MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Entertainment
  • Dasari: నాగార్జున గౌరవంతో త్యాగం చేస్తే, తెలిసీ తప్పు చేసిన దాసరి.. దెబ్బకి కొడుకు కెరీర్‌ ఔట్‌

Dasari: నాగార్జున గౌరవంతో త్యాగం చేస్తే, తెలిసీ తప్పు చేసిన దాసరి.. దెబ్బకి కొడుకు కెరీర్‌ ఔట్‌

దాసరి నారాయణరావు తాను దిగ్గజ దర్శకుడిగా, ఒక లెజెండరీగా ఎదిగారు. కానీ తన వారసులను మాత్రం నిలబెట్టలేకపోయారు. అయితే ఈ విషయంలో నాగార్జున చేసిన త్యాగం బూడిదలో పోసిన పన్నీరులా మారింది. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Jul 01 2026, 04:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
లెజెండరీ దర్శకుడిగా ఎదిగిన దాసరి నారాయణ రావు
Image Credit : Pinterest

లెజెండరీ దర్శకుడిగా ఎదిగిన దాసరి నారాయణ రావు

దర్శకరత్న దాసరి నారాయణరావు.. లెజెండరీ దర్శకుడిగా రాణించారు. ఆయన అత్యధిక సినిమాలు రూపొందించిన దర్శకుడిగా రికార్డు సృష్టించారు. అదే సమయంలో టాలీవుడ్‌లో ఇండస్ట్రీ పెద్దగా ఉన్నారు. చాలా మందిచేత గురువుగా కీర్తించబడ్డారు. ఇప్పుడు ఆయన మన మధ్య లేకపోయినా, ఆయన్ని గురువుగానే భావించే వాళ్లు చాలానే ఉన్నాయి. అయితే దాసరి ఎంత గొప్పగా ఎదిగినా, వాళ్ల పిల్లలు మాత్రం తన పేరుని చెడగొడుతున్నారనే కామెంట్‌ ఉంది. ఎవరూ ఇండస్ట్రీలో రాణించలేకపోయారు. దీనికితోడు ఆస్తుల కోసం గొడవలు పడి రోడ్డుమీదకు రావడంతో దాసరిగారి పరువు పోయినంత పని అయ్యింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
కొడుకులను సెట్‌ చేయలేకపోయినా దాసరి
Image Credit : stockPhoto

కొడుకులను సెట్‌ చేయలేకపోయినా దాసరి

ఇదిలా ఉంటే తన పిల్లలు సరైన దారిలోకి రాకపోవడానికి దాసరి నారాయణరావు తప్పు కూడా ఉందని అంటుంటారు. ఆయన దర్శకుడిగా బిజీగా ఉండటంతో, పిల్లలకు టైమ్‌ ఇవ్వలేకపోయారని, వారిని సరైన దారిలో పెట్టలేకపోయారని పలువురు విశ్లేషకులు చెబుతుంటారు. పిల్లల్ని తన కంట్రోల్‌లో పెట్టుకొని, మంచి చెడు చెబితే బాగుండేదనేది చాలా మంది అభిప్రాయం.  మొత్తంగా దాసరి, ఆయన భార్య మరణంతో వారి కుటుంబం విచ్చిన్నమైంది. ఇప్పుడు ఎవరు ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారో కూడా తెలియదు. ఆ మధ్య కోర్ట్ లు, కేసులు అంటూ కనిపించారు తప్పితే, ఇంకా ఎప్పుడూ కనిపించలేదు.

Related Articles

Related image1
Chiranjeevi: చిరంజీవి భయపడి రిజెక్ట్ చేస్తే, రజనీకాంత్‌ బ్లాక్‌ బస్టర్‌తో ట్రెండ్‌ సెట్‌ చేశాడు.. ఆ సినిమా ఏంటంటే?
Related image2
Peddi 27 Days Collections: పెద్ది సినిమా హిట్టా ఫట్టా? ఇప్పటి వరకు ఎంత కలెక్ట్ చేసింది?.. షాకిచ్చే నిజాలు
34
కొడుకు అరుణ్‌ హీరోగా గ్రీకువీరుడు మూవీ
Image Credit : stockPhoto

కొడుకు అరుణ్‌ హీరోగా గ్రీకువీరుడు మూవీ

ఈ క్రమంలో కొడుకు అరుణ్‌ హీరోగా కెరీర్‌ గాడి తప్పడానికి కూడా దాసరి చేసిన మిస్టేక్‌ ఉందని తాజాగా రైటర్‌ చిన్నకృష్ణ వెల్లడించారు. దాసరి నారాయణరావు తన కొడుకు అరుణ్‌ ని హీరోగా పరిచయం చేస్తూ, `గ్రీకువీరుడు` అనే మూవీని రూపొందించారు. కానీ ఈ సినిమా ఆడలేదు. డిజాస్టర్‌గా నిలిచింది. ఆ తర్వాత ఆయన నటించిన మూవీస్‌ కూడా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాయి. అయితే `గ్రీకువీరుడు` విషయంలో ఒక ఆసక్తికర సంఘటన చోటు చేసుకుందట. అరుణ్‌ హీరోగా ఈ కథ అనుకున్నప్పుడు చిన్నకృష్ణకి అది నచ్చలేదట. ఆ విషయాన్ని దాసరికే స్వయంగా చెప్పాడట. ఇది కాకుండా మరో ఇతర భాషా సినిమాని థియేటర్లో చూపించాడట. అది చూసి దాసరి కన్నీళ్లు పెట్టుకున్నారట. దీని రీమేక్‌ రైట్స్ కొని అరుణ్‌తో చేయాలని చెప్పాడట.

44
నాగార్జున త్యాగం చేసినా ప్రయోజనం లేదు
Image Credit : stockPhoto

నాగార్జున త్యాగం చేసినా ప్రయోజనం లేదు

కానీ దాసరి నారాయణరావు వినలేదు. మొదట అనుకున్న కథనే ఎంచుకున్నాడు, దానికోసం పది మంది రైటర్లు కూడా పనిచేశారట. అయితే టైటిల్‌ విషయంలో గమ్మత్తు జరిగింది. `గ్రీకువీరుడు` టైటిల్‌ నాగార్జున రిజిస్టర్‌ చేయించుకున్నాడట. తాను హీరోగా ఆ మూవీ టైటిల్‌తో సినిమా చేయాలనుకున్నారట. కానీ దాసరి రిక్వెస్ట్ చేయడంతో ఆయనపై గౌరవంతో వెంటనే మరో మాట లేకుండా అరుణ్‌ కోసం ఇచ్చేశాడట. ఆ టైటిల్‌ వచ్చినందుకే దాసరి సెలబ్రేట్‌ చేశారట. కానీ మొదట అనుకున్న కథతోనే ఈ మూవీని చేశారట. తాను చెప్పినా కూడా ఆయన వినలేదని, ఆ సినిమా ఆడదని తెలిసీ కూడా ఆయన తప్పు చేశాడని, `గ్రీకు వీరుడు` రిజల్ట్ ఏం జరిగిందో అందరికి తెలిసిందే అని వెల్లడించాడు చిన్నికృష్ణ. ఎంట్రీ మూవీనే తేడా కొట్టడం, ఆ తర్వాత సరైన మూవీస్‌ రాకపోవడం, వచ్చినవి ఆడకపోవడంతో అరుణ్‌ హీరోగా సక్సెస్‌ కాలేకపోయాడు. దీంతో ఇండస్ట్రీకి దూరమయ్యాడు. అదే చిన్న కృష్ణ మాట విని ఉంటే, మంచి సక్సెస్‌ఫుల్‌ ఎంట్రీ ఉండి ఉంటే ఇప్పుడు అరుణ్‌ కెరీర్‌ వేరేలా ఉండేదని చెప్పొచ్చు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
అక్కినేని నాగార్జున
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Reshma Rathore: సినిమాలకు గుడ్‌ బై చెప్పి కోర్ట్ మెట్లు ఎక్కుతున్న టాలీవుడ్‌ హీరోయిన్‌.. డేరింగ్‌ స్టెప్‌
Recommended image2
Vijay Deverakonda: మందు, అమ్మాయి, బ్రేకప్‌ ఇప్పుడు పెళ్లి.. తన లైఫ్ సీక్రెట్స్ అన్నీ చెప్పేసిన రౌడీ బాయ్
Recommended image3
Raviteja Remuneration: ఇరుముడి మూవీకి రవితేజ పారితోషికం ఎంతో తెలుసా? చిరంజీవిని మించి.. టీమ్‌ ఫీజు వివరాలు
Related Stories
Recommended image1
Chiranjeevi: చిరంజీవి భయపడి రిజెక్ట్ చేస్తే, రజనీకాంత్‌ బ్లాక్‌ బస్టర్‌తో ట్రెండ్‌ సెట్‌ చేశాడు.. ఆ సినిమా ఏంటంటే?
Recommended image2
Peddi 27 Days Collections: పెద్ది సినిమా హిట్టా ఫట్టా? ఇప్పటి వరకు ఎంత కలెక్ట్ చేసింది?.. షాకిచ్చే నిజాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved