- Home
- Entertainment
- 2026లో ఫస్ట్ స్కామ్ ఇదే, రాజాసాబ్ లో ఆ సీన్స్ మొత్తం లేపేసిన డైరెక్టర్.. దుమ్మెత్తిపోస్తున్న అభిమానులు
2026లో ఫస్ట్ స్కామ్ ఇదే, రాజాసాబ్ లో ఆ సీన్స్ మొత్తం లేపేసిన డైరెక్టర్.. దుమ్మెత్తిపోస్తున్న అభిమానులు
2026లో ఫస్ట్ స్కామ్ ఇదే అంటూ రాజాసాబ్ మూవీపై, దర్శకుడు మారుతిపై నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. అసలేం జరిగింది ? ట్రోలింగ్ ఎందుకు జరుగుతోంది ? అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి.

ప్రభాస్ ది రాజా సాబ్ మూవీపై ట్రోలింగ్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ది రాజాసాబ్ చిత్రం థియేటర్స్ లోకి వచ్చేసింది. గురువారం రాత్రి నుంచే ప్రీమియర్ షోల సందడి మొదలైంది. అయితే ఈ చిత్రానికి క్రిటిక్స్, ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది. కామెడీ అక్కడక్కడా పండింది కానీ పూర్తి స్థాయిలో ఈ చిత్రం మెప్పించలేకపోయింది అని ఆడియన్స్ అంటున్నారు. దర్శకుడు మారుతి ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ ని పెట్టుకుని సరిగ్గా ఉపాయోగించుకోలేదు అనే విమర్శలు వినిపిస్తున్నాయి.
రాజాసాబ్ చిత్రానికి మిక్స్డ్ టాక్
రాజాసాబ్ చిత్రంలో ప్రభాస్ స్క్రీన్ ప్రెజన్స్, కొన్ని కామెడీ సన్నివేశాలు, ఇంటర్వెల్ సీన్స్ తప్ప పెద్దగా పాజిటివ్ సీన్స్ కనిపించలేదు అని విమర్శిస్తున్నారు. మారుతి స్క్రీన్ ప్లే ని సరైన విధంగా మలుచుకోలేదు. హీరోయిన్లు పేరుకు మాత్రమే సినిమాలో కనిపించారు. పాటలు కూడా ఆకట్టుకోలేకపోయాయి. ఇవన్నీ పక్కన పెడితే ప్రభాస్ అభిమానులకు మరో పెద్ద షాక్ ఉంది.
ప్రభాస్ ఓల్డ్ లుక్ తో సినిమాకి హైప్
డైరెక్టర్ మారుతి చేసిన మోసానికి ప్రభాస్ అభిమానులు కంగుతిన్నారు. రాజా సాబ్ మోషన్ పోస్టర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి అభిమానులని బాగా ఆకర్షించిన అంశం ప్రభాస్ ఓల్డ్ గెటప్ లుక్. యంగ్ లుక్ తో పాటు ప్రభాస్ ఓల్డ్ లుక్ ని కూడా టీజర్, ట్రైలర్ లో బాగా హైలైట్ చేశారు. కొన్ని నెలల క్రితం రిలీజ్ చేసిన రాజాసాబ్ మొదటి ట్రైలర్ లో కూడా ఇందిరా మీ బాధ అనే డైలాగ్ తో ప్రభాస్ ఓల్డ్ గెటప్ లో రాజాసాబ్ గా అదరగొట్టారు.
అసలు ఆ సీన్లు ఏమయ్యాయి ?
ప్రభాస్ ఓల్డ్ గెటప్ లో రివర్స్ ఫైట్ సీన్లు అంటూ పెద్ద హంగామా నడిచింది. ఆ సన్నివేశాలు ఈ చిత్రంలో కీలకంగా ఉంటాయి, సినిమాకి అవే హైలైట్ అవుతాయి అని అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. కానీ సినిమా రిలీజ్ అయ్యాక అభిమానులకు మైండ్ బ్లాక్ అయింది. ప్రభాస్ ఓల్డ్ గెటప్ లో ఉన్న ఒక్క సీన్ కూడా మూవీలో కనిపించలేదు. ఇదెక్కడి మోసం అంటూ అభిమానులు లబోదిబోమంటున్నారు. అభిమానులు ఏమాత్రం జీర్ణించుకోలేక డైరెక్టర్ మారుతిని ట్రోల్ చేస్తున్నారు.
Anduke scene eh lepesaru risk ani😭😆#TheRajaSaabhttps://t.co/EZYyncCc8R
— Abhi063 (@Ab0612ish) January 9, 2026
2026లో ఇదే ఫస్ట్ స్కామ్
కొందరు అయితే 2026లో ఇదే మొదటి స్కామ్ అంటూ సెటైర్లు వేస్తున్నారు. ట్రైలర్ ప్రభాస్ ఓల్డ్ గెటప్ చూసి.. ఈ సన్నివేశాలు సినిమాలో వచ్చినప్పుడు శవాలు లేస్తాయి అని హైప్ ఇచ్చుకున్నారు. వాటిపైనే ఇప్పుడు కొందరు సెటైర్లు వేస్తున్నారు. అలా శవాలు లేస్తాయి అనే భయంతోనే ఆ సీన్స్ తొలగించినట్లు ఉన్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి కొందరు మాత్రం ఆ సన్నివేశాలు పార్ట్ 2లో ఉంటాయి అని కామెంట్స్ చేస్తున్నారు.
First scam in 2026
This look 😭😭
pic.twitter.com/hP14kp8uX6— 🤙🏻😎 (@Ntr1166177) January 9, 2026

