- Home
- Entertainment
- Karthika Deepam 2 Today Episode: నేనే నీ మొగుడిని అంటూ జ్యోకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన సూరజ్
Karthika Deepam 2 Today Episode: నేనే నీ మొగుడిని అంటూ జ్యోకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన సూరజ్
Karthika Deepam 2 Today Episode (జూలై 2వ తేదీ)లో కార్తీక్ ఎంగిలి స్పూన్ తీసుకున్న జ్యో. ఫైర్ అయిన దీప. నేనే నీ మొగుడిని, నువ్వే నా పెళ్లానివంటూ జ్యోకు షాక్ ఇచ్చిన సూరజ్. పెళ్లే నీకు శ్రీరామ రక్ష అన్న పారు. ఈ రోజు ఎపిసోడ్ లో ఇంకా ఏం జరిగిందంటే..

కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్
కార్తీక దీపం 2 సీరియల్ గురువారం ఎపిసోడ్ లో దీప, కార్తీక్, జ్యోత్స్న కలిసి భోజనం చేస్తుంటారు. కర్రీ ఎలా ఉంది జ్యోత్స్న అని అడుగుతుంది దీప. బాగానే ఉందని చెప్తూ స్పూన్ కింద పడేసుకుంటుంది జ్యోత్స్న. ఆ తర్వాత కార్తీక్ ప్లేట్ లో ఉన్న స్పూన్ తీసుకొని తినబోతుంది. అది చూసిన దీప.. కోపంగా ఆగవే అంటుంది. ఏమైందని కార్తీక్ అడిగితే దీనికి ఇంకా జబ్బు తగ్గలేదు బావ. నీ ఎంగిలి స్పూన్ తీసుకొని తింటోంది అని కోపంగా చెప్తుంది దీప.
తింటే తప్పేంటి అని అడుగుతుంది జ్యోత్స్న. కార్తీక్ నా భర్త అంటుంది దీప. నా మెడలో తాళి కడితే నా భర్తే అయ్యేవాడు. అయినా ఇంతకు ముందు నేను చాలాసార్లు బావ ఎంగిలి తిన్నాను అంటుంది జ్యోత్స్న. ఆపు ఎక్కువ మాట్లాడితే పళ్లు రాలిపోతాయని వార్నింగ్ ఇస్తుంది దీప. ఇదంతా సూరజ్ ఓ పక్కన ఉండి చూస్తాడు. ఆ తర్వాత కార్తీక్ సూరజ్ ని పిలిచి కూర్చొని తినమంటాడు. జ్యోత్స్న కోపంగా వెళ్లిపోతుంది. దీపకు ఆఫీసు తరఫున కారు ఇచ్చారు. నా స్కూటీ నువ్వే తీసుకోమని సూరజ్ తో చెప్తాడు కార్తీక్.
నేనే నీ మొగుడ్ని అని షాక్ ఇచ్చిన సూరజ్
తర్వాత జ్యోత్స్న ఆఫీసు బయట నిలబడి ఉంటుంది. స్కూటీ స్టార్ట్ చేసిన సూరజ్.. జ్యోను ఎక్కమని అడుగుతాడు. ఇంటికి వెళ్తూ మధ్యలో ఓ చోట స్కూటీ ఆపి దిగమంటాడు. కార్తీక్, దీప భార్యాభర్తలు వాళ్లద్దరి మధ్యకు నువ్వెందుకు వెళ్తున్నావు, నిన్ను చూస్తూనే అసహ్యంగా ఉంది అంటాడు సూరజ్. నీకెందుకురా అంటుంది జ్యోత్స్న. పెళ్లయిన మగాడి వెంట పడే ఆడదాని గురించి సమాజం ఏమనుకుంటుందో తెలుసా? బజారు.. అని ఆగిపోతాడు సూరజ్. నా పర్సనల్స్ గురించి మాట్లాడ్డానికి నువ్వెవరు అని సూరజ్ కాలర్ పట్టుకుంటుంది జ్యోత్స్న. నేను నీ మొగుడ్ని అంటాడు సూరజ్. షాక్ అవుతుంది జ్యోత్స్న. నువ్వేమైనా నా మెడలో తాళి కట్టావా అంటుంది జ్యోత్స్న. మరి కార్తీక్ నీ మెడలో తాళి కట్టాడా అని కౌంటర్ ఇస్తాడు సూరజ్.
బావే నా భర్త అని నా ఫ్యామిలీ చెప్పిందని అంటుంది జ్యోత్స్న. నువ్వే నా భార్యవని నా మనసు చెప్పింది అంటాడు సూరజ్. కార్తీక్ ని నువ్వు మొగుడు అనుకుంటే, నేను నిన్ను నా పెళ్లాం అనుకుంటా, అది కరెక్ట్ అయితే ఇదీ కరెక్టే అంటాడు సూరజ్. కోపంతో రాయి పట్టుకొని వస్తుంది జ్యోత్స్న. మళ్లీ అంటే ఈ రాయితో నీ తల పగలగొడతాను అంటుంది. కార్తీక్, దీప భర్త, వాళ్ల ప్రేమకు ప్రతిరూపంగా దీప కడుపులో బిడ్డ కూడా ఉన్నాడు. ఇంకొకరికి సొంతమైన మనిషిని ఇష్టపడటం.. మనిషి లక్షణం కాదు అని జ్యోకు గట్టిగా బుద్ధి చెప్తాడు సూరజ్.
ప్రోగ్రెస్ కార్డ్ దాచిన శౌర్య
మరోవైపు శౌర్య కోసం కాంచన వెతుకుతూ ఉంటుంది. ఇంతలో దీప, కార్తీక్ వచ్చి ఏమైందని అడిగితే శౌర్య ప్రోగ్రెస్ కార్డు దాచిందని చెప్తుంది. ప్రోగ్రెస్ కార్డు చూసిస కార్తీక్.. ఏంటి ఈ మార్కులు అని అడుగుతాడు. నేను కష్టపడి చదువుతున్న, మార్కులు రాకపోతే ఏం చేయాలి? మా ఫ్రెండ్స్ కు వాళ్ల పేరెంట్స్ ట్యూషన్ చెప్తారు. నాకు ఎవరు చెప్తారు అంటుంది శౌర్య. తప్పు నీది కాదులే దీని గురించి ఏదో ఒకటి ఆలోచించాలి అంటాడు కార్తీక్.
మనుమరాలికి పారు సలహా
ఇంకోవైపు సూరజ్ అన్న మాటల గురించి ఆలోచిస్తూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే సూరజ్ అన్ని మర్చిపోయి బుద్ధిగా ఉండమన్నట్లు వాయిస్ మెసేజ్ చేస్తాడు. అది వింటుండగా.. పారు వస్తుంది. నువ్వు ఎప్పుడు వచ్చావు అని అడుగుతుంది జ్యోత్స్న. నువ్వు వాయిస్ మెసేజ్ వినడం స్టార్ట్ చేసినప్పుడే వచ్చాను. నీకు కొంచెం కూడా సిగ్గు లేదా చివరకు వాడితో కూడా సలహాలు ఇప్పించుకుంటున్నావ్ అంటుంది పారు. నీ బొంద.. వాడు నాకు సైట్ కొడుతున్నాడు. అందుకే నేను బావను ఇష్టపడటం ఓర్చుకోలేకపోతున్నాడు అంటుంది జ్యోత్స్న.
వాడు మనకు శత్రువే కావచ్చు. కానీ వాడు ఇచ్చిన సలహా మాత్రం మంచిదే. నువ్వు సేఫ్ గా ఉండాలంటే.. ఓ కోటీశ్వరుడిని చూసి పెళ్లి చేసుకో. అప్పుడు రెండువైపుల ఆస్తి నీకే వస్తుంది అని చెప్తుంది పారు. పెళ్లితో నీ జీవితం కచ్చితంగా మారిపోతుందని పారు చెప్తే, ఆలోచనలో పడుతుంది జ్యోత్స్న.
ఆఫీసులో ట్యూషన్
మరోవైపు స్కూలుకు రెడీ అవుతుంటుంది శౌర్య. ఈ రోజు నుంచి నీకు ఆఫీసులోనే ట్యూషన్ అని చెప్తాడు కార్తీక్. నేను రాను నాన్న అంటుంది శౌర్య. మాటలతో మనుమరాలిని ఆటపడిస్తుంది కాంచన. ఆ తర్వాత శౌర్య, దీప, కార్తీక్ ఇంటి నుంచి బయల్దేరుతారు. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

