MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Movie Reviews
  • Barabar Premistha Review: `బరాబర్‌ ప్రేమిస్తా` మూవీ రివ్యూ, రేటింగ్‌.. యాటిట్యూడ్‌ స్టార్‌ సినిమా ఎలా ఉందంటే?

Barabar Premistha Review: `బరాబర్‌ ప్రేమిస్తా` మూవీ రివ్యూ, రేటింగ్‌.. యాటిట్యూడ్‌ స్టార్‌ సినిమా ఎలా ఉందంటే?

వివాదాలతో వార్తల్లో నిలుస్తున్న కుర్ర హీరో చంద్రహాస్‌ ఈ శుక్రవారం `బరాబర్‌ ప్రేమిస్తా` అనే సినిమాతో ఆడియెన్స్ ముందుకు వచ్చాడు. వివాదాలు సృష్టించినంత ఈజీగా హిట్‌ కొట్టాడా? 

4 Min read
Author : Aithagoni Raju
Published : Feb 06 2026, 08:59 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
బరాబర్‌ ప్రేమిస్తా మూవీ రివ్యూ
Image Credit : Asianet News

బరాబర్‌ ప్రేమిస్తా మూవీ రివ్యూ

సీనియర్‌ నటుడు ప్రభాకర్‌ కొడుకు చంద్రహాస్‌ ఇప్పటికే హీరోగా `రామ్‌ నగర్‌ బన్నీ` సినిమా చేశాడు. ఇది పెద్దగా ఆడలేదు. ఇప్పుడు `బరాబర్‌ ప్రేమిస్తా` అనే చిత్రంలో నటించాడు. ఈ మూవీ ఈ శుక్రవారం విడుదలయ్యింది. ఇందులో మేఘనా ముఖర్జీ హీరోయిన్‌గా నటించింది. సంపత్‌ రుద్ర దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని కాకర్ల సత్యనారాయణ సమర్పణలో సిసి క్రియేషన్స్, ఎవిఆర్ మూవీ వండర్స్ బ్యానర్లపై గెడా చందు, గాయత్రి చిన్ని, ఎవిఆర్ ఈ మూవీని నిర్మించారు. ఈ సినిమా నేడు శుక్రవారం(ఫిబ్రవరి 6న) విడుదలయ్యింది. అయితే హీరో చంద్రహాస్‌ తన సినిమాల ముందు వివాదాలు క్రియేట్‌ చేసిన విషయం తెలిసిందే. వల్గర్‌ సాంగ్‌తో వివాదాలకు కేరాఫ్‌గా నిలిచాడు. దీంతో బాగా ట్రోల్స్ కి గురవుతున్నాడు. మరి సినిమాతో అయినా హిట్‌ కొట్టాడా? నిరాశ పరిచాడా? మూవీ ఎలా ఉందనేది రివ్యూలో తెలుసుకుందాం.

26
బరాబర్‌ ప్రేమిస్తా మూవీ కథ
Image Credit : Asianet News

బరాబర్‌ ప్రేమిస్తా మూవీ కథ

ఆదిలాబాద్‌ జిల్లా రుద్రారం గ్రామంలో ధర్మన, కర్మన అనే రెండు వర్గాలుంటాయి. వీరికి తరాలుగా పడదు. కులం, పరువుకి ప్రయారిటీ ఇస్తుంటారు. తరచూ గొడవపడుతుంటారు. ప్రస్తుతం నారాయణ(మురళీధర్‌ గౌడ్‌) ఊరు సర్పంచ్‌గా ఉంటాడు. ఆయన కర్మన వర్గానికి చెందిన సర్పంచ్‌. ఆయన కూతురు బుజ్జమ్మ, ధర్మన వర్గానికి చెందిన చందు(చంద్రహాస్‌) ప్రారంభంలో గొడవపడుతుంటారు. ఆ తర్వాత ఇద్దరు ప్రేమలో పడతారు. రెండు వర్గాలకు చెందిన వారు కావడంతో తమ ప్రేమ విషయం పెద్దలకు తెలిస్తే చంపేస్తారని భావించి ఇద్దరు కలిసి సైలెంట్‌గా లేచిపోతారు. కేరళాకి వెళ్ళి పెళ్లి చేసుకోవాలనుకుంటారు. కట్‌ చేస్తే అక్కడ బుజ్జమ్మకి చందు హ్యాండిస్తాడు. దీంతో ఆ గొడవతోనే మళ్లీ ఊర్లోకి వస్తారు. వీరిద్దరు లేచిపోవడంతో ఊర్లో పెద్ద గొడవలు జరుగుతాయి. పోలీసులు 144 సెక్షన్‌ విధిస్తారు. అయితే తానే కర్మనోళ్ల అమ్మాయిని లేపుకుపోయానని చందు, తానే ధర్మనోళ్ల అబ్బాయిని లేపుకుపోయానని బుజ్జమ్మ గొప్పలు చెప్పుకుంటారు. ఆ తర్వాత కూడా ఊర్లో గొడవలు ఆగవు. ఇంతలో షాకిచ్చే విషయం చెబుతాడు పంచాయితీ సెక్రెటరీ(అభయ్‌ నవీన్‌). పైన గౌరెల్లి ప్రాజెక్ట్ ఎత్తు పెంచుతున్నారని, దీంతో ముంపు గ్రామం కింద ఊరుని ఖాళీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని ప్రకటిస్తాడు. అప్పటి వరకు గొడవ పడే ఈ ఊరులోని రెండు వర్గాల్లో వచ్చిన మార్పేంటి? ప్రేమించుకుని కేరళా పారిపోయిన జంట ఎందుకు గొడవ పడింది? ఊర్లో మార్పు కోసం ఈ జంట ఏం చేశారు? కులంపై వీరు చేసిన పోరాటమేంటి? అనేది మిగిలిన కథ.

Related Articles

Related image1
Sri Chidambaram Garu Review: `శ్రీ చిదంబరం గారు` మూవీ రివ్యూ.. మెల్ల కన్ను వెనుక ఇంత కథ ఉందా?
Related image2
Euphoria Movie Review: యుఫోరియా మూవీ రివ్యూ.. భూమిక, గుణశేఖర్‌ మూవీని వీళ్లు తప్పక చూడాలి
36
బరాబర్‌ ప్రేమిస్తా మూవీ ఎలా ఉందంటే?
Image Credit : Asianet News

బరాబర్‌ ప్రేమిస్తా మూవీ ఎలా ఉందంటే?

కులం వివక్ష, పరువు హత్యల నేపథ్యంలో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి. ఆ మధ్య `రాజు వెడ్స్ రాంబాయి` కూడా అలాంటి కథతో వచ్చింది. మెప్పించింది. ఇప్పుడు `బరాబర్‌ ప్రేమిస్తా` కూడా అలాంటి కథతో రూపొందిన చిత్రమే. అయితే ఇందులో ధర్మన, కర్మన అనే రెండు వర్గాలను తీసుకుని కుల హత్యలు, పరువు హత్యల అంశాన్ని చర్చించారు. ఊర్లో కొన్ని ఏళ్లుగా కులం కోసం జరిగిన గొడవలను చూపిస్తూ దాని తీవ్రత ఎలా ఉందనేది ఎస్టాబ్లిష్‌ చేశారు. కాలాలు మారినా కులం, వర్గం అనే తేడాలు పోలేదు కదా, ఇంకా పెరిగిపోతున్నాయనే విషయాన్ని ప్రారంభంలోనే చూపించిన తీరు బాగుంది. ఇక ప్రస్తుతం.. కర్మనోళ్ల అమ్మాయి బుజ్జమ్మ, ధర్మనోళ్ల అబ్బాయి చందు మధ్య ప్రారంభంలో గొడవలు అవుతుంటాయి. ఆమె ఫ్రెండ్స్, అతని ఫ్రెండ్స్ నువ్వా నేనా అనేలా వ్యవహరిస్తుంటారు. ఈ క్రమంలో చందుని ఇష్టపడుతుంది బుజ్జమ్మ. మొదట్లో ఇద్దరూ తటపటాయించినా, ప్రేమలో పడతారు. రొమాన్స్ లో మునిగిపోతారు. ఆయా సీన్లు ఆకట్టుకునేలా ఉన్నాయి. అయితే ఉన్నట్టుండి కేరళాకి పారిపోవడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఎలాంటి హింట్‌ లేకుండా వెళ్లిపోవడం ఆ ఊర్లో వారికే కాదు, ఆడియెన్స్ కి కూడా షాకిస్తుంది. దీనికితోడు ఇంటర్వెల్‌ ట్విస్ట్ కూడా మరో షాక్‌కి గురి చేస్తుంది. కాస్త సీరియస్‌గా, ఇంకాస్త ఫన్నీగా, అదే సమయంలో రొమాంటిక్‌గా సాగుతుంది. సెకండాఫ్‌లో ఇద్దరు మళ్లీ కేరళా నుంచి వచ్చి నేను ఆమెని లేపుకుపోయానని హీరో, నేనే లేపుకుపోయానని హీరోయిన్‌ తమ వాళ్ల ముందు గొప్పలు చెప్పుకోవడం క్రేజీగా, ఫన్నీగా ఉంది. అనంతరం ఊరిని కలిపే ప్రయత్నం చేయడం, ఈ క్రమంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకోవడం ఆకట్టుకుంటుంది. ఉత్కంఠకి గురి చేస్తుంది. క్లైమాక్స్ లో కథ సుఖాంతం అవుతుందనుకునే లోపు మళ్లీ పరువు అనే కాన్సెప్ట్ తీసుకొచ్చి ఎమోషనల్‌గా మార్చారు. అనంతరం కులానికి సంబంధించిన ఇచ్చిన సందేశం, కనువిప్పు కలిగించేలా మాట్లాడటం బాగుంది. అదే సమయంలో కొంత రెగ్యూలర్‌గా ఉంటుంది.

46
బరాబర్‌ ప్రేమిస్తా మూవీలో ప్లస్‌ లు, మైనస్‌లు
Image Credit : Asianet News

బరాబర్‌ ప్రేమిస్తా మూవీలో ప్లస్‌ లు, మైనస్‌లు

సినిమాలో ఫన్‌ ఎలిమెంట్లు బాగున్నాయి. సరదాగా, రొమాంటిక్‌గా కథని నడిపించిన తీరు బాగుంది. లవ్‌ ట్రాక్‌ కూడా ఆకట్టుకునేలా ఉంది. ట్విస్ట్ బాగుంది. సెకండాఫ్‌లో రెండు వర్గాలు కొట్టుకోవడం, పోలీసులు ఇబ్బంది పడటం ఆద్యంతం కామెడీగా సాగుతుంది. అదే సమయంలో ఎండింగ్‌ లో ఎమోషనల్‌ సీన్లు బాగున్నాయి. కులం, పరువు హత్యలపై సందేశం బాగుంది. సినిమా కామెడీగా, సరదాగా సాగుతూ, కాస్త గుండెని బరువెక్కిస్తుంది. అయితే కామెడీ సీన్లు చాలా చోట్ల ఆశించిన స్థాయిలో వర్కౌట్‌ కాలేదు. హీరోహీరోయిన్ల లవ్‌ ట్రాక్‌ ట్విస్ట్ మరింత బాగా చూపించాల్సింది. చిన్న చిన్న కారణాలకే గొడవలు పడటం అంతగా నప్పలేదు. దీనికితోడు పరువు హత్యలకు సంబంధించిన సీరియస్‌ నెస్‌ తగ్గింది. ఆ తీవ్రత లైటర్‌వేలోనే చూపించారు. దీంతో సీన్లు పండలేదు. క్లైమాక్స్ లో లక్ష్మణ్‌ ఇచ్చి ట్విస్ట్ బాగానే ఉన్నా, దాన్ని మరీ లాగినట్టుగా ఉంటుంది. చాలా సీన్లు రెగ్యూలర్‌గానే అనిపిస్తుంటాయి. ఇలాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకుని, మరింత పక్కడ్బందీగా స్క్రీన్‌ప్లేని రాసుకుంటే సినిమా ఫలితం అదిరిపోయేది.

56
బరాబర్‌ ప్రేమిస్తా మూవీలో నటీనటులు ఎలా చేశారంటే?
Image Credit : Asianet News

బరాబర్‌ ప్రేమిస్తా మూవీలో నటీనటులు ఎలా చేశారంటే?

చందుగా చంద్రహాస్‌ అదరగొట్టాడు. నటన పరంగా గత చిత్రాలతో పోల్చితే బెటర్‌గా ఉంది. యాక్టింగ్‌ పరంగా నిలకడ లేని విధంగా కనిపిస్తున్నాడు. దానిపై వర్కౌట్‌ చేయాలి. హీరోయిన్‌ మేఘనా కూడా బాగా చేసింది. విలేజ్‌ అమ్మాయిగా బాగా ఆకట్టుకుంది. అందంతోనూ మెస్మరైజ్‌ చేసింది. వీరి లవ్‌ ట్రాక్‌ కొత్తగా ఉంది. ఇక సర్పంచ్‌గా మురళీధర్‌ గౌడ్‌ తనకు సూట్‌ అయ్యే పాత్రలో ఒదిగిపోయాడు, మెప్పించాడు. విలేజ్‌ సెక్రటరీగా అభయ్‌ నవీన్‌ మెప్పించాడు. హీరోహీరోయిన్ల ఫ్రెండ్స్ నవ్వించారు. లక్ష్మణ్‌ మీసాల అదరగొట్టాడు. ట్విస్ట్ బాగుంది. మధునందన్‌ కాసేపు కనిపించి ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. రాజశేఖర్‌ అనింగి పాత్ర ఆకట్టుకుంటుంది. మిగిలిన పాత్రధారులు ఓకే అనిపించారు.

66
బరాబర్‌ ప్రేమిస్తా టెక్నీషియన్ల పనితీరు
Image Credit : Asianet News

బరాబర్‌ ప్రేమిస్తా టెక్నీషియన్ల పనితీరు

ఆర్‌ఆర్‌ ధృవన్‌ సంగీతం ఫర్వాలేదు. ఆర్‌ఆర్‌ ఆకట్టుకునేలా ఉంది. సినిమాకి కొంత వరకు హెల్ప్ అయ్యింది. వైఆర్‌ శేఖర్‌ విజువల్స్ కనువిందుగా ఉన్నాయి. రియలిటీని ప్రతిబింబించేలా ఉన్నాయి. బొంతల నాగేశ్వర రెడ్డి ఎడిటింగ్‌ పరంగానూ మరింత శ్రద్ధ తీసుకోవాల్సింది. సంపత్‌ రుద్ర, ఎంఏ తిరుపతి స్క్రీన్‌ ప్లే చాలా వరకు బాగానే ఉన్నాయి. ఇంకా ఎంగేజ్‌ చేసేలా ఫన్‌, లవ్‌ ట్రాక్‌పై వర్క్ చేయాల్సింది. సంపత్‌ రుద్ర దర్శకుడిగా ఆకట్టుకున్నాడు. బాగా తెరకెక్కించాడు. డ్రామాని బాగా వర్కౌట్‌ చేశాడు. కామెడీ విషయంలో ఇంకా బాగా చేయాల్సింది. కానీ ఓవరాల్‌గా కుల హత్యలపై సందేశాన్ని చాలా బాగా చూపించారు. సరదాగా నడిపిస్తూనే దాన్ని తీవ్రతని తెలిపిన తీరు మాత్రం బాగుందని చెప్పొచ్చు. నిర్మాణ విలువలకు కొదవలేదు. నిర్మాతలు రాజీపడకుండా నిర్మించారు. ఆ విషయం ప్రతి ఫ్రేములోనూ కనిపిస్తుంది.

ఫైనల్‌ : 

కుల హత్యలపై సరదా సెటైర్‌ `బరాబర్‌ ప్రేమిస్తా`.

రేటింగ్‌: 2.5

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
సినిమా సమీక్షలు
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Sri Chidambaram Garu Review: `శ్రీ చిదంబరం గారు` మూవీ రివ్యూ.. మెల్ల కన్ను వెనుక ఇంత కథ ఉందా?
Recommended image2
Euphoria Movie Review: యుఫోరియా మూవీ రివ్యూ.. భూమిక, గుణశేఖర్‌ మూవీని వీళ్లు తప్పక చూడాలి
Recommended image3
Adavi Ramudu Review : 50 ఏళ్ల క్రితం.. 300 రోజులు ఆడి, 3 కోట్లకు పైగా వసూలు చేసిన ఎన్టీఆర్ సినిమా..
Related Stories
Recommended image1
Sri Chidambaram Garu Review: `శ్రీ చిదంబరం గారు` మూవీ రివ్యూ.. మెల్ల కన్ను వెనుక ఇంత కథ ఉందా?
Recommended image2
Euphoria Movie Review: యుఫోరియా మూవీ రివ్యూ.. భూమిక, గుణశేఖర్‌ మూవీని వీళ్లు తప్పక చూడాలి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved