ్‌ మేన్‌గా పేరు తెచ్చుకున్నారు. 
 

37
Suman

Suman

అదే సమయంలో సుమన్‌ కూడా హీరోగా రాణించారు. స్టార్‌గా ఎదిగారు. చిరంజీవిని డామినేట్‌ చేసే స్థాయికి సుమన్‌ ఎదగడం విశేషం. ఆయన్ని కేసులు వెంటాడకపోతే సుమన్‌ రేంజ్‌ ఇప్పుడు వేరేలా ఉండేది. కేసుల తర్వాత హీరోగా చేసినా పెద్దగా ఆడలేదు. ఓ దశలో ఆయన క్యారెక్టర్స్ వైపు టర్న్ తీసుకున్నాడు. అలరిస్తున్నారు. 

47
sai kumar

sai kumar

ఇదిలా ఉంటే ఇద్దరు హీరోలు సినిమాల్లో వాడేది సొంత వాయిస్‌ కాదు. వేరే వాళ్లు డబ్బింగ్‌ చెప్పేవాళ్లు. అది ఎవరో కాదు సాయికుమార్‌. ఈ ఇద్దరు హీరోలకు అప్పట్లో సాయికుమార్‌ డబ్బింగ్‌ చెప్పేవారు. అయితే ఇద్దరు స్టార్లు గా రాణిస్తున్న సమయంలో ఇద్దరి వాయిస్‌లు సేమ్‌ అనే ఫీలింగ్‌ కలిగింది. ఆడియెన్స్ అదే గమనించారు. ఇది వారి కెరీర్‌కి ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి నెలకొంది. 
 

57
rajasekhar (photo credit-etv)

rajasekhar (photo credit-etv)

ఇది సుమన్‌, రాజశేఖర్‌ మధ్య గొడవకు దారితీసింది. ఒకరంటే ఒకరికి పడని పరిస్థితి ఏర్పడింది. అంతేకాదు ఇద్దరు కలిసి సాయికుమార్‌కి వార్నింగ్‌ ఇచ్చారు. నాకు డబ్బింగ్‌ చెప్పితే ఆయనకు చెప్పొద్దని ఇద్దరు హెచ్చరించారు. కానీ ఇద్దరికీ సాయికుమార్‌ వాయిసే కావాలి. ఇది ఫిల్మ్ మేకర్స్ కి పెద్ద చిక్కు వచ్చి పడింది.  
 

67
sai kumar

sai kumar

దీంతో ఓ ప్లాన్‌ చేశారు. ఇద్దరి వాయిస్‌లో చిన్న డిఫరెంట్స్ క్రియేట్‌ చేశారు. క్రమ క్రమంగా దాన్ని ఇంప్లిమెంట్‌ చేశారట. దీంతో రాజశేఖర్‌కి ఆవేశంగా డబ్బింగ్‌ చెప్పగా, సుమన్‌కి కాస్త తక్కువ పిచ్‌లో డబ్బింగ్‌ చెప్పడం స్టార్ట్ చేశారట.

మొదట్లో వాళ్లకి తెలియకుండానే దీన్ని ఇంప్లిమెంట్‌ చేసి వాళ్లని కూల్ చేశాడు. కానీ తర్వాత అర్థమైపోయింది. దీంతో చేసేదేం లేక వాళ్లు కూడా అంగీకరించారు. కానీ ఆయనలా తనకు, తనలా ఆయనకు చెప్పొద్దని హెచ్చరించారు. అలా ఇద్దరిని బ్యాలెన్స్ చేశాడట సాయికుమార్‌. 
 

77
suman, sai kumar, rajasekhar

suman, sai kumar, rajasekhar

చివరికి మరో చిక్కు వచ్చింది. అది తన విషయంలోనే కావడం గమనార్హం. అప్పట్లో సాయికుమార్‌ కూడా సోలో హీరోగా సినిమాలు చేశారు. ఆయన కూడా యాక్షన్‌ మూవీస్‌ చేశారు.

రాజశేఖర్‌ స్టయిల్‌లో తన సినిమాలకు వాయిస్‌ చెప్పుకోవడంతో సాయికుమార్‌కి రాజశేఖర్‌ వాయిస్‌ చెబుతున్నాడని ప్రచారం జరిగింది. జనాలంతా అలానే ఫీలయ్యారు. చివరికి తనకే అది ఎఫెక్ట్ అయ్యిందన్నారు సాయికుమార్. ఒపెన్‌ హార్ట్ విత్‌ ఆర్కే షోలో ఈ విషయాన్ని వెల్లడించారు సాయికుమార్‌.

read more: చిరంజీవికి నటనలో శిక్షణ ఇచ్చిన స్టార్‌ హీరో, కట్‌ చేస్తే మెగాస్టార్‌ సినిమాల్లోనే సైడ్‌ రోల్స్

also read:  అల్లు అర్జున్‌ వివాదంలో ఇండస్ట్రీ కావాలనే మౌనం, చిరు దెండం ఎందుకు పెట్టాడంటే.. మంచు విష్ణు బయటపెట్టిన నిజాలు
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Biggest Flop Movie: ఇండియాలోనే అతిపెద్ద డిజాస్టర్.. ఓటీటీ వాళ్ళు కూడా డీల్ రద్దు చేసుకున్న మూవీ ఇదే
Recommended image2
Spirit: ప్రభాస్ 'స్పిరిట్'కి పక్కా 'A' సర్టిఫికెట్.. సందీప్ రెడ్డి వంగా కామెంట్స్, రిలీజ్ డేట్ పై క్లారిటీ
Recommended image3
Makutam OTT: థియేటర్లలో ఫ్లాప్ అయిన విశాల్ 'మకుటం'.. నెలరోజుల్లోపే ఓటీటీలోకి, ఎప్పటి నుంచి అంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved