- Home
- Entertainment
- Ram Pothineni: రామ్, తమన్నా సినిమా అక్కడ ఫ్లాప్ కానీ ఇక్కడ బ్లాక్ బస్టర్.. మగధీర లాగా మేం చేయలేకపోయాం
Ram Pothineni: రామ్, తమన్నా సినిమా అక్కడ ఫ్లాప్ కానీ ఇక్కడ బ్లాక్ బస్టర్.. మగధీర లాగా మేం చేయలేకపోయాం
హీరో రామ్ పోతినేని సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతున్నాయి. దీని గురించి స్రవంతి రవికిశోర్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే ప్రేమంట, ఆంధ్ర కింగ్ తాలూకా లాంటి సినిమాల నిరాశ పరచడంపై స్పందించారు.

రామ్ పోతినేని సినిమాలు
టాలీవుడ్ యువ రామ్ పోతినేనికి వరుస ఫ్లాపులు తప్పడం లేదు. ఇటీవల రామ్ నటించిన ఆంధ్ర కింగ్ తాలూకా చిత్రం బావుంది అంటూ ప్రశంసలు దక్కాయి. కానీ థియేటర్స్ కి మాత్రం జనాలు వెళ్ళలేదు. ఒక సూపర్ స్టార్ కి అతని అభిమానికి మధ్య జరిగే సంఘటనలని దర్శకుడు మహేష్ ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. అయినప్పటికీ ఆ చిత్రం కమర్షియల్ గా సక్సెస్ కాలేదు. రామ్ సినిమాలపై అతడి బాబాయ్, ప్రముఖ నిర్మాత స్రవంతి రవి కిషోర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
మగధీరలా మేం చేయలేకపోయాం
ఓ ఇంటర్వ్యూలో యాంకర్ ఎందుకంటే ప్రేమంట సినిమా గురించి అడుగగా స్రవంతి రవికిశోర్ మాట్లాడారు. ఈ మూవీలో రామ్ పోతినేని, తమన్నా జంటగా నటించారు. వాళ్ళిద్దరిదీ జన్మజన్మల బంధం అన్నట్లుగా సినిమాలో చూపించాం. కానీ ఆ పాయింట్ ని బలంగా చెప్పలేకపోయాం. మగధీరలో హీరో హీరోయిన్ల గత జన్మ గురించి రాజమౌళి గారు బలంగా చెప్పారు. మేము అంత బలంగా చెప్పలేకపోయాం. ఇది వారికి ఆఖరి జన్మ.. ఈ జన్మలో అయినా ఆ ఆత్మలు ఒక్కటి కావాలని ప్రేమ తపిస్తోంది అని చెప్పలేకపోయినట్లు స్రవంతి రవికిశోర్ పేర్కొన్నారు.
బుల్లితెరపై బ్లాక్ బస్టర్
ఎందుకంటే ప్రేమంట కథని కోన వెంకట్ అద్భుతంగా రాశారు. కానీ వాళ్ళ గత జన్మ గురించి బలంగా చెప్పలేకపోవడమే ఆ సినిమా ఫెయిల్యూర్ అని తాను భావిస్తున్నట్లు స్రవంతి రవికిశోర్ తెలిపారు. కానీ ఆ సినిమా బుల్లితెరపై మాత్రం బ్లాక్ బస్టర్ అని పేర్కొన్నారు.
టీఆర్పీ రేటింగ్
మాటీవీ వాళ్ళు ఎందుకంటే ప్రేమంట సినిమా పట్ల చాలా హ్యాపీగా ఉన్నారు. ఆ మూవీకి అద్భుతమైన టీఆర్పీ రేటింగ్స్ వచ్చినట్లు తనకు చెబుతుంటారు అని అన్నారు.
ఆంధ్ర కింగ్ తాలూకా
అయితే ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా ఫెయిల్యూర్ కి మాత్రం కారణం చెప్పడం కష్టం అని స్రవంతి రవికిశోర్ అన్నారు. ఎందుకంటే ఆ సినిమా మొత్తం బావుంది. నాకు తెలిసిన వాళ్ళు కూడా ఆ మూవీ గురించి నెగిటివ్ గా చెప్పలేదు. కానీ ఆడియన్స్ ఎక్కడ డిస్ కనెక్ట్ అయ్యారో అర్థం కావడం లేదు అని ఆయన అన్నారు.

