MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • Oscars Awards కి నామినేట్ అయిన ఇండియన్ సినిమాలు, అవార్డు సాధించిన మూవీస్ ఎన్నో తెలుసా?

Oscars Awards కి నామినేట్ అయిన ఇండియన్ సినిమాలు, అవార్డు సాధించిన మూవీస్ ఎన్నో తెలుసా?

ప్రపంచ సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే 98వ అకాడమీ అవార్డ్స్ మరోసారి ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానుల్లో చర్చకు దారితీశాయి. అయితే ఈ ఏడాది కూడా ఇండియన్  సినిమాలకు మరోసారి నిరాశ ఎదురైంది. ఆస్కార్ చరిత్రలో ఇండియాన్ సినిమాల పరిస్థితి ఏంటి?

3 Min read
Author : Mahesh Jujjuri
Published : Mar 16 2026, 09:44 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
ఆస్కార్ లో ఇండియాకు అన్యాయం..
Image Credit : Asianet News

ఆస్కార్ లో ఇండియాకు అన్యాయం..

ఆస్కార్ 2026 కోసం భారత్ నుంచి మొత్తం సుమారు 24 చిత్రాలను అధికారికంగా పంపించారు. ముఖ్యంగా బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ విభాగానికి భారతదేశం తరఫున కొన్ని ప్రముఖ చిత్రాలు ఎంపికయ్యాయి. అయినప్పటికీ చివరి నామినేషన్ జాబితాలో మాత్రం ఒక్క భారతీయ సినిమాకు కూడా చోటు దక్కలేదు.హోంబౌండ్, కాంతార: చాప్టర్ 1, తన్వి ది గ్రేట్, మహావతార్ నరసింహ, టూరిస్ట్ ఫ్యామిలీ, పుష్ప 2, ది బెంగాల్ ఫైల్స్ లాంటి భారతీయ చిత్రాలు ఉన్నప్పటికీ తుది నామినేషన్ జాబితాలో ఒక్కటి కూడా చోటు దక్కించుకోలేదు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28
ఆస్కార్ కోసం ఇండియా పోరాటం..
Image Credit : x/telugu scribe

ఆస్కార్ కోసం ఇండియా పోరాటం..

ఆస్కార్ అవార్డుల్లోఇండియన్ సినిమాలు.. అలా మెరిసి ఇలా మాయమవుతుంటాయి.. అప్పుడప్పుడు కనిపించడం తప్పించి.. పెద్దగా అవార్డులు సాధించింది లేదు. మన సినిమాలు అంతర్జాతీయంగా సత్తా చాటుతున్నా.. అవార్డులు మాత్రం వరించడంలేదు. గత 80 ఏళ్ల చరిత్రలో ఇండియన్ సినిమాకు ఆస్కార్ ల విషయంలో అన్యయం జరిగిందనే చెప్పాలి. 1958 నుంచి ఆస్కార్ అవార్డుల వేడుకల్లో ఎన్ని సినిమాలు నామినేట్ అయ్యాయి.. ఎన్ని చిత్రాలు అవార్డులు సంపాదించాయనే వివరాల్లోకి వెళితే..

38
నామినేట్ అయిన తొలి సినిమా..
Image Credit : YB

నామినేట్ అయిన తొలి సినిమా..

1958లో మదర్ ఇండియా సినిమాకు తొలిసారి ఆస్కార్ అవార్డుల్లో తొలి నామినేషన్‌ను సంపాదించింది. మెహబూబ్ ఖాన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో సునీల్ దత్, రాజేంద్ర కుమార్, రాజ్ కుమార్‌తోపాటు నర్గీస్ దత్ నటించారు. అయితే నామినేషన్‌కు మాత్రమే మదర్ ఇండియా పరిమితమైంది. ఆ తర్వాత 1961లో ది క్రియేషన్ ఆఫ్ ఉమెన్ అనే షార్ట్ డాక్యుమెంటరీకి ఇస్మాయిల్ మర్చంట్ సినిమా నామినేట్ అయ్యారు కానీ.. అవార్డు సంపాదించలేకపోయాయి..

48
ఆస్కార్ సాధించిన తొలి సినిమా..
Image Credit : Asianet News

ఆస్కార్ సాధించిన తొలి సినిమా..

1969లో ది హౌస్ దట్ ఆనంద బ్యూల్ట్ అనే షార్ట్ డాక్యుమెంటరీకి ఫాలీ బిలిమోరియా నామినేట్ అయ్యారు. 1978లో కూడా బెస్ట్ యానిమేషన్ క్యాటగిరిలో బీడ్ గేమ్ అనే సినిమాకు ఇషు పటేల్‌ నామినేట్ అయ్యారు. కానీ ఇద్దరికీ ఆస్కార్ దక్కలేదు. అనంతరం యాన్ ఎన్‌కౌంటర్ విత్ ఫేసెస్ అనే షార్ట్ డాక్యుమెంటరీకి కేకే కపిల్ నామినేట్ అయ్యారు. 

అప్పుడు అవార్డుల్లో నిరాశే ఎదురైంది. ఇక 1983లో తొలిసారి ఇండియాకు ఆస్కార్ లభించింది. వరల్డ్ వైడ్ గా ప్రేక్షకులను ఓ సినిమా ఆకట్టుకుంది. ఆసినిమా మరేదో కాదు గాంధీ. ఈ చిత్రానికి రిచర్డ్ అటెన్ బరో నిర్మించి దర్శకత్వం వహించారు. ఈ మూవీ కోసం బెస్ట్ క్యాస్టూమ్ డిజైన్ క్యాటగిరిలో భాను అతయా తొలిసారి ఆస్కార్ సాధించింది.

58
ఆస్కార్ రేసులో పెద్ద సినిమాలు..
Image Credit : Asianet News

ఆస్కార్ రేసులో పెద్ద సినిమాలు..

మొదటి నుంచి ఆస్కార్ రేసులో పెద్ద పెద్ద సినిమాలు పోటీ పడ్డాయి. మంచి మంచి సినిమాలకు నిరాశ ఎదురయ్యింది. 1987లో ఏ రూమ్ విత్ ఏ వ్యూ, 1989 లో సలాం బాంబే సినిమాలు ఆస్కార్ కు నామినేట్ అయ్యాయి. బెస్ట్ మూవీ క్యాటగిరిలో ఇస్మాయిల్ మర్చంట్, ఉత్తమ విదేశీ భాష క్యాటగిరిలో సలామ్ బాంబే నామినేట్ అయ్యాయి. సలాం బాంబే సినిమాకు మీరా నాయర్ దర్శకత్వం వహించగా.. ఈ రెండు సినిమాలకు నిరాశ ఎదురయ్యింది. 1993లో మరోసారి ఇస్మాయిల్ మర్చంట్ రూపొందించిన హోవార్డ్స్ ఎండ్, ది రిమైన్స్ ఆఫ్ ది డే చిత్రాలు బెస్ట్ మూవీ క్యాటగిరిలో నామినేట్ అయ్యాయి. కానీ వేటికి అవార్డు దక్కలేదు.

68
లగాన్ కు వస్తుందని నమ్మకంతో ఉన్నారు..
Image Credit : instagram

లగాన్ కు వస్తుందని నమ్మకంతో ఉన్నారు..

2002, 2005 లో ఇండియాకు పక్కాగా ఆస్కార్ వస్తుందని ఎంతో ఆశపడ్డారు మేకర్స్. అశుతోష్ గోవారికర్ దర్శకత్వంలో ..అమీర్ ఖాన్ హీరోగా నటించిన లగాన్ సినిమా ఉత్తమ విదేశీ భాష క్యాటగిరిలో నామినేట్ అయింది. దాదాపు అవార్డు ఖాయమనే అంతా అనుకున్నారు. కానీ చివరకు నిరాశ తప్పలేదు. ఇక 2005 లో మరోసారి లిటిల్ టెర్రిరిస్ట్ సినిమాకుగాను అశ్వీన్ కుమార్ నామినేట్ అయ్యారు.. అప్పుడు కూడా ఊరించి దూరం అయ్యింది ఆస్కార్.

78
ఆస్కార్ సాధించిన ఇండియన్ సినిమాలు..
Image Credit : instragram

ఆస్కార్ సాధించిన ఇండియన్ సినిమాలు..

ఇక 2009లో ఇండియన్ సినిమాకు ఆస్కార్ పంట పడింది. స్లమ్ డాగ్ మిలియనీర్ సినిమాకు ఏఆర్ రెహమాన్ రెండు ఆస్కార్ లు అందుకున్నారు. ఈ సినిమాకుగాను బెస్ట్ సౌండ్ డిజైన్ క్యాటగిరిలో రసూల్ పోకుట్టి, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ క్యాటగిరిలో రచయిత గుల్జార్, బెస్ట్ ఒరిజినల్ స్కోర్, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ క్యాటగిరిలో ఏఆర్ రెహ్మాన్ నామినేట్ అవ్వడమే కాకుండా అవార్డులు కూడా అందుకున్నారు. 

మరోసారి 2011 లో 127 హావర్స్ అనే సినిమాకు ఏఆర్ రెహ్మాన్ నామినేట్ అయ్యారు కానీ అవార్డు దక్కలేదు. ఆతరువాత మరోసారి 2019లో పిరియడ్. ఎండ్ ఆఫ్ ది సెంటెన్స్ అనే సినిమా బెస్ట్ డాక్యుమెంటరీ క్యాటగిరిలో గునీత్ మోంగా నామినేట్ అయి అవార్డును దక్కించుకొన్నారు.

88
తెలుగు సినిమాకు దొరికిన మొదటి గౌరవం..
Image Credit : instagram

తెలుగు సినిమాకు దొరికిన మొదటి గౌరవం..

మొదటి సారి తెలుగు సినిమాకు రాజమౌళి ఆస్కార్ ను సాధించి పెట్టాడు. 2023 లో RRR సినిమాకు గాను రెండు అవార్డులు వరించాయి. RRR సినిమా కోసం బెస్ట్ ఒరిజినల్ సాంగ్ క్యాటగిరిలో మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి, రచయిత చంద్రబోస్ నామినేట్ అయ్యి.. అవార్డు సాధించారు. 

ఇక ఆర్ఆర్ఆర్ తో పాటు .. ది ఎలిఫాంట్ విష్పరర్ సినిమా బెస్ట్ షార్ట్ ఫిలిం డాక్యుమెంటరీ క్యాటగిరిలో కార్తికి గోనసాల్వెస్, గునీత్ మోంగా ఆస్కార్ ను అందుకున్నారు. ఆ ఏడాది నామినేట్ అయిన నలుగురు కూడా ఆస్కార్ అవార్డులు సాధించడంతో భారత్ మరోసారి చరిత్ర సృష్టించింది. ఇక తాజాగా ఆస్కార్ అవార్డులలో అద్బుతమైన ఇండియన్ సినిమాలు ఉన్నా కానీ.. ఆస్కార్ స్థాయికి చేరలేకపోయాయి.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
బాలీవుడ్
హాలీవుడ్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
వర్షిణి కోసం దేబ్జానీకి అన్యాయం చేసిన ముఖేష్, చేపల మార్కెట్ లా తయారైన బిగ్ బాస్ హౌస్..
Recommended image2
Ambika Vs Radha: రాధ కంప్లైంట్‌పై అంబిక కౌంటర్.. మోసపోయింది నేనే అంటూ చెల్లికి అక్క ట్విస్ట్
Recommended image3
Michael Jackson: రజనీకాంత్ కోసం మైఖేల్ జాక్సన్ పాడాల్సింది.. 16 ఏళ్ల తర్వాత తమన్ చెప్పిన సీక్రెట్!
Related Stories
Recommended image1
Oscar Awards 2026 : 98వ ఆస్కార్ అవార్డు విజేతలు వీరే.. ఎవరెవరిని వరించిందంటే?
Recommended image2
రామ్ చరణ్.. అల్లు అర్జున్ కు పోటీ ఇవ్వబోతున్నాడా? కొత్త బిజినెస్ స్టార్ట్ చేయబోతున్న మెగా పవర్ స్టార్.. ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved