MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Chiranjeevi: చిరంజీవి భయపడి రిజెక్ట్ చేస్తే, రజనీకాంత్‌ బ్లాక్‌ బస్టర్‌తో ట్రెండ్‌ సెట్‌ చేశాడు.. ఆ సినిమా ఏంటంటే?

Chiranjeevi: చిరంజీవి భయపడి రిజెక్ట్ చేస్తే, రజనీకాంత్‌ బ్లాక్‌ బస్టర్‌తో ట్రెండ్‌ సెట్‌ చేశాడు.. ఆ సినిమా ఏంటంటే?

మెగాస్టార్‌ చిరంజీవి వదిలేసిన కథతో రజనీకాంత్‌ బ్లాక్ బస్టర్‌ కొట్టారు. చిరంజీవి భయపడి నో చెబితే సూపర్‌ స్టార్‌ డేర్‌ చేసి ట్రెడ్ సెట్టర్‌గా నిలిచారు. మరి ఆ కథేంటో చూద్దాం. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Jul 01 2026, 09:23 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
చిరంజీవి వదిలేసిన మూవీతో రజనీకాంత్‌ ట్రెండ్‌ సెట్టర్
Image Credit : stockPhoto

చిరంజీవి వదిలేసిన మూవీతో రజనీకాంత్‌ ట్రెండ్‌ సెట్టర్

చిరంజీవి కెరీర్‌లో చాలా సినిమాలు మిస్‌ చేసుకున్నారు. అందులో ఇండస్ట్రీ హిట్స్ ఉన్నాయి. ఇండియన్‌ సినిమాని షేక్‌ చేసిన మూవీస్‌ కూడా ఉన్నాయి. అలానే ఒక మంచి బ్లాక్‌ బస్టర్‌ని వదులుకున్నారు. తన కెరీర్‌లో మొదటి సారి ఒక హర్రర్‌ ఫిల్మ్ ని ఆయన రిజెక్ట్ చేశారు. ఇదే సినిమాని రీమేక్‌ చేసి సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ ఇండస్ట్రీ హిట్‌ కొట్టారు. ట్రెండ్‌ సెట్ చేశారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
కమర్షియల్‌ సినిమాకి కేరాఫ్‌ చిరంజీవి
Image Credit : Asianet News

కమర్షియల్‌ సినిమాకి కేరాఫ్‌ చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి యాక్షన్‌, కమర్షియల్‌ సినిమాలకు కేరాఫ్‌. టాలీవుడ్‌ లెక్కలు మార్చిన హీరోగా చెప్పొచ్చు. పరిశ్రమ ని కమర్షియల్‌ బాట పట్టించిన హీరోగా నిలిచారు. ఎన్టీఆర్‌ తర్వాత కమర్షియల్‌ సినిమాలు చేసిన హీరోగా చిరంజీవి నిలుస్తారు. అదే సమయంలో కృష్ణ కూడా ఇలాంటి సినిమాలు చేశారు, కానీ ఆయన్ని మించేలా చిరంజీవి ఫక్తు కమర్షియల్‌ మూవీస్‌తో కాసుల వర్షం కురిపించారు. చిరంజీవితో సినిమా చేస్తే మినిమమ్‌ గ్యారంటీ అనే టాక్‌ అప్పట్లో ఉండేది. ఆయన చేసిన సినిమాలు కూడా అదే స్థాయిలో వసూళ్లని రాబట్టాయి.

35
హర్రర్‌ భయంతో చంద్రముఖిని రిజెక్ట్ చేసిన చిరంజీవి
Image Credit : Asianet News

హర్రర్‌ భయంతో చంద్రముఖిని రిజెక్ట్ చేసిన చిరంజీవి

ఇదిలా ఉంటే చిరంజీవి ఎక్కువగా కమర్షియల్‌ మూవీస్‌తోనే విజయాలు అందుకున్నారు. ఆయన చేసిన ప్రయోగాత్మక చిత్రాలు విమర్శకుల ప్రశంసలందుకున్నాయి.కానీ కమర్షియల్‌గా నష్టాలను తీసుకొచ్చాయి. మైథాలజీ మూవీస్‌, ఫాంటసీ చిత్రాలు కూడా ఆయనకు కలిసి రాలేదు. సైరా నరసింహా రెడ్డి లాంటి మూవీస్‌ కూడా ఆశించిన స్థాయిలో ఆడలేదు. అయితే టాలీవుడ్‌లోనే ఒక ట్రెండ్‌ సెటింగ్‌ ఛాన్స్ చిరంజీవికి వచ్చింది. ఆయన భయపడి సినిమా చేయలేదు. అదే `చంద్రముఖి`. ఈ మూవీ మలయాళంలో వచ్చిన `మనితిట్రతజు` అనే చిత్రానికి రీమేక్‌. అందులో మోహన్‌లాల్‌, సురేష్‌ గోపీ, శోభన నటించారు. అక్కడ పెద్ద హిట్‌ అయ్యింది.

45
చంద్రముఖితో హర్రర్‌ సినిమాల్లో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన రజనీకాంత్‌
Image Credit : Chandramukhi team

చంద్రముఖితో హర్రర్‌ సినిమాల్లో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన రజనీకాంత్‌

ఈ సినిమాని తెలుగులో చిరంజీవి హీరోగా రీమేక్‌ చేయాలని దర్శకుడు వీఎన్‌ ఆదిత్య ప్లాన్‌ చేశారు. చిరంజీవి వద్దకు వెళ్లి కథ చెప్పగా, ఆయన భయపడి రిజెక్ట్ చేశారు. తనకు ఈ హర్రర్‌ మూవీ సెట్ కాదని చెప్పి ఆయన నో చెప్పారు. ఆ తర్వాత ఇదే కథ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ వద్దకు వెళ్లింది. కథలో కొన్ని మార్పులు చేసి `చంద్రముఖి`గా రీమేక్‌ చేశారు. రజనీకాంత్‌, ప్రభు, జ్యోతిక, నయనతార వంటి వారు నటించారు. నయనతార నటించిన తొలి చిత్రమిదే. ఈ మూవీ బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. తమిళంలోనే కాదు, తెలుగులోనూ సంచలన విజయం సాధించింది. చంద్రముఖితో హర్రర్‌ సినిమాల ట్రెండ్‌ స్టార్‌ అయ్యింది. ఇలా రజనీకాంత్‌ సరికొత్త ట్రెండ్‌కి శ్రీకారం చుట్టారని చెప్పొచ్చు.

55
చిరు, రజనీకాంత్‌ చేస్తున్న సినిమాలివే
Image Credit : youtube/@RedGiantMovies

చిరు, రజనీకాంత్‌ చేస్తున్న సినిమాలివే

హర్రర్‌ సినిమా అని చెప్పి చిరంజీవి భయపడ్డారు. బ్లాక్‌ బస్టర్‌ మిస్‌ చేసుకున్నారు. రజనీకాంత్‌ డేర్‌ చేసి మూవీ చేశారు, ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచారు. ఈ విషయాన్ని ప్రముఖ దర్శకుడు వీఎన్‌ ఆదిత్య తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇక చిరంజీవి ఇప్పుడు బాబీ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఇది శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. వచ్చే సంక్రాంతికి విడుదల అయ్యే అవకాశం ఉంది. మరోవైపు చిరంజీవి నటించిన సోషియో ఫాంటసీ మూవీ `విశ్వంభర` వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలు కనిపించడం లేదు. మరోవైపు రజనీకాంత్‌ ఇప్పుడు `జైలర్‌ 2`తో బిజీగా ఉన్నారు. అలాగే `ధర్మన్‌` అనే సినిమా చేస్తున్నారు. దీంతోపాటు కమల్‌ హాసన్‌తో కలిసి ఇంకో మూవీ చేయబోతున్నారు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
వినోదం
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
తమిళ సినిమా
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
డైలాగ్ వింటేనే వణుకు పుడుతుంది... ఆడియన్స్ 100 మార్కులు వేసిన ఈ హారర్ సినిమా గుర్తుందా?
Recommended image2
Arjun Sarja Fitness: 64 ఏళ్ల వయసులోనూ కుర్రాడిలా యాక్షన్ కింగ్.. అర్జున్‌ సర్జా ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదే
Recommended image3
Babu Mohan: బాబు మోహన్ మంత్రి అవ్వడం తట్టుకోలేకపోయిన కోట శ్రీనివాసరావు, అసెంబ్లీలో ఏం చేశాడో తెలుసా?
Related Stories
Recommended image1
Peddi 27 Days Collections: పెద్ది సినిమా హిట్టా ఫట్టా? ఇప్పటి వరకు ఎంత కలెక్ట్ చేసింది?.. షాకిచ్చే నిజాలు
Recommended image2
Anushka: ఇకపై టాలీవుడ్‌ లేడీ సూపర్‌ స్టార్‌ సమంత.. మా ఇంటి బంగారంతో అనుష్క రికార్డ్‌ బ్రేక్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved