MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Chiranjeevi Father: చిరంజీవికి తండ్రి ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ ఏంటో తెలుసా? నిర్మాత మోసం చేయడంతో మర్చిపోలేని ట్రీట్‌

Chiranjeevi Father: చిరంజీవికి తండ్రి ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ ఏంటో తెలుసా? నిర్మాత మోసం చేయడంతో మర్చిపోలేని ట్రీట్‌

మెగాస్టార్‌ చిరంజీవికి కెరీర్ ప్రారంభంలో ఓ నిర్మాత ఛీట్‌ చేశారు. కారు ఇస్తానని చెప్పి మోసం చేశాడు. దీంతో డిజప్పాయింట్‌ అయిన చిరుకి ఆయన తండ్రి మర్చిపోలేని ట్రీట్‌ ఇచ్చాడట. 

3 Min read
Author : Aithagoni Raju
Published : Feb 06 2026, 11:50 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మహావృక్షంలా ఎదిగిన చిరంజీవి
Image Credit : youtube/@MediaFxOfficial

మహావృక్షంలా ఎదిగిన చిరంజీవి

ఎలాంటి బ్యాక్‌ గ్రౌండ్‌ లేకుండా సినిమాల్లోకి వచ్చిన మెగాస్టార్‌ చిరంజీవి ఇప్పుడు మెగా అనే మహా వృక్షంలా ఎదిగారు.  సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ ఒక పెద్ద ఫ్యామిలీగా నిలిచిపోయింది. ఆ తర్వాత చాలా మంది హీరోలు సినిమాల్లోకి వచ్చారు. మెగా ఫ్యామిలీలో ఇప్పుడు దాదాపు పది మంది వరకు హీరోలున్నారంటే అతిశయోక్తి కాదు. ఇప్పటికీ టాలీవుడ్‌లో బిగ్గెస్ట్ స్టార్‌గా రాణిస్తున్నారు చిరంజీవి. ఇటీవల ఆయన `మన శంకర వర ప్రసాద్‌ గారు` మూవీతో ఇండస్ట్రీ హిట్‌ని కొట్టారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు అనిల్‌ రావిపూడికి కారుని కూడా గిఫ్ట్ గా ఇచ్చారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
చిరంజీవి ఫస్ట్ కార్‌ ఎక్స్ పీరియెన్స్
Image Credit : Instagram/Chiranjeevi

చిరంజీవి ఫస్ట్ కార్‌ ఎక్స్ పీరియెన్స్

ఇదిలా ఉంటే చిరంజీవి జీవితంలో కారుకి ప్రత్యేక స్థానం ఉంది. దాని వెనుక ఎప్పటికీ మర్చిపోలేని మెమోరీస్‌ ఉన్నాయి. మరి ఇంతకి చిరంజీవి ఫస్ట్ కారు ఎప్పుడు కొన్నారు. దాని వెనుక ఉన్నకథ తెలిస్తే అయ్యో అనాల్సిందే. ఎందుకంటే ఓ నిర్మాత చిరంజీవిని ఛీట్‌ చేశారు. కారు గిఫ్ట్ గా ఇస్తానని మాట మార్చారు. ఆ సమయంలో చిరంజీవికి మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చాడు ఆయన తండ్రి వెంకటరావు. ఆ కథేంటో చూస్తే, చిరంజీవి 1978లో నటుడిగా మారారు. `పునాది రాళ్లు` ఆయన తొలి చిత్రమైనా, `ప్రాణం ఖరీదు` మొదట విడుదలయ్యింది. ఆ తర్వాత ఒకే ఏడాది ఎనిమిది సినిమాలు చేశాడు చిరంజీవి.

35
చిరంజీవిని ఛీట్‌ చేసిన నిర్మాత
Image Credit : youtube/@Shinescreenscinema

చిరంజీవిని ఛీట్‌ చేసిన నిర్మాత

1979లోనే `ఐ లవ్‌ వ్యూ` అనే చిత్రంలో నటించారు చిరు. ఈ సినిమా నిర్మాత నారాయణకి ఫియెట్‌ కారు ఉండేదట. అది చూసి చిరంజీవి ముచ్చటపడ్డారట. భలే ఉందనుకునేవాడట. ఆ విషయం నిర్మాత నారాయణకు తెలిసింది. దీంతో ఈ సినిమాలో నీ యాక్టింగ్‌ నన్ను ఇంప్రెస్‌ చేస్తే ఈ ఫియెట్‌ కారుని గిఫ్ట్ గా ఇస్తాను అని చెప్పాడట. దీంతో సంబర పడ్డ చిరంజీవి.. ఆ మూవీ కోసం చాలా కష్టపడ్డాడట. అందరి కంటే ముందే వచ్చి రిహార్సల్స్ చేయడం, సినిమా పనుల్లో భాగం కావడం ఇలా చాలా కష్టపడ్డాడట. కానీ సినిమా రిలీజ్‌ అయ్యాక నిర్మాత మాట నిలబెట్టుకోలేదట. తనకు కారు ఇవ్వలేదు. దీంతో చాలా డిజప్పాయింట్‌ అయ్యాడట.

45
చిరంజీవికి మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చిన తండ్రి
Image Credit : youtube/@MediaFxOfficial

చిరంజీవికి మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చిన తండ్రి

చిరంజీవి బాధపడటం చూసిన తండ్రి వెంకటరావు ఆయనకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడు. తన సొంత డబ్బులతో ఏకంగా కొత్తగా ఫీయెట్‌ కారు కొని గిఫ్ట్ గా ఇచ్చాడట. అలా చిరంజీవి మొదటిసారి కారు కొన్నారు. ఆ కారుతోనే ఫ్యామిలీ అంతా కలిసి తిరిగారని, పెళ్లి వరకు అదే కారు మెయింటేన్‌ చేసినట్టు తెలిపారు చిరంజీవి. భార్య సురేఖతో కలిసి చెన్నైవీధుల్లో షికార్లు కొట్టారట. ఆ తర్వాత మార్కెట్‌లోకి కొత్తగా మారుతి 800 వచ్చింది. అది చాలా స్పీడ్‌ వెళ్తుంది. అది చూసి ఇంప్రెస్‌ అయ్యారట. టాలీవుడ్‌లో మొదటిసారి ఆ కారు కొన్నది తనే అని తెలిపారు చిరు. అంతేకాదు తన సొంత డబ్బులతో ఆ కారుని కొన్నాడట. మొదట్లో కార్లంటే పెద్దగా ఆసక్తి ఉండేది కాదని, ఆ తర్వాత ఒక్కో కారుపై ఆసక్తి ఏర్పడిందని చెప్పారు చిరు. ఫస్ట్ టైమ్‌ ఓ టీవీకి ఇచ్చిన వీడియో ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాలను పంచుకున్నారు. ఈ అరుదైన ఇంటర్వ్యూ ఇప్పుడు వైరల్‌ అవుతుంది.

55
మన శంకర వర ప్రసాద్‌ గారుతో ఇండస్ట్రీ హిట్‌ కొట్టిన చిరు
Image Credit : Youtube/Youwe Media

మన శంకర వర ప్రసాద్‌ గారుతో ఇండస్ట్రీ హిట్‌ కొట్టిన చిరు

ఆ తర్వాత చిరంజీవి ల్యాండ్‌ క్రూజర్‌, మెర్సిడేజ్‌ బెంజ్‌, టొయోటో సెర, వింగ్స్, హోండా ఆకర్డ్ వంటి కార్లు కొన్నారు. ప్రస్తుతం ఆయన వద్ద బెంజ్‌, బీఎండబ్ల్యూ, రోల్స్ రాయిస్‌ కార్లు ఉన్నాయి. ఇక చిరంజీవి ఈ సంక్రాంతికి `మన శంకర వరప్రసాద్‌ గారు` చిత్రంతో ఆడియెన్స్ ముందుకు వచ్చారు. అనిల్‌ రావిపూడి దీనికి దర్శకత్వం వహించారు. వెంకటేష్‌ స్పెలష్‌ రోల్‌ చేసిన ఈ మూవీ పెద్ద హిట్‌ అయ్యింది. దాదాపు మూడు వందల కోట్ల వరకు వసూళ్లని రాబట్టి రీజనల్‌ ఫిల్మ్స్ లో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం ఆయన బాబీ దర్శకత్వంలో సినిమా కోసం రెడీ అవుతున్నారు. అలాగే జులైలో `విశ్వంభర` చిత్రంతో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నారు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bhagyashri Borse: నాలుగు సినిమాలు ఫట్, ఐదో సినిమాతో షేక్ చేసిన భాగ్యశ్రీ.. చందమామలా వెలిగిపోతోందిగా
Recommended image2
Bollywood New Actors: రణ్‌బీర్ కపూర్ లాగా ఈ ఐదుగురు కుర్ర హీరోలు బాలీవుడ్‌ను ఏలబోతున్నారా?
Recommended image3
Emo Emo Idi: కట్టిపడేస్తున్న మేక రోషన్‌ ‘ఎమో ఎమో ఇది’ టైటిల్ సాంగ్.. శైలేష్‌ కొలనులో కొత్త యాంగిల్‌
Related Stories
Recommended image1
Barabar Premistha Review: `బరాబర్‌ ప్రేమిస్తా` మూవీ రివ్యూ, రేటింగ్‌.. యాటిట్యూడ్‌ స్టార్‌ సినిమా ఎలా ఉందంటే?
Recommended image2
Rukmini Vasanth: రష్మిక మందన్నా మాజీ ప్రియుడి గురించి నిజాలు బయటపెట్టిన రుక్మిణి వసంత్‌, అస్సలు ఊహించరు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved