- Home
- Entertainment
- Bigg Boss Telugu 10: కవరింగ్ స్టార్ రోహిత్ అంటూ నామినేట్ చేసిన త్రిగుణ్, షాలినికి ఇచ్చి పడేసిన రామ్ ప్రసాద్
Bigg Boss Telugu 10: కవరింగ్ స్టార్ రోహిత్ అంటూ నామినేట్ చేసిన త్రిగుణ్, షాలినికి ఇచ్చి పడేసిన రామ్ ప్రసాద్
బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 లో భాగంగా గురువారం రోజు నామినేషన్స్ ప్రక్రియ ఉత్కంఠ భరితంగా సాగింది. ఎప్పటిలాగే త్రిగుణ్, రోహిత్ మధ్య హీటెడ్ ఆర్గుమెంట్ సాగింది.

Bigg Boss Telugu 10
బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో 23వ రోజు నామినేషన్స్ ప్రక్రియ జరిగింది. హీటెడ్ ఆర్గుమెంట్స్ తో ఈ ప్రక్రియ సాగింది. కెప్టెన్ గా ఉన్న అపూర్వని గొడవకు కెలకడం ముకేశ్ ఆపడం లేదు. కెప్టెన్ గా ఆమె పెడుతున్న రూల్స్ ని ప్రశ్నిస్తూనే ఉన్నాడు. దీనితో ఇద్దరి మధ్య సిల్లీ గొడవలు జరుగుతూనే ఉన్నాయి. వర్షిణి కెప్టెన్ సింహాసనంలో కూర్చుంది. కెప్టెన్ సింహాసనంలో ఎవరూ కూర్చోకూడదు కదా..ఎందుకు పర్మిషన్ ఇచ్చావు అంటూ ముకేశ్.. అపూర్వని ప్రశ్నించారు. అది నా ఇష్టం అంటూ అపూర్వ సమాధానం ఇచ్చింది.
టీమ్ భైరవకి అడ్వాంటేజ్
ఆ తర్వాత రథం టాస్క్ లో టీం భైరవ విజయం సాధించింది. దీనితో బిగ్ బాస్ నుంచి ఆ టీంకి అడ్వాంటేజ్ లభించింది. ఆ అడ్వాంటేజ్ ఏంటో బిగ్ బాస్ నామినేషన్స్ ముందు ప్రకటించారు. టీమ్ భైరవలో అందరికీ నామినేషన్ చేసే అవకాశం ఉంటుంది. ఓడిపోయిన సప్త శక్తి టీంలో అందరికీ నామినేషన్ చేసే ఛాన్స్ ఉండదు. కేవలం ఇద్దరికి మాత్రమే ఉంటుంది అని బిగ్ బాస్ తెలిపారు. ఆ ఛాన్స్ ని త్రిగున్, నరేష్ తీసుకున్నారు.
కవరింగ్ స్టార్ రోహిత్
ముందుగా త్రిగుణ్.. రోహిత్ ని నామినేట్ చేశారు. రోహిత్ ని కవరింగ్ స్టార్ రోహిత్ అని అభివర్ణించారు. ప్రతి గొడవలు ఒక కొత్త కథ అల్లుకుని రోహిత్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు అంటూ త్రిగుణ్ సెటైర్లు వేశారు. ఆ తర్వాత ఝాన్సీ.. సృష్టిని నామినేట్ చేసింది. ప్రతి గొడవ అమన్ వల్లే అవుతోంది అంటూ నరేశ్ అతడిని నామినేట్ చేశారు. ప్రతి సారీ నోరుజారుతోంది, కోపం పెంచుకుంటోంది అంటూ రామ్ ప్రసాద్ షాలినిని నామినేట్ చేశారు.
ఈ వారం నామినేషన్స్ లో ఉన్న వారు
మొత్తంగా ఈ వారం నామినేషన్స్ లో ముకేశ్, త్రిగున్, దేబ్జానీ, రోహిత్, షాలిని, అమన్, నరేష్, చరణ్, సృష్టి నిలిచారు. మరి ఈ వారం వీరిలో ఎలిమినేట్ అయ్యేది ఎవరో వేచి చూడాలి.

