MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
India Skills Report
KL Rahul Love Story
India Geographic Extent
Rocking Star Yash
Agadha Movie 4 Days Collection
Telangana Food Safety
VAS vs Makutam Box Office
Yashasvi Jaiswal
Korean Kanakaraju Collections
  • Home
  • Entertainment
  • Vijay Rashmika Wedding: గ్రాండ్‌గా విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్నా మ్యారేజ్‌, హాజరైన గెస్ట్ లు వీరే.. సాయంత్రం మరో పెళ్లి

Vijay Rashmika Wedding: గ్రాండ్‌గా విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్నా మ్యారేజ్‌, హాజరైన గెస్ట్ లు వీరే.. సాయంత్రం మరో పెళ్లి

విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్నా ఒక్కటయ్యారు. మూడు ముళ్ల బంధంతో కొత్త జీవితం స్టార్ట్ చేశారు. వీరి మ్యారేజ్‌ ఉదయ్‌ పూర్‌ ప్యాలెస్‌లో చాలా గ్రాండ్‌గా జరిగింది.   

2 Min read
Author : Aithagoni Raju
| Updated : Feb 26 2026, 10:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
గ్రాండ్‌గా విజయ్‌ దేవరకొండ రష్మిక మందన్నా పెళ్లి
Image Credit : GA2 Pictures

గ్రాండ్‌గా విజయ్‌ దేవరకొండ రష్మిక మందన్నా పెళ్లి

విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్నా ఎట్టకేలకు ఒక్కటయ్యారు. వీరి మ్యారేజ్‌ చాలా గ్రాండ్‌గా జరిగింది. మూడు ముళ్ల బంధంతో కొత్త జీవితం స్టార్ట్ చేశారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. అతికొద్ది మంది బంధుమిత్రులు, సెలబ్రిటీల సమక్షంలో విరోషి(విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్నా) ఒక్కటయ్యారు. దాదాపు ఏడేళ్ల ప్రేమ జీవితానికి తెర దించుతూ మ్యారేజ్‌ చేసుకున్నారు. ఇన్నాళ్ల రహస్యాన్ని బహిర్గతం చేశారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
రెండు సాంప్రదాయాల ప్రకారం విజయ్‌, రష్మిక మ్యారేజ్‌
Image Credit : instagram

రెండు సాంప్రదాయాల ప్రకారం విజయ్‌, రష్మిక మ్యారేజ్‌

విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్నా మ్యారేజ్‌ ఉదయ్‌పూర్‌ ప్యాలెస్‌లో చాలా గ్రాండ్‌గా జరిగింది. ఉదయం 9-10 గంటల మధ్యలో రష్మిక మెడలో మూడు ముళ్లు వేశారు విజయ్‌. అయితే వీరి మ్యారేజ్‌ని రెండు సాంప్రదాయల ప్రకారం నిర్వహిస్తున్నారు. ఇప్పుడు హిందూ సాంప్రదాయం ప్రకారం మ్యారేజ్‌ జరగ్గా, సాయంత్రం కొడుగు(కొడవ) సాంప్రదాయం ప్రకారం మరోసారి వివాహం చేసుకోబోతున్నారు. కొడవ అనేది రష్మిక మందన్నా వారి సాంప్రదాయం కావడం విశేషం.

Related Articles

Related image1
Rashmika Mandanna: రష్మిక పాత ప్రియుడి గురించి అడిగితే విజయ్ దేవరకొండ ఏం చేశాడో తెలుసా?
Related image2
Rashmika First Kiss : విజయ్‌ దేవరకొండకి మొదటి కిస్.. ఆ అనుభవాన్ని బయటపెట్టిన రష్మిక మందన్నా
35
ఫోటోలు, వీడియోలు లీక్‌ కాకుండా జగ్రత్త
Image Credit : Asianet News

ఫోటోలు, వీడియోలు లీక్‌ కాకుండా జగ్రత్త

అయితే పూర్తి ప్రైవేట్‌ ఈవెంట్‌గా జరిగిన వీరి మ్యారేజ్‌ వేడుకకి సంబంధించిన ఎలాంటి ఫోటోలు, వీడియోలు బయటకు రాకుండా విజయ్‌, రష్మిక జాగ్రత్త పడ్డారు. అతిథులకు కండీషన్స్ కూడా పెట్టారు. అయినా చిన్న చిన్న వీడియో క్లిప్ లు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. కానీ మ్యారేజ్‌ ఫోటోలను ఈ జంట అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది.

45
విరోషి వెడ్డింగ్‌కి హాజరైన గెస్ట్ లు వీరే
Image Credit : instagram/@celebrityccouple.insta

విరోషి వెడ్డింగ్‌కి హాజరైన గెస్ట్ లు వీరే

 విజయ్‌ దేవరకొండ రష్మిక మందన్నా పెళ్లికి ఎవరెవరు హాజరయ్యారనేది చూస్తే.. సందీప్‌ రెడ్డి వంగా, తరుణ్‌ భాస్కర్‌, ఈషా రెబ్బా, రాహుల్‌ రవీంద్రన్‌ వంటి వారు హాజరైనట్టు తెలుస్తోంది. ఆనంద్‌ దేవరకొండ, విజయ్‌ ఫ్యామిలీ, వారి దగ్గరి బంధువులు ఈ వేడుకలో పాల్గొన్నారట. అలాగే రష్మిక మందన్నా దగ్గరి బంధువులు మాత్రమే వీరి మ్యారేజ్‌కి హాజరయ్యారు. చాలా లిమిటెడ్‌లో ఫ్రెండ్స్ ఉన్నట్టు సమాచారం. అలాగే అతికొద్ది మంది కార్పొరేట్‌ దిగ్గజాలు కూడా పాల్గొంటారని టాక్‌.

55
`గీతగోవిందం`తో ప్రారంభమైన జర్నీ
Image Credit : instagram

`గీతగోవిందం`తో ప్రారంభమైన జర్నీ

విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్నా `గీత గోవిందం` లో తొలిసారి కలిసి నటించారు. ఆ తర్వాత `డియర్‌ కామ్రేడ్‌`లో మరోసారి జోడీ కట్టారు. ఆ సమయంలోనే ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ఏడేళ్ల రిలేషన్‌ అనంతరం గురువారంతో ఒక్కటయ్యారు. కొత్త జీవితాన్ని స్టార్ట్ చేశారు. ఇక వీరి రిసెప్షన్‌ మార్చి 4న హైదరాబాద్‌లోని తాజ్‌ కృష్ణలో జరగబోతుంది.   సినిమా సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు, కార్పొరేట్లు ఈ రిసెప్షన్‌కి హాజరయ్యే అవకాశం ఉంది. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
విజయ్ దేవరకొండ
రష్మిక మందన్న
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
RC17: రామ్‌ చరణ్‌ సరసన 3200కోట్ల హీరోయిన్‌.. సుకుమార్‌ స్కెచ్‌ వేరే లెవల్‌
Recommended image2
Trisha Net Worth: త్రిష ఆస్తుల చిట్టా ఇదే.. చెన్నై, హైదరాబాద్‌, లండన్‌లో లగ్జరీ ప్రాపర్టీ, కోట్ల రెమ్యునరేషన్
Recommended image3
Sudigali Sudheer Remuneration: ప్రదీప్ ను దెబ్బకొట్టిన సుడిగాలి సుధీర్, ఒక్కొ ఎపిసోడ్ కు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడో తెలుసా?
Related Stories
Recommended image1
Rashmika Mandanna: రష్మిక పాత ప్రియుడి గురించి అడిగితే విజయ్ దేవరకొండ ఏం చేశాడో తెలుసా?
Recommended image2
Rashmika First Kiss : విజయ్‌ దేవరకొండకి మొదటి కిస్.. ఆ అనుభవాన్ని బయటపెట్టిన రష్మిక మందన్నా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved