సౌందర్య తండ్రి జ్ఞాపకార్ధం నిర్మించిన ఏకైక సినిమా ఏదో తెలుసా?
సౌందర్య కేవలం హీరోయిన్ గానే కాకుండా నిర్మాతగానూ మారిందని మీకు తెలుసా.. ? అంతేకాదు.. ఆమె స్వయంగా నటించి ఓ చిత్రాన్ని నిర్మించిందన్న సంగతి ఎంతమందికి తెలుసు?

తెలుగు సినిమా పరిశ్రమకు మరో సావిత్రి అంటే సౌందర్యనే. టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు దొరికిన ఆణిముత్యంలాంటి హీరోయిన్ సౌందర్య. హీరోయిన్ గా ఎంతో పేరు తెచ్చుకున్నఈమె తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది. దాదాపు అందరు స్టార్ హీరోల సరసన ఆమె నటించింది.
Also Read: 20 ఏళ్ళుగా రెమ్యునరేషన్ తీసుకోకుండా సినిమాలు చేస్తున్న స్టార్ హీరో, ఎవరో తెలుసా?
తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఆమె.. దక్షిణ భారత భాషలలో వెలుగు వెలిగింది. 90వ దశకంలో సౌత్ ఇండియన్ సినిమాకు స్టార్ హీరోలుగా ఉన్న చిరంజీవి, రజనీకాంత్, కమల్ హాసన్, మోహాన్ లాల్, వెంకటేష్, నాగార్జున, లతో పాటు శ్రీకాంత్, జగపతిబాబులాంటి స్టార్స్ తో కూడా ప్యామిలీ మూవీస్ లో నటించి మెప్పించింది.
Also Read: నాగార్జున నైట్ నిద్ర పట్టాలంటే ఏం తింటారో తెలుసా? టాలీవుడ్ మన్మథుడి స్లీపింగ్ సీక్రెట్ ఏంటి?
1972 కర్ణాటకలో పుట్టిపెరిగిన సౌందర్య తెలుగులో స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకుంది. ఆతరువాత తమిళంలో ఫేమస్ అయ్యింది. తన మాతృభాష ను మాత్రం వదులుకోలేదు సౌందర్య. కన్నడ లో కూడా స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు సౌందర్య సినిమా కుటుంబం నుండి వచ్చింది. ఆమె తండ్రి సత్యనారాయణ అయ్యర్ కన్నడలో రచయిత, నిర్మాత. ఎన్నో సినిమాలను నిర్మించారు ఆయన.
Also Read: సినిమా థియేటర్ ఒక్కటి కూడా లేని దేశం ఉందని మీకు తెలుసా? అక్కడ సినిమాలు చూస్తే నేరమా?
తండ్రి ప్రోత్సాహంతోనే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది సౌందర్య. అనూహ్యంగా నటిగా మారింది సౌందర్య. బాలనటిగా కన్నడాలో ఇంటర్డ్యస్ అయ్యింది. ఆతరువాత హీరోయిన్ గా ఫుల్ బిజీ అయిపోయింది. అయితే సౌందర్య ఒక స్తాయిలో ఉండగానే ఆమె తండ్రి మరణించారు. దాంతో తండ్రి అంటే ఎంతో ప్రేమించే ఈ హీరోయిన్.. తండ్రి పేరు మీద ఏదైనా చేయాలి అనుకున్నారట. దాంతో తనకు వచ్చిన ఆలోచనతో ఆమె నిర్మాతగా మారారు.
Also Read: కే జే ఏసుదాస్ కి అనారోగ్యం, హాస్పిటల్ లో అడ్మిట్ అయిన స్టార్ సింగ్, ఆందోళణలో అభిమానులు
తన తండ్రికి నివాళిగా ఓ సినిమా తీయాలనుకున్నారట. తన తండ్రి పేరుతో `సత్య మూవీ మేకర్స్` అనే కొత్త నిర్మాణ సంస్థను ప్రారంభించి 2002లో `తీవు` అనే కన్నడ సినిమాను నిర్మించారు సౌందర్య. ఈ సినిమాలో తానే స్వయంగా నటించారు. ఇది కమర్షియల్ సినిమాలా కాకుండా.. ఆర్ట్ మూవీలా తెరెక్కించారు టీమ్.
కన్నడలో విడుదలైన ఈ చిత్రానికి గిరీష్ కాసరవల్లి దర్శకత్వం వహించారు. ఇందులో సౌందర్య స్వయంగా హీరోయిన్ గా నటించారు. అంతే కాదు ఈ చిత్రం రెండు జాతీయ అవార్డులను గెలుచుకోవడం గమనార్హం.కాని ఆతరువాత సౌందర్య ఏ సినిమాను నిర్మించలేదు.
Also Read: నేచురల్ స్టార్ నాని అసలు పేరు ఏంటో తెలుసా? నాని ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంత?