- Home
- Entertainment
- ఎక్కువ ఫిల్మ్ ఫేర్ అవార్డ్ లు సాధించిన సౌత్ ఇండియన్ హీరోయిన్ ఎవరో తెలుసా..? షాక్ అవుతారు..?
ఎక్కువ ఫిల్మ్ ఫేర్ అవార్డ్ లు సాధించిన సౌత్ ఇండియన్ హీరోయిన్ ఎవరో తెలుసా..? షాక్ అవుతారు..?
ప్రస్తుతం ఫిల్మ్ ఫేర్ పండుగ జరుగుతోంది.. బెస్ట్ ఫెర్ఫామెన్స్ ఇచ్చిన తారలు స్టేజ్ పై మెరవబోతున్నారు. ఈక్రమంలో ఇప్పటి వరకూ ఎక్కువ ఫిల్మ్ ఫేర్స్ అందుకున్న సౌత్ ఇండియన్ హీరోయిన్ ఎవరో చూద్దాం..?

నయనతార, త్రిష, సమంత, రష్మిక, కీర్తి సురేష్ వంటి ఎంతో మంది హీరోయిన్లు సౌత్ ఇండియాలో పుట్టి.. స్టార్ హీరోయిన్స్ గా వెలుగు వెలిగారు. స్టార్ హీరోల సరసన మెరిసి.. సూపర్ హిట్ సినిమాలు సినిమాలు అందించారు. ఈక్రమంలో ఎన్నో అవార్డ్ లను అందుకున్నారు ఈ నటీమణులు. అయితే వీరిలో ఎక్కువగా ఫిల్మ్ ఫేర్ అందుకున్న హీరోయిన్ ఎవరు..?
అమితాబచ్చన్ తో లిప్ లాక్ సీన్.. భయంతో రెండు సార్లు బ్రెష్ చేసుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా..?
Trisha, Nayanthara
సౌత్ లో పుట్టిన హీరోయిన్లలో సీనియర్లుగా వెలుగు వెలుగుతున్నవారు త్రిష, నయనతార. వీళ్ళు ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 20 ఏళ్ళు పైనే అయ్యింది. ఇప్పటికీ హీరోయిన్లు గా కొనసాగుతూ.. రికార్డ్ క్రియేట్ చేశారు. విజయ్, అజిత్, చిరంజీవి, బాలయ్య లాంటి స్టార్ హీరోల సరసన హీరోయిన్లుగా నటిస్తూనే ఉన్నారు. అయితే వీరి కెరీర్ టైమ్ లో ఎన్ని ఫిల్మ్ ఫేర్స్ అందుకున్నారో తెలుసా..?
నాగార్జునకు చెందిన అన్నపూర్ణ స్టూడియో ఎన్ని కోట్ల విలువ చేస్తుందో తెలుసా..? వింటే షాక్ అవుతారు..?
సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ గా నయనతార స్టార్ డమ్ తో దూసుకుపోతోంది. ఆమె తన 20 ఏళ్ళ సినీ ప్రస్థానంలో 14 సార్లు ఫిలింఫేర్ అవార్డుకు నామినేట్ అయ్యింది. కాని అందులో ఆమె గెలుచుకున్న అవార్డ్ లు మాత్రం కేవలం 5 మాత్రమే. ఐదు సార్లు మాత్రమే నయన్ ఫిల్మ్ ఫేర్ అవార్డును గెలుచుకుంది.
actress trisha
మరోవైపు నయనతారకంటే ముందే ఇండస్ట్రీకి వచ్చిన త్రిష కూడా 10 ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ కు నామినేట్ అయ్యింది. కాని ఆమె కూడా అందుకున్న అవార్డ్ 5 మాత్రమే. ఈమె కూడా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. ఇంత వరకూ ఎవరూ సాధించలేని రికార్డ్ త్రిషకు ఉంది. హీరోయిన్ గా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన హీరోయిన్ గా త్రిషకు ప్రత్యేకమైన స్థానం లభించింది.
ఇక పోతే వీరిందరికంటే ఎక్కువగా ఫిల్మ్ ఫేర్స్ సాధించిన నటిగా సాయి పల్లవి రికార్డ్ సాధించింది. ఆమె ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి 10 ఏళ్ళు కూడా కావడంలేదు. ఇంత తక్కువ టైమ్ లోనే సాయి పల్లవి 6 సార్లు ఫిల్మ్‌ఫేర్ అవార్డును గెలుచుకుంది. దీని ద్వారా ఆమె దక్షిణ భారత స్టార్ హీరోయిన్ గా తన ఉనికిని చాటుకుంది.
ప్రేమమ్, ఫిదా,ఎమ్ సీఎ, మారి 2, లవ్ స్టోరీ, శ్యామ్ సింహరాయ్, గార్గి ఇలా వరుసగా హిట్ సినిమాలు చేసిన సాయి పల్లవి ఎక్స్ పోజింగ్ కు దూరంగా ఉంటుంది. మేకప్ కూడా చాలా తక్కువ వేసుకుంటుంది. అసలు వేసుకోకుండా చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. సాయి పల్లవి ప్రస్తుతం తెలుగులో తాండల్ చిత్రంలో నటిస్తోంది. త్వరలో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టబోతున్నాడు. సాయి పల్లవి 2015లో మలయాళ చిత్రం ప్రేమమ్‌తో తెరంగేట్రం చేసింది. కేవలం రూ.4 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం కమర్షియల్‌గా 74.5 కోట్లు వసూలు చేసి భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా కేరళలో 175 రోజులు, తమిళనాడులో 300 రోజులు థియేటర్లలో విజయవంతంగా రన్ అయింది.
తెలుగులో తక్కువ సినిమాలైనా.. దూసుకుపోతున్న సాయి పల్లవి.. గతంలో నటించిన గార్గి సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక ఆమె కెరీర్ లో 6 ఫిల్మ్‌ఫేర్ అవార్డులతో సహా పలు అవార్డులను గెలుచుకుంది. ఇక త్వరలో బాలీవుడ్ ఎంట్రీ కూడా ప్లాన్ చేస్తోంది సాయి పల్లవి. నితేష్ తివారీ రామాయణంలో సాయి పల్లవి సీతగా నటిస్తోంది. ఈ మూవీలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా, యశ్ రావణుడిగా నటిస్తున్నారు. దాదాపు 835 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా రూపొందుతుండటం గమనార్హం.