MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Hey Balwanth 6 Days Collections: హే బలవంత్‌ 6 రోజుల కలెక్షన్లు.. సుహాస్‌ మూవీ నిజంగానే సేఫ్‌ అయ్యిందా?

Hey Balwanth 6 Days Collections: హే బలవంత్‌ 6 రోజుల కలెక్షన్లు.. సుహాస్‌ మూవీ నిజంగానే సేఫ్‌ అయ్యిందా?

సుహాస్‌ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ `హే బలవంత్‌` గత వారం విడుదలైన విషయం తెలిసిందే. ఈ మూవీ ఆరు రోజు కలెక్షన్లు అదిరిపోయాయి. మరి నిర్మాతలు సేఫ్‌ అయ్యాయా? 

2 Min read
Author : Aithagoni Raju
Published : Feb 26 2026, 12:16 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
సూపర్‌ హిట్‌గా దూసుకుపోతున్న `హే బలవంత్‌` మూవీ
Image Credit : Asianet News

సూపర్‌ హిట్‌గా దూసుకుపోతున్న `హే బలవంత్‌` మూవీ

యంగ్‌ హీరో సుహాస్‌, శివానీ నగరం జంటగా `హే బలవంత్‌` మూవీలో నటించారు. గోపీ అచ్చర దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని బి నరేంద్ర రెడ్డి నిర్మించారు. ఈ మూవీని ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్‌ వంశీ నందిపాటి విడుదల చేశారు. ఆయన ఈ చిత్ర హక్కులు తీసుకుని రిలీజ్‌ చేశారు. గత శుక్రవారం(ఫిబ్రవరి 20)న ఈ మూవీ ఆడియెన్స్ ముందుకు వచ్చింది. ఫస్ట్ డే నుంచే పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. ప్రస్తుతం మంచి వసూళ్లతో దూసుకుపోతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
హే బలవంత్‌ మూవీ బ్రేక్‌ ఈవెన్‌ అయ్యిందా?
Image Credit : Asianet News

హే బలవంత్‌ మూవీ బ్రేక్‌ ఈవెన్‌ అయ్యిందా?

తాజాగా ఈ మూవీ బ్రేక్‌ ఈవెన్‌ అయ్యిందని సమాచారం. ఇటీవల చిత్ర బృందం సక్సెస్‌ మీట్‌ పెట్టింది. మూవీ బ్రేక్‌ ఈవెన్‌ అయినట్టు చెప్పింది. ఈ మేరకు సక్సెస్‌ని సెలబ్రేట్‌ చేసుకున్నారు. ఇటీవల కాలంలో ఒక మూవీ బ్రేక్‌ ఈవెన్‌ కావడం చాలా కష్టంగా మారిపోతున్న నేపథ్యంలో సుహాస్‌ మూవీ `హే బలవంత్‌` సేఫ్‌లోకి వెళ్లడం విశేషంగా చెప్పొచ్చు. మరి ఈ చిత్రానికి ఎంత కలెక్షన్లు వచ్చాయనేది చూస్తే.

35
హే బలవంత్‌ మూవీ కలెక్షన్లు
Image Credit : Asianet News

హే బలవంత్‌ మూవీ కలెక్షన్లు

ఈ మూవీ ఆరు రోజుల్లో సుమారు రూ.8కోట్లు వసూలు చేసింది. తెలుగు స్టేట్స్, ఓవర్సీస్‌లో కలిసి ఈ మొత్తం వచ్చాయి. ఈ లెక్కన దాదాపు నాలుగు కోట్లకుపైగా షేర్‌ వచ్చింది. అయితే తెలుగు స్టేట్స్ లో కంటే ఓవర్సీస్‌లో ఇది జోరు చూపించినట్టు తెలుస్తోంది. ఈ మూవీని నిర్మాత వంశీ నందిపాటి దాదాపు నాలుగు కోట్లకు తీసుకున్నారు. ఇప్పుడు ఆయనకు బ్రేక్‌ ఈవెన్‌ అయిపోయిందట. తెలుగు స్టేట్స్ లో దీనికి కాస్త తక్కువే వచ్చినా, ఓవర్సీస్‌లో రెండు కోట్లకుపైగా షేర్‌ సాధించినట్టు సమాచారం. దీంతో అది బ్యాలెన్స్ అయ్యిందని, ఓవరాల్‌గా వంశీ సేఫ్‌లోకి వెళ్లారని టాక్‌.

45
సెకండ్‌ వీక్‌లోనూ జోరు
Image Credit : Asianet News

సెకండ్‌ వీక్‌లోనూ జోరు

ఇక ఈ మూవీకి ఇప్పటికీ మంచి వసూళ్లు రాబడుతోంది. రోజుకి ముప్పై, నలభై లక్షల వరకు వస్తున్నట్టు సమాచారం. అయితే రెండో వారంలోనూ ఇదే జోరు చూపిస్తే వంశీ నందిపాటికి మరిన్ని లాభాలు వచ్చే అవకాశం ఉందని టాక్‌. కాకపోతే వీకెండ్‌లో అయితే బాగానే ఆడే అవకాశం ఉంది. వీక్‌ డేస్‌లో ఎలా ఉండబోతుందో చూడాలి. స్టూడెంట్స్ కి ఎగ్జామ్స్ స్టార్ట్ కాబోతున్న నేపథ్యంలో అది కొంత ప్రభావం చూపిస్తుంది. లేదంటే మరిన్ని కలెక్షన్లు వచ్చే అవకాశం ఉండేది.

55
హే బలవంత్‌ కథేంటంటే?
Image Credit : Asianet News

హే బలవంత్‌ కథేంటంటే?

సినిమా కథేంటంటే? ఇందులో హీరో సుహాస్‌ తండ్రి బిజినెస్‌ చూసుకోవాలని కలలు కంటుంటాడు. కానీ తండ్రి బిజినెస్‌ ఏంటో తెలియదు. ఆ భ్రమల్లోనే ఉంటూ ఆయన డల్‌గా ఉన్న వ్యాపారాలను లాభాల్లోకి తెచ్చే ఉపాయాలు ఇస్తుంటాడు. అలా హీరోయిన్‌తో పరిచయం ఏర్పడుతుంది. ఆమెతో లవ్‌లో పడతారు. పేరెంట్స్ కి పరిచయం చేసుకోవాలనుకుంటారు. ఇంతలో సుహాస్‌ తండ్రి బలవంత్‌ రావ్‌కి హార్ట్ ఎటాక్‌ వస్తుంది. దీంతో ఆయన వ్యాపారం సుహాస్‌ టేకోవర్‌ చేయాల్సి వస్తుంది. మరి ఇంతకి తండ్రి చేసే వ్యాపారం ఏంటో తెలిసి ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఆ తర్వాత ఏం జరిగిందనేది కథ. ఆద్యంతం కామెడీ ఎంటర్‌టైనర్‌గా సాగుతుంది. ఎండింగ్‌లో మంచి సందేశం ఇచ్చారు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పాడిన 10 పాటలు.. సింగర్‌గా అదరగొట్టిన పవర్ స్టార్!
Recommended image2
Balakrishna: బాలయ్య పెద్ద మనసు, 43 కోట్ల విలువైన ఇంటిని త్యాగం.. ఎందుకంటే?
Recommended image3
Serial Killer Movies: లాస్ట్ మినిట్ వరకు ఉత్కంఠ రేపే టాప్ 5 సీరియల్ కిల్లర్ మూవీస్ ఇవే!
Related Stories
Recommended image1
Vishnu Vinyasam First Review: విష్ణు విన్యాసం మూవీ ఫస్ట్ రివ్యూ.. హైలైట్స్ ఇవే, మైనస్‌ ఏంటంటే
Recommended image2
Vijay Rashmika Wedding: గ్రాండ్‌గా విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్నా మ్యారేజ్‌, హాజరైన గెస్ట్ లు వీరే.. సాయంత్రం మరో పెళ్లి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved