MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • Illu Illalu Pillalu Today Episode: వల్లి తాట తీసేందుకు సిద్ధమైన నర్మద.. అన్ని నిజాలు చెప్పేసిన డాక్టర్

Illu Illalu Pillalu Today Episode: వల్లి తాట తీసేందుకు సిద్ధమైన నర్మద.. అన్ని నిజాలు చెప్పేసిన డాక్టర్

Illu Illalu Pillalu Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు నేటి ఎపిసోడ్లో నర్మద డాక్టర్ ను కలిసి వల్లి నిజాలు అన్నీ తెలుసుకుంటుంది. ఇంటికెళ్లి వల్లికి తాట తీయడానికి సిద్ధమవుతుంది. వేదవతి మాత్రం నర్మద మాట వినదు. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకోండి. 

2 Min read
Author : Haritha Chappa
Published : Jul 02 2026, 09:51 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
డాక్టర్ ను కలిసిన నర్మద
Image Credit : Jio hotstar

డాక్టర్ ను కలిసిన నర్మద

నర్మద.. వల్లి బండారం బయట పెట్టేందుకు డాక్టర్ ను కలుస్తుంది. డాక్టర్ దగ్గరికి వెళ్లి తాను ప్రెగ్నెంట్ అని చెబుతుంది. నీకు ఎలా తెలుసు అని అడుగుతుంది డాక్టర్. దానికి నేను కళ్ళు తిరిగి కింద పడిపోయాను అని చెబుతుంది. అలాగే రిపోర్ట్స్ కూడా ఇస్తుంది. అవి వల్లి రిపోర్ట్స్ అని తెలియగానే డాక్టర్ షాక్ అవుతుంది. అప్పుడు నర్మద మాట్లాడుతూ ‘ఆ రోజు కళ్ళు తిరిగి పడిపోయింది నేను కాదు మా అక్క. మీరు ఈ రిపోర్ట్ ఇచ్చారు. ఇలా చేయడానికి మీకు బుద్ధి లేదా’ అని తిడుతుంది. ఆమె ప్రెగ్నెంట్ కాదని తెలుసుకొని మళ్లీ మీ దగ్గరికి తీసుకొస్తే మీరు మళ్లీ ఆమె ప్రెగ్నెంట్ అని అబద్ధపు రిపోర్ట్స్ ఇచ్చారు. మిమ్మల్ని పోలీసులకు పట్టిస్తాను అని బెదిరిస్తుంది నర్మద. దాంతో డాక్టర్ అన్ని నిజాలు చెప్పేస్తుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
డాక్టర్ కు వార్నింగ్ ఇచ్చిన నర్మద
Image Credit : Jio hotstar

డాక్టర్ కు వార్నింగ్ ఇచ్చిన నర్మద

తన కూతురు కాపురం నిలబెట్టమని ఆ పెద్దావిడ అడగడంతో తాను అలా చేశానని చెబుతుంది డాక్టర్. రెండోసారి వల్లి వచ్చినప్పుడు తాను గర్భవతి అని అబద్ధం చెప్పమని లేకపోతే తన కాపురం కూలిపోతుందని రిక్వెస్ట్ చేయడంతో మళ్లీ ప్రెగ్నెంట్ అని రిపోర్ట్స్ ఇచ్చానని చెబుతుంది డాక్టర్. దీంతో నర్మద కోపంగా ‘మీ వల్ల నా కాపురం ఇబ్బందుల్లో పడింది. నేను మిమ్మల్ని అంత త్వరగా వదిలేయను’ అని అంటుంది. దానికి ఆ డాక్టర్ ‘నేను ఎంత మోసం చేశానని ఇలా అంటున్నారు.. మరొక డాక్టర్ అబార్షన్ చేసినట్టు అబద్ధం చెప్పారుగా.. ఆమెను వదిలేసి నన్ను పట్టుకుంటారేంటి’ అని అడుగుతుంది. దానికి నర్మద మాట్లాడుతూ ఆ డాక్టర్ను కూడా వదలను.. ఆమె పని కూడా చెబుతాను అంటూ వార్నింగ్ ఇచ్చి అక్కడ నుంచి వచ్చేస్తుంది. ఆవేశంగా ఇంటికి బయలుదేరుతుంది. వల్లి బాగోతం బయట పెట్టాలి.. నా తప్పేమీ లేదని నిరూపించుకోవాలి అని అనుకుంటూ వస్తుంది.

Related Articles

Related image1
Colour of Gold: బంగారానికి ఆ పసుపు రంగు ఎలా వచ్చింది? దీని వెనుక మిస్టరీ ఇదే
Related image2
Best EV Cars: మీ బడ్జెట్లో వచ్చే బెస్ట్ ఈవీ కార్లు.. భవిష్యత్తంతా ఈ కార్లదే
34
కష్టాల్లో ప్రేమ
Image Credit : Jio hotstar

కష్టాల్లో ప్రేమ

ఇక్కడి నుంచి సీన్ ప్రేమ దగ్గరికి మారుతుంది. ప్రేమ డాన్స్ కాంపిటీషన్ కోసం రెడీ అవుతూ ఉంటుంది. రాజు పుష్పం వచ్చి ఆమెతో మిస్ బిహేవ్ చేస్తాడు. గదిలోనే రిహార్సల్స్ చేద్దామని పరోక్షంగా మాట్లాడతాడు. అతని ప్రవర్తన చూసి ప్రేమ భయపడిపోయి గదిలోకి వెళ్లి తలుపు వేసుకుంటుంది. ఇక్కడి నుంచి సీన్ ధీరజ్ దగ్గరికి మారుతుంది. ధీరజ్ ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి ఒక ఇంటికి వెళ్తాడు. అక్కడ ప్రేమ ఫ్రెండ్ ఉండడంతో ‘మీ అమ్మకి హార్ట్ ఎటాక్ అని చెప్పి ప్రేమని తీసుకొని వచ్చావు కదా. మీ అమ్మ ఎలా ఉంది’ అని అడుగుతాడు. అయినా ప్రేమ హాస్పిటల్ లో ఉంటే నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అంటాడు. దానికి ఆ ఫ్రెండ్ తికమక పడుతూ మాట్లాడటంతో అనుమానం వచ్చి నిజం ఏంటని అడుగుతాడు. దాంతో ప్రేమ ఫ్రెండు డాన్స్ కాంపిటీషన్ విషయం చెప్పేస్తుంది. తనతో ధీరజ్ కు విపరీతంగా వస్తుంది. ప్రేమకు ఫోన్ చేస్తాడు. కానీ ప్రేమ ఫోనును రాజపుష్పం లాక్కుంటాడు.

44
ఎంత చెప్పినా వినని వేదవతి
Image Credit : Jio hotstar

ఎంత చెప్పినా వినని వేదవతి

ఇక ఇక్కడి నుంచి సీన్ నర్మద దగ్గరికి మారుతుంది. నర్మద ఇంట్లోకి అడుగు పెడుతూనే వల్లీ.. అంటూ గట్టిగా అరుస్తుంది. వేదవతి అది విని బయటికి వస్తుంది. ఎందుకలా అరుస్తున్నావని అడుగుతుంది. దానికి నర్మదా మాట్లాడుతూ ఆ వల్లి కడుపుతో ఉన్నదని చెప్పిన విషయం అబద్ధం. అసలు ఆమె కడుపుతోనే లేదని డాక్టర్ చెప్పింది. మరి అబార్షన్ ఎలా అవుతుంది అంటుంది. అప్పుడు వేదవతి ఆ చెప్పిన డాక్టర్ని కూడా తీసుకొస్తేనే నేను నమ్ముతాను అని అంటుంది. ఆ డాక్టర్ నిజం చెబితే వల్లిని నేనే మెడ పట్టి బయటకి గెంటేస్తాను అని కూడా చెబుతుంది. దానికి నర్మద వేదవతితో డాక్టర్ ని ఎలాగైనా పట్టుకొస్తాను అని చెబుతుంది. అక్కడితో ఎపిసోడ్ ముగిసిపోతుంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss: 50, 100 కోట్లు కాదు.. సల్మాన్ ఖాన్ రెమ్యునరేషన్ తెలిస్తే షాకే, సినిమాల కంటే ఇదే బావుందే
Recommended image2
Maa Ramudu Andarivadu: సీఎం పాత్రలో హీరో సుమన్.. ట్విస్టులు అదిరిపోతాయి, హిట్ గ్యారెంటీ అంటూ కామెంట్స్
Recommended image3
OG Universe: ఇదీ పవన్ కళ్యాణ్ కి అసలైన బర్త్ డే గిఫ్ట్.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న ఓజీ యూనివర్స్ వీడియో
Related Stories
Recommended image1
Colour of Gold: బంగారానికి ఆ పసుపు రంగు ఎలా వచ్చింది? దీని వెనుక మిస్టరీ ఇదే
Recommended image2
Best EV Cars: మీ బడ్జెట్లో వచ్చే బెస్ట్ ఈవీ కార్లు.. భవిష్యత్తంతా ఈ కార్లదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved