- Home
- Entertainment
- ఒక్క సినిమా థియేటర్ కూడా లేని వింత దేశం ? సినిమాలు చూస్తే నేరంగా భావించే కంట్రీ ఎక్కడుంది?
ఒక్క సినిమా థియేటర్ కూడా లేని వింత దేశం ? సినిమాలు చూస్తే నేరంగా భావించే కంట్రీ ఎక్కడుంది?
పాముల్లేని దేశం, కుక్కల్లేని దేశం అంటూ.. దేశాలకు సబంధించిన విచత్రమైన వార్తలు ఎన్నో వస్తుంటాయి. కాని సినిమా థియేటర్ లేని దేశం కూడా ఉందని మీకు తెలుసా? ఒక్కటంటే ఒక్క థియేటర్ కూడా లేని దేశం ఏది? కారణం ఏంటి?

సినిమా అనేది ప్రస్తుతం నిత్యవసరం అయిపోయింది. అసలు సినిమా చూడనివారు చాలా తక్కువమంది ఉంటారు. నిత్యం ఎన్నో పనులు, ఒత్తిడి, ఇబ్బందులు ఎదుర్కొంటున్న జనాలకు సినిమా ఒక రిలీఫ్. సినిమా అనే కాదు ఎంటర్టైమ్మెంట్ ఏదైనా సరే అది కాసేపు ప్రశాంతను ఇస్తుంది.
ఇది ఏదేశంలో అయినా ఒక్కటే. భాష మారి ఉండవచ్చు కాని.. సినిమా అనే ఎమోషన్ మాత్రం ఒక్కటే. అందుకే హాలీవుడ్ ప్రపంచాన్ని ఏలుతోంది. ప్రతీదేశంలో సినిమాలను ఆదరిస్తారు. నటులకు గౌరవం ఇస్తారు. ప్రస్తుతం భాషా బేదం లేకుండా పాన్ వరల్డ్ సినిమాను చూస్తున్నారు.
Also Read: ఇష్టమైన ఇంటిని ఖాళీ చేసి, అద్దె ఇంట్లోకి షారుఖ్ ఖాన్, మన్నత్ ను కింగ్ ఖాన్ ఎందుకు వదిలేశాడు.
మన తెలుగు సినిమాలు కూడా జపాన్, చైనా లాంటి దేశాల్లో గట్టిగా కలెక్షన్స్ సాధిస్తూ.. మన హీరోల ను ఆదరిస్తున్నారు. ఈక్రమంలో ప్రతీ దేశంలో సినిమా థియేటర్లు కామన్ గా ఉంటాయి. కాని ప్రపంచంలో అసలు ఒక్క థియేటర్ కూడా లేని దేశం ఉందని మీకు తెలుసా? అక్కడ సినిమాలు చూడటం నేరంగా పరిగణిస్తారని మీకు తెలుసా? ఇంతకీ ఆ దేశం ఏంటి అనే అనుమానం వచ్చి ఉంటుంది కదా? అదేదో ఎక్కడో ఉన్న దేశం కాదు.. మన పొరుగున్న ఉన్న దేశమే. అదే భూటాన్.
Also Read: నాగ చైతన్య లో ఈ టాలెంట్ కూడా ఉందా? శోభితా వల్ల బయటపడ్డ కొత్త నిజం
మన ఇండియాలో దాదాపుగా కలిసిపోయి ఉన్న ఈ దేశంలో సినిమా హాళ్ళు ఉండవట. ఇక్కడ సినిమా చూడటం ప్రభుత్వాలకు నచ్చదట. సినిమా మనుషులను ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. చెడగొడుతుంది అనే అభిప్రాయం అక్కడి ప్రభుత్వాలలో ఉందని, అందుకే ఇక్కడ థియేటర్లు కట్టడానికి గవర్నమెంట్ నుంచి పర్మీషన్లు ఉండవట. అయితే వారు పబ్లిక్ గా సినిమాలు చూడకుండా ఆపగలరు కాని.. అసలు జనాలను సినిమాలే చూడకుండా ఆపలేరు కదా?
Also Read: నేచురల్ స్టార్ నాని అసలు పేరు ఏంటో తెలుసా? నాని ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంత?
Bhutan
అందుకే అక్కడి ప్రజలు ఇంటర్నెట్ ను ఉపయోగించుకుని, టీవీల్లో, ఓటీటీల్లో సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేస్తారట. అంతే కాదు మన ఇండియాన్ సినిమాలకు అక్కడ ఎక్కువగా డిమాండ్ ఉందట. ఇప్పుడు అక్కడ మన తెలుగు సినిమాల హవా కూడా నడుస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే మన సినిమాలకు యూట్యూబ్ లో, ఓటీటీల్లో ఎక్కువ వ్యూస్ వస్తుంటాయి. ఇలా థియేటర్ లేని దేశంగా భూటాన్ చరిత్రలోకి ఎక్కేసిందనిచెప్పుకోవచ్చు.
Also Read: అనిరుధ్‌ను వెనక్కి నెట్టి, షాక్ ఇచ్చిన జీవీ ప్రకాష్, ఏఆర్ రెహమాన్ అల్లుడు మామూలోడు కాదు