- Home
- Entertainment
- Jr NTR: ఆ రోజు ధైర్యం చెప్పడానికి కుటుంబ సభ్యులెవరూ రాలేదు, చాలా బాధ పడ్డా.. జూ.ఎన్టీఆర్ తీవ్ర భావోద్వేగం
Jr NTR: ఆ రోజు ధైర్యం చెప్పడానికి కుటుంబ సభ్యులెవరూ రాలేదు, చాలా బాధ పడ్డా.. జూ.ఎన్టీఆర్ తీవ్ర భావోద్వేగం
డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జూ. ఎన్టీఆర్ తీవ్ర భావోద్వేగంతో ప్రసంగించారు. తన జీవితంలో కీలక దశలో కుటుంబ సభ్యులు తన పక్కన లేరు అని.. రాజమౌళి ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని ఎన్టీఆర్ ఎమోషనల్ అయ్యారు.

డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ప్రీ రిలీజ్ ఈవెంట్
ఎస్.ఎస్. రాజమౌళి సమర్పణలో ఫహాద్ ఫాజిల్ హీరోగా నటించిన ఫాంటసీ ఎంటర్‌టైనర్ ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’. ఆర్కా మీడియా వర్క్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్ల మీద శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, ఎస్ఎస్ కార్తికేయ నిర్మించిన ఈ చిత్రానికి శశాంక్ ఏలేటి దర్శకుడు. అక్టోబర్ 2న మూవీ రిలీజ్ అవుతుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.ఈ వేడుకకు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
తారక్ కి ఫ్యామిలీతో ఉన్న గ్యాప్
ఈ ఈవెంట్లో తారక్ ఎప్పుడూ లేని విధంగా తీవ్ర భావోద్వేగానికి గురవుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తారక్ కామెంట్స్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. తనకి తోడుగా కుటుంబ సభ్యులు లేరు అని అర్థం వచ్చేలా తారక్ కామెంట్స్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్.. నందమూరి ఫ్యామిలీ మధ్య ఉన్న గ్యాప్ గురించి ఈ కామెంట్స్ తో మరోసారి చర్చ మొదలైంది. ఇంతకీ తారక్ ఏం మాట్లాడారో ఇప్పుడు చూద్దాం.
దేశం గర్వించదగ్గ నటుడు ఫహద్
గాయం నుంచి కోలుకున్నా. డ్రాగన్ చెప్పిన సమయానికే విడుదల అవుతుంది. కోవిడ్ అనే టఫ్ సమయంలో ఒక టాలెంట్ నెమ్మదిగా మనలోకి వచ్చింది. అదే ఫాహద్ సార్. మొదటిసారి బెంగళూరులో ఆయన సినిమా చూశా. నాకు అతి తక్కువ మంది యాక్టర్స్ ఇష్టం. అందులో మొదటి వ్యక్తి ఫాహద్ ఫాజిల్. దేశం గర్వించదగ్గ నటుడు ఫాహద్. ఆయన తెలుగులో మొదటిసారి లీడ్ యాక్టర్ గా చేస్తున్న ఫాహద్ గారికి మంచి విజయం దక్కుతుందని నమ్ముతున్నా.
ఆ రోజు చాలా బాధపడ్డా
ఈ స్టేజీపై ప్రస్తావించాల్సిన చాలా మొదటి అంశాలు ఉన్నాయి. 2000 సంవత్సరం నవంబర్ లో నేను నటించిన తొలి సినిమా ఓపెనింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరిగింది. ఆ సినిమా నిన్ను చూడాలని. ఆ మూవీ ఓపెనింగ్ కి అమ్మ రానని చెప్పారు. ఎందుకంటే ఆమె ఎప్పుడూ బయటకి రారు. నాన్న కూడా రానున్నారు. నా కాళ్ళమీద నేనే నిలబడాలి. నా కష్టాలు నేనే పడాలి అనేది నాన్న ఉద్దేశం. ఒక్కడినే భయపడుతూ వెళ్ళాను. ఆ రోజు చాలా బాధపడ్డాను. నా చేయి పట్టుకుని ధైర్యం చెప్పే కుటుంబ సభ్యులెవరూ నా పక్కన లేరే అని బాధ కలిగింది.
దేవుడు నా బాధని విన్నాడు
నా బాధని దేవుడు విన్నాడో ఏమో.. అభిమానుల రూపంలో కుటుంబాన్ని ఇచ్చాడు. అంతటితో నా ఫ్యామిలీ సరిపోదు అనుకున్నాడో ఏమో.. రాజమౌళి ఫ్యామిలీని నా ఫ్యామిలీ చేశాడు. రాజమౌళి ఫ్యామిలీలో కీరవాణి, వల్లి వారు, ఇతర కుటుంబసభ్యులంతా నా కుటుంబ సభ్యులు అయ్యారు. వీరందరితో పాటు కార్తికేయని కూడా నాకు తోడుగా ఇచ్చాడు. స్టూడెంట్ నంబర్ 1 సినిమా సమయంలో నా వయసు 17 ఏళ్ళు.. కార్తికేయ వయసు 8 ఏళ్ళు అని ఎన్టీఆర్ గుర్తు చేసుకున్నారు. తారక్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారి తీశాయి.

