MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • కే జే ఏసుదాస్ కి అనారోగ్యం, హాస్పిటల్ లో అడ్మిట్ అయిన స్టార్ సింగ్, ఆందోళణలో అభిమానులు

కే జే ఏసుదాస్ కి అనారోగ్యం, హాస్పిటల్ లో అడ్మిట్ అయిన స్టార్ సింగ్, ఆందోళణలో అభిమానులు

దాదాపు 50 ఏళ్ళుగా సంగీత ప్రపంచాన్ని ఏలుతున్న స్టార్ సింగర్ కే.జే. ఏసుదాస్ అనారోగ్యంతో హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ కే.జే. ఏసుదాస్ పరిస్థితి ఎలా ఉంది?  

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Feb 27 2025, 10:12 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
50 వేలకు పైగా పాటలు :

50 వేలకు పైగా పాటలు :

కేరళకు చెందిన కే.జే. ఏసుదాస్ స్టార్ సింగర్ గా సంగీత ప్రపంచాన్ని ఏలారు. తన ప్రత్యేకమైన గొంతుతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. మలయాళం తో పాటుగా తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో 50 వేలకు పైగా పాటలు పాడారు. 

25
నాన్న ద్వారా సంగీతంపై ఆసక్తి:

నాన్న ద్వారా సంగీతంపై ఆసక్తి:

ఏసుదాస్ తండ్రి సంగీత కళాకారుడు కావడంతో చిన్న వయసులోనే ఆయనకు సంగీతంపై ఆసక్తి కలిగింది. ఆ తర్వాత హిందుస్తానీ సంగీతంలో కూడా ప్రావీణ్యం సంపాదించారు. 1962లో విడుదలైన మలయాళ చిత్రం 'కాల్పాదుకల్' ద్వారా ఏసుదాస్ నేపథ్య గాయకుడిగా పరిచయమయ్యారు. అప్పటి నుంచి తిరిగి చూసుకోలేదు. ఎన్ని పాటలు పాడారు. ఏ భాషలో పాడారు అనేది లెక్కే లేదు. 

 

35
తెలుగు, తమిళం

తెలుగు, తమిళం

మొదటి చిత్రంలోనే ఆయన పాడిన పాట, ఆయన గొంతు శైలి అభిమానులను ఆకట్టుకోవడంతో.. ఆ తర్వాత ఆయనకు చాలా మలయాళ వరుసగా అవకాశాలు వచ్చాయి.  . ఆ తర్వాత చిన్నగా తెలుగు, తమిళ భాషల్లోకి కూడా ఎంటర్ అయ్యారు ఏసుదాసు. ఈ రెండు భాషల్లో కూడా వందల పాటలను ఆలపించారు. ఏసుదాసు గొంతుకు ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారు. మరీ ముఖ్యంగా మెహన్ బాబు లాంటి హీరోలు ఆయనతో తమ సినిమాల్లో ఒక్క పాట అయినా పాడించుకునేవారు. 

45
ఏసుదాస్ 7

ఏసుదాస్ 7

ఏసుదాస్  తెలుగు,తమిళంలో 1500కు పైగా పాటలు పాడారు. చిరంజీవి, బాలయ్య, మోహన్ బాబు, వెంకటేష్ తమిళంలో  ఎంజీఆర్, శివాజీ, రజనీకాంత్, కమల్, అజిత్, విజయ్ ఇలా దాదాపు 5 తరాల నటులకు కేజే ఏసుదాస్ పాటలు పాడారు. ఆయన తర్వాత ఆయన కుమారుడు విజయ్ ఏసుదాస్ కూడా ప్రముఖ గాయకుడిగా ఉన్నారు. 
 

55
కేజే ఏసుదాస్ కు అనారోగ్యం

కేజే ఏసుదాస్ కు అనారోగ్యం

ఇలాంటి పరిస్థితుల్లో ఆయన గురించి వస్తున్న సమాచారం అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. 85 ఏళ్ల వయసున్న ఆయనకు ఉన్నట్టుండి ఆరోగ్యం క్షీణించడంతో కేజే ఏసుదాస్‌ను ఆసుపత్రిలో చేర్చారని, ఆయనకు రక్త కణాలకు సంబంధించిన సమస్య ఉందని వైద్యులు చికిత్స అందిస్తున్నారని వైద్య సిబ్బంది తెలిపారు. దీంతో అభిమానులు, ప్రముఖులు ఏసుదాస్ త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు. మరి ఆయన ఆరోగ్య పరిస్థితిపై వివరాలు ఎప్పుడు బయటకు వస్తాయో చూడాలి. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
విజయ్, రష్మిక కంటే ముందు కలసి నటించి పెళ్లి చేసుకున్న 6 జంటలు వీళ్ళే.. క్రేజీ ఫోటోస్
Recommended image2
Beach Club: ముంబైలో శిల్పా శెట్టి ఫస్ట్ బీచ్ క్లబ్.. 6 అద్భుతమైన ఫోటోలు
Recommended image3
వెంకటేష్ తో చేతులు కలిపిన నందమూరి హీరో.. క్రేజీ మల్టీస్టారర్ ప్రకటించిన అనిల్ రావిపూడి, రిలీజ్ డేట్ ఫిక్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved