- Home
- Entertainment
- Star Maa Top 5 Serials: కార్తీకదీపం దుమ్మురేపుతోంది, ఇల్లు ఇల్లాలుకి అదిరిపోయే రెస్పాన్స్, స్టార్ మా సీరియల్ రేటింగ్స్ ఇవే
Star Maa Top 5 Serials: కార్తీకదీపం దుమ్మురేపుతోంది, ఇల్లు ఇల్లాలుకి అదిరిపోయే రెస్పాన్స్, స్టార్ మా సీరియల్ రేటింగ్స్ ఇవే
సీరియల్స్ అంటే చాలు ప్రపంచాన్నే మర్చిపోతుంటారు ఫ్యామిలీ ఆడియన్స్. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో లేడీ ఫ్యాన్స్ కొన్ని సీరియల్స్ ను కొన్ని సంవత్సరాలుగా ఆదరించిన సందర్భాలు ఉన్నాయి. అటువంటి వాటిలో స్టార్ మా నుంచి టాప్ లో ఉన్న సీరియల్స్ ఏంటో తెలుసా?

స్టార్ మా టాప్ 5 సీరియల్స్
తెలుగు రాష్ట్రాలలో సీరియల్స్ కి ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. ఎప్పటికప్పుడు సీరియల్స్ కు డిమాండ్ పెరుగుతూనే ఉంది. సీరియల్స్ రేటింగ్స్ కూడా వారం వారం పెరుగుతూ వస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఫ్యామిలీ ఆడియన్స్ చూసే టీవీ సీరియల్స్ లో టాప్ ప్లేస్ లో స్టార్ మా సీరియల్స్ ఉంటున్నాయి. ఈక్రమంలో సీరియల్స్ కు సంబంధించిన ప్రతి వారం టీఆర్‌పీ రేటింగ్ వస్తుంటుంది. మరి ఈసారి వచ్చిన రేటింగ్ లో టాప్ 5 లో ఉన్న స్టార్ మా సీరియల్స్ ఏంటీ? ప్రధానంగా స్టార్ మాలో కార్తీక దీపం2 సీరియల్ దుమ్మురేపుతోంది. ఆతరువాత స్థానంలో ఇల్లు ఇల్లాలు పిల్లలు, , ఇంటింటి రామాయణం, చిన్ని,గుడి గంటలు, నువ్వుంటే నా జతగా, బ్రహ్మముడి వంటి సీరియల్స్ టాప్ రేటింగ్స్ తో దూసుకుపోతునర్నాయి. మరి ఏ సీరియల్ కు ఎంత రేటింగ్ వచ్చిందంటే?
KNOW
దుమ్మురేపుతోన్న కార్తీకదీపం 2
స్టార్ మా సీరియల్స్ లో భారీగా డిమాండ్ ఉన్న సీరియల్ కార్తీకదీపం2. ప్రతీ వారం ఈసీరియల్ సత్తా చాలుతూనే ఉంది. ఎప్పటికప్పుడు ఫస్ట్ ప్లేస్ లో కొనసాగడమే కాదు, రేటింగ్ ను కూడా పెంచుకుంటూ వెళ్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలలో కార్తీక దీప సీరియల్ కు భారీగా ఫ్యాన్స్ ఉన్నారు. ఎప్పటిలాగానే ఈ వారం కూడా తొలిస్థానం సాధించిన కార్తీకదీపం 2 సీరియల్ రేటింగ్ లో మరింత మెరుగైంది. తాజా ఆ సీరియల్ అర్భన్, రూరల్ కలుపుకుని 14.70 రేటింగ్స్ తో షాక్ ఇచ్చింది.గతవారం కూడా టాప్ 1 సీరియల్ గా `కార్తీక దీపం 2` నిలిచింది. ఇది చాలా కాలంగా టాప్‌లో ఉన్న విషయం తెలిసిందే. ఈసీరియల్ హీరో నిరుపమ్ కు భారీగా ఫ్యాన్స్ ఉన్నారు. డాక్టర్ బాబుగా తెలుగు ఫ్యామిలీ ఆడియన్స్ లో గుర్తుండిపోయాడు నిరుపమ్. అటు వంటలక్కగా ప్రేమీ విశ్వనాథ్ కు కూడా భారీగా మహిళా అభిమానులు ఉన్నారు. దాంతో కార్తీక దీపం సీరియల్ కు వ్యూవర్ షిప్ ఎక్కువగా ఉంటోంది.
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ కు మళ్లీ రెండో స్థానం
ఇక రెండో స్థానాన్ని మళ్లీ మరోసారి దక్కించుకుంది ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్. గతంలో కోల్పోయిన స్థానాన్ని తిరిగి ఈసీరియల్ సంపాదించుకుంది. ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ తి తాజాగా ఆ సీరియల్ కు రూరల్, అర్భన్ కలిపి 13.43 రేటింగ్ రావడం విశేషం. బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్,వెండితెర మాజీ స్టార్ హీరోయిన్ ఆమని లీడ్ రోల్స్ లో నటిస్తున్న ఈ సీరియల్స్ కు తెలుగు రాష్ట్రాల్లో భారీగా డిమాండ్ ఉంది.
రేటింగ్స్ లో ఒక మెట్టు ఎక్కిన గుండె నిండా గుడిగంటలు
ఈమధ్య కాలంలో ఎక్కువగా పాపులర్ అయిన సీరియల్స్ లో గుండె నిండా గుడి గంటలు ఒకటి. గతంలో నాలుగో ప్లేస్ లో ఉన్న సీరియల్ ఎప్పటికప్పుడు తన రేటింగ్ ను పెంచుకుంటూ వస్తోంది. గతంలో నాలుగో స్థానంలో ఉన్న ఈసీరియల్ తాజాగా మూడో స్థానానికి వచ్చి చేరింది. ఈ సీరియల్ కు ఈ వారం తాజాగా అర్భన్, రూరల్ కలుపుకుని 12.86 రేటింగ్ వచ్చింది. అత్తా కోడళ్ల ఫ్యామిలీ డ్రామాకథకు తెలుగు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. అందుకే గుండెనిండా గుడిగంటలు సీరియల్ కు రేటింగ్ పెరుగుతూ వస్తోంది.
నాలుగో స్థానానికి పడిపోయిన ఇంటింటి రామాయణం
ఇక గతంలో మూడో స్థానంలో ఉన్న ఇంటింటి రామాయణం సీరియల్ నాలుగో స్థానానికి పడిపోయింది. ఇంటింటి రామాయణం సీరియల్ కి ఈ వారం 11.85 రేటింగ్ మాత్రమే వచ్చింది. ముఖ్యంగా అర్భన్ ఏరియాలో ఈసీరియల్ కు 9.44 రేటింగ్ వచ్చింది. రూరల్ లో ఇంటింటి రామాయణం సీరియల్ కు ఆదరణ పెద్దగా లేదు అనే చెప్పాలి.
కదలకుండా 5 స్టానంలోనే చిన్ని సీరియల్
ఇక చిన్ని సీరియల్ మరోసారి తన ఐదో స్థానాన్ని పొందింది. తన స్థానంలో కదలకుండా ఉన్న చిన్నీ సీరియల్ రేటింగ్ లో మాత్రం ఓ మెట్టు ఎక్కింది. గత వారం 8.70 రేటింగ్ మాత్రమే నమోదు అవ్వగా.. ఈవారం ఆ సీరియల్ కు 9.48 రేటింగ్ నమోదైంది. దాంతో రేటింగ్ లో మెరుగుపరుచుకుంటూ వస్తోంది. ముందు ముందు రెండు,మూడు స్థానాలకు వెళ్లే అవకాశం కూడా ఉంది.
ఇక స్టార్ మా టాప్ సీరియల్స్ లో 6 వ స్థానంలో నువ్వుంటే నాజతగా వచ్చి చేరింది.ఈ సీరియల్ కు 9.41 రేటింగ్ వచ్చింది. ఇక గతంలో మంచి రేటింగ్ తో దూసుకుపోయిన బ్రహ్మముడి సీరియల్ మాత్రం 7.31 రేటింగ్ తో 7వ స్థానానికి పరిమితం అవ్వాల్సి వచ్చింది.