MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Soundarya: రెండు లక్షలకు కక్కుర్తి పడి ప్రాణాలు పోగొట్టుకుంది.. సౌందర్య గురించి షాకింగ్‌ నిజాలు బయటపెట్టిన దర్శకుడు

Soundarya: రెండు లక్షలకు కక్కుర్తి పడి ప్రాణాలు పోగొట్టుకుంది.. సౌందర్య గురించి షాకింగ్‌ నిజాలు బయటపెట్టిన దర్శకుడు

సౌందర్య హెలికాఫ్టర్‌ ప్రమాదంలో కన్నుమూసిన విషయం తెలిసిందే. కానీ ఆమె రెండు లక్షలకు కక్కుర్తి పడి తన ప్రాణాలు తీసుకుందని సంచలన కామెంట్‌ చేశారు టాలీవుడ్‌ డైరెక్టర్‌. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Jul 02 2026, 10:48 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
చీరకి అందం తీసుకొచ్చిన సౌందర్య
Image Credit : MAA TV

చీరకి అందం తీసుకొచ్చిన సౌందర్య

సౌందర్య.. హీరోయిన్‌గా తనకంటూ సెపరేట్‌ ఇమేజ్‌ని క్రియేట్‌ చేసుకుంది. గ్లామర్‌ ప్రపంచంలోనూ పద్ధతిగా ఉండటం ఎలాగో చాటి చెప్పింది. చీర కట్టుతో ఆ చీరకే అందం తెచ్చింది సౌందర్య. మంచి కంటెంట్ ఉన్న చిత్రాల్లో నటించి మెప్పించింది. అత్యధిక సక్సెస్‌ రేట్‌ని సొంతం చేసుకుంది. అప్పట్లో సౌందర్య, వెంకటేష్‌ కాంబినేషన్‌కి మంచి క్రేజ్‌ ఉండేది. వీరి కాంబినేషన్‌లో వచ్చిన చాలా సినిమాలు విజయాలు సాధించాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
తిరుగులేని స్టార్ హీరోయిన్ గా రాణించిన సౌందర్య
Image Credit : Asianet News

తిరుగులేని స్టార్ హీరోయిన్ గా రాణించిన సౌందర్య

చిరంజీవి, వెంకటేష్‌, నాగార్జున, బాలకృష్ణ, మోహన్‌ బాబు, రాజశేఖర్, జగపతిబాబు, జేడీ చక్రవర్తి వంటి వారితోనూ సినిమాలు చేసి మెప్పించింది. తెలుగులో తిరుగులేని స్టార్‌ హీరోయిన్‌ రాణించింది. సౌందర్యకి కొంత మంది హీరోలతో ఎఫైర్లు ఉన్నాయనే వార్తలు అప్పట్లో వినిపించాయి. జగపతిబాబు, వెంకటేష్‌తో ప్రధానంగా వినిపించాయి. కానీ వాటికి ఫుల్‌ స్టాప్‌ పెడుతూ, సాఫ్ట్ వేర్‌ ఇంజనీర్ రఘుని పెళ్లి చేసుకొని లైఫ్‌లో సెటిల్‌ అయ్యింది. పెళ్లైన ఏడాదికే ఆమె చనిపోయింది.

Related Articles

Related image1
Chiranjeevi: చిరంజీవి భయపడి రిజెక్ట్ చేస్తే, రజనీకాంత్‌ బ్లాక్‌ బస్టర్‌తో ట్రెండ్‌ సెట్‌ చేశాడు.. ఆ సినిమా ఏంటంటే?
Related image2
Dasari: నాగార్జున గౌరవంతో త్యాగం చేస్తే, తెలిసీ తప్పు చేసిన దాసరి.. దెబ్బకి కొడుకు కెరీర్‌ ఔట్‌
35
హెలికాఫ్టర్‌ ప్రమాదంలో సౌందర్య కన్నుమూత
Image Credit : MAA TV

హెలికాఫ్టర్‌ ప్రమాదంలో సౌందర్య కన్నుమూత

2004లో ఎన్నికల సమయంలో ఆమె బీజేపీ తరఫున ఎన్నికల ప్రచారానికి వెళ్లింది. హెలికాఫ్టర్‌లో వెళ్తుండగా, అందులో ప్రమాదం చోటు చేసుకొని పడిపోయింది. ఈ ప్రమాదంలో సౌందర్యతోపాటు ఆమె సోదరుడు అమర్‌నాథ్‌ కూడా చనిపోయాడు. అప్పట్లో ఈ ఘోర ప్రమాదం అందరిని కలిచివేసింది. ఇండస్ట్రీని కుదిపేసింది. ఎవరూ నమ్మలేకపోయారు. అభిమానులు తల్లడిల్లిపోయారు. ఇదిలా ఉంటే ఈ ఘటనపై తాజాగా దర్శకుడు గీతా కృష్ణ స్పందించారు. ఆమె చాలా మంచి అమ్మాయి అయిన, ఒకసారి హైదరాబాద్‌ వచ్చినప్పుడు ప్రశాంత్‌ కుటీర్‌లో ఉండమని తానే సజెస్ట్ చేశానని, ఆ తర్వాత ఆమె ఎప్పుడు వచ్చినా అక్కడే ఉండేదని తెలిపారు. ఆమెతో వర్క్ చేసే అవకాశం తనకు రాలేదని చెప్పారు.

45
రెండు లక్షలకు కక్కుర్తి పడి ప్రాణాలు తీసుకుంది
Image Credit : MAA TV

రెండు లక్షలకు కక్కుర్తి పడి ప్రాణాలు తీసుకుంది

సౌందర్య నటిగా ఎంతగానో ఆకట్టుకుందని, ఆమె గొప్ప నటి అని చెప్పారు. గొప్ప కలర్‌ ఏమీ కాదని, కానీ స్క్రీన్‌ లుక్‌ మాత్రం అదిరిపోయేదని, మన ఇంటి అమ్మాయిలానే ఉండేదని చెప్పారు. అయితే కెరీర్‌ మంచి పీక్‌లో ఉండగానే ఆమె తప్పు చేసిందని చెప్పారు. బీజేపీ నాయకుడు విద్యాసాగర్‌ రావు రెండు లక్షలు ఆఫర్‌ చేస్తే ఎన్నికల ప్రచారానికి వెళ్లిందని, ఈ సమయంలోనే ఆమె ప్రమాదానికి గురై మరణించిందన్నారు. రెండు లక్షలకు కక్కుర్తి పడి చివరికి తన ప్రాణాలే తీసుకుందని చెప్పారు గీతా కృష్ణ. ఆ రోజు ఎన్నికల ప్రచారానికి పోకుండా ఉండి ఉంటే, ఇప్పుడు మనం సౌందర్యని చూసుకునేవాళ్లమని వెల్లడించారు.

55
సౌందర్య నటించిన తెలుగు సినిమాలు
Image Credit : MAA TV

సౌందర్య నటించిన తెలుగు సినిమాలు

కన్నడకు చెందిన సౌందర్య.. `మనవరాలి పెళ్లి` అనే చిత్రంతో తెలుగు ఆడియెన్స్ కి పరిచయం అయ్యింది. `రాజేంద్రుడు గజేంద్రుడు`, `మాయలోడు` చిత్రాలతో విజయాలు అందుకుంది. `నెంబర్‌ వన్‌`, `హలో బ్రదర్‌`, `అల్లరి ప్రేమికుడు`, `సూపర్‌ పోలీస్‌`, `మేడం`, `టాప్‌ హీరో`, `అమ్మదొంగ`, `రాజా సింహం`, `పెదరాయుడు`, `భలే బుల్లోడు`, `అమ్మోరు`, `రిక్షావోడు`, `ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు`, `పవిత్ర బంధం`, `పెళ్లి చేసుకుందాం`, `చూడాలని వుంది`, `శ్రీ రాములయ్య`, `అంతపురం`, `రాజా`, `ప్రేమకు వేళయేరా`, `అన్నయ్య`, `రవన్న`, `మూడు ముక్కలాట`, `నిన్నే ప్రేమిస్తా`, `అజాద్‌`, `జయం మనదేరా`, `దేవి పుత్రుడు`, `ఎదురులేని మనిషి`, `కలిసి నడుద్దాం`, `కొండవీటి సింహం` వంటి చిత్రాల్లో నటించి స్టార్‌ హీరోయిన్‌గా రాణఙంచింది సౌందర్య.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
సౌందర్య
వినోదం
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Karthika Deepam 2 Today Episode: నేనే నీ మొగుడిని అంటూ జ్యోకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన సూరజ్
Recommended image2
Illu Illalu Pillalu Today Episode: వల్లి తాట తీసేందుకు సిద్ధమైన నర్మద.. అన్ని నిజాలు చెప్పేసిన డాక్టర్
Recommended image3
Meher Ramesh: 'బిల్లా' డైరెక్టర్ మెహర్ రమేష్ కుమార్తె వెడ్డింగ్ ఫోటోస్.. చిరు, పవన్, వెంకీ సందడి చూశారా
Related Stories
Recommended image1
Chiranjeevi: చిరంజీవి భయపడి రిజెక్ట్ చేస్తే, రజనీకాంత్‌ బ్లాక్‌ బస్టర్‌తో ట్రెండ్‌ సెట్‌ చేశాడు.. ఆ సినిమా ఏంటంటే?
Recommended image2
Dasari: నాగార్జున గౌరవంతో త్యాగం చేస్తే, తెలిసీ తప్పు చేసిన దాసరి.. దెబ్బకి కొడుకు కెరీర్‌ ఔట్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved