MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • Sonam Kapoor: 40 ఏళ్ల వయసులో రెండోసారి తల్లి అయిన స్టార్‌ హీరోయిన్‌.. మనవడి రాకతో యానిమల్‌ నటుడు ఎమోషనల్‌

Sonam Kapoor: 40 ఏళ్ల వయసులో రెండోసారి తల్లి అయిన స్టార్‌ హీరోయిన్‌.. మనవడి రాకతో యానిమల్‌ నటుడు ఎమోషనల్‌

బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ రెండోసారి తల్లి అయ్యారు. ఆమె, భర్త ఆనంద్ అహూజా దంపతులకు మార్చి 29, 2026న రెండో కుమారుడు జన్మించాడు. ఈ జంట సోషల్ మీడియాలో ఈ శుభవార్తను పంచుకోగా, అభిమానులు, సెలబ్రిటీల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

2 Min read
Author : Aithagoni Raju
Published : Mar 30 2026, 01:43 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
రెండోసారి తల్లి అయిన సోనమ్‌ కపూర్‌
Image Credit : Instagram

రెండోసారి తల్లి అయిన సోనమ్‌ కపూర్‌

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సోనమ్‌ కపూర్‌ రెండోసారి తల్లి అయ్యింది. ఇప్పటికే నాలుగేళ్ల క్రితం ఆమెకి కొడుక్కి జన్మనివ్వగా, ఇప్పుడు మరోసారి తల్లి అయ్యింది. రెండోసారి కూడా కుమారుడికి జన్మనిచ్చింది.  అయితే 40 ఏళ్ల వయసులో సోనమ్ కపూర్ ఆమె రెండోసారి తల్లి కావడం విశేషం.  ఆమె భర్త ఆనంద్ అహూజా ఆదివారం రోజున తమకు కొడుకు పుట్టిన విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా తెలిపారు. తమ ఆనందాన్ని పంచుకుంటూ అభిమానుల కోసం ఒక ఎమోషనల్ మెసేజ్‌ను పోస్ట్ చేశారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
రెండో కుమారుడి రాకతో సోనమ్‌, ఆనంద్‌ ఎమోషనల్‌ పోస్ట్
Image Credit : Instagram

రెండో కుమారుడి రాకతో సోనమ్‌, ఆనంద్‌ ఎమోషనల్‌ పోస్ట్

సోనమ్‌ కపూర్‌, ఆమె భర్త ఆనంద్‌ అహుజా తమకు కొడుకు పుట్టిన విషయాన్ని వెల్లడిస్తూ, `ఎంతో ప్రేమ, కృతజ్ఞతతో నిండిన హృదయాలతో, మార్చి 29, 2026న మా అబ్బాయి పుట్టాడని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాం. మా కుటుంబం ఇప్పుడు మరింత పెద్దదైంది. వాడి రాకతో మా మనసులు అందంగా నిండిపోయాయి. వాయు(వాయు కపూర్‌) తన తమ్ముడికి స్వాగతం పలకడానికి చాలా సంతోషంగా ఉన్నాడు. మా ఇంటిని ఆనందంతో నింపిన ఈ కొత్త ప్రాణానికి మేం ఆశీర్వదించబడ్డాం. నలుగురి కుటుంబంగా ఈ కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నందుకు మేం కృతజ్ఞతతో ఉన్నాం. బోలెడంత ప్రేమతో.. సోనమ్, ఆనంద్, వాయు` అని వెల్లడించారు. సోషల్‌ మీడియా ద్వారా పంచుకోగా, అభిమానులు వారికి అభినందనలు తెలియజేస్తున్నారు. వారు కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. 

 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sonam A Kapoor (@sonamkapoor)

36
తాతగా ప్రమోషన్.. అనిల్ కపూర్ ఆనందం
Image Credit : Instagram

తాతగా ప్రమోషన్.. అనిల్ కపూర్ ఆనందం

సీనియర్ నటుడు అనిల్ కపూర్ తన కూతురు సోనమ్, అల్లుడు ఆనంద్ అహూజాలకు కొడుకు పుట్టడంతో ఆనందంలో మునిగిపోయారు. ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఎమోషనల్ నోట్ రాశారు, ` నా గుండె మరింత పెద్దదైంది. నా చిన్నారి, ఈ ప్రపంచంలోకి నీకు స్వాగతం. నిన్ను ఇప్పటికే చాలా ప్రేమిస్తున్నారు. వాయు, ఇప్పుడు నువ్వు అన్నయ్య అయ్యావు, నువ్వు ఒక అద్భుతమైన అన్నయ్య అవుతావని నాకు తెలుసు. సోనమ్, ఆనంద్, థ్యాంక్యూ... తాత మనసు ఆనందంతో నిండిపోయింది. మై చిల్డ్రన్స్, ఈ అందమైన ప్రపంచంలోకి, జీవితాంతం ప్రేమతో నిండిన ప్రయాణంలోకి స్వాగతం` అని వెల్లడించారు.

 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by anilskapoor (@anilskapoor)

46
సోనమ్‌కు సెలబ్రిటీల అభినందనలు
Image Credit : Instagram

సోనమ్‌కు సెలబ్రిటీల అభినందనలు

ఈ గుడ్ న్యూస్ తెలియగానే ఇండస్ట్రీలోని చాలామంది తారలు కామెంట్ సెక్షన్‌లో శుభాకాంక్షలు తెలిపారు. వీరిలో కరీనా కపూర్, కాజోల్, బిపాషా బసు, దియా మీర్జా, పరిణీతి చోప్రా, జోయా అక్తర్, కాజల్ అగర్వాల్, కాజల్ అగర్వాల్, వాణీ కపూర్, రిచా చద్దా, హుమా ఖురేషి వంటి వారు ఉన్నారు. సోషల్‌ మీడియా ద్వారా విషెస్‌ తెలియజేస్తూ పోస్ట్ లు పెడుతున్నారు. దీంతో ఇప్పుడు బాలీవుడ్‌లో సోనమ్‌ కపూర్‌ ట్రెండింగ్‌లోకి వచ్చారు.

56
2018లో పెళ్లి.. సోనమ్-ఆనంద్ లవ్ స్టోరీ
Image Credit : Instagram

2018లో పెళ్లి.. సోనమ్-ఆనంద్ లవ్ స్టోరీ

సోనమ్, ఆనంద్ లవ్ స్టోరీ 2015లో కామన్ ఫ్రెండ్స్ ద్వారా మొదలైంది. ముంబై, లండన్ మధ్య లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్ నెమ్మదిగా బలపడింది. మే 8, 2018న ఇద్దరూ ముంబైలో సిక్కు సంప్రదాయాల ప్రకారం పెళ్లి చేసుకున్నారు. ఆగస్టు 2022లో ఈ జంట తమ మొదటి కొడుకు వాయు కపూర్ అహూజాకు స్వాగతం పలికారు. ఇప్పుడు రెండో కొడుకు పుట్టడంతో వారి కుటుంబం నలుగురితో నిండిపోయింది.

66
చివరగా 'బ్లైండ్' సినిమాలో మెరిసిన సోనమ్ కపూర్‌
Image Credit : Instagram

చివరగా 'బ్లైండ్' సినిమాలో మెరిసిన సోనమ్ కపూర్‌

ఒకప్పుడు బాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా రాణించిన  సోనమ్ కపూర్ కంటెంట్‌ బేస్డ్ చిత్రాలతో మెప్పించింది. నటిగా తనేంటో నిరూపించింది. చివరిసారిగా 2023లో విడుదలైన 'బ్లైండ్' సినిమాలో కనిపించింది. జియో సినిమాలో రిలీజైన ఈ చిత్రానికి ఎక్కువగా నెగెటివ్ రివ్యూలు వచ్చాయి. ప్రస్తుతం ఆమె ఫ్యాషన్ ప్రపంచంలో యాక్టివ్‌గా ఉన్నారు. తన వ్యాపారాలు చూసుకుంటోంది. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
బాలీవుడ్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
వర్షిణి కోసం దేబ్జానీకి అన్యాయం చేసిన ముఖేష్, చేపల మార్కెట్ లా తయారైన బిగ్ బాస్ హౌస్..
Recommended image2
Ambika Vs Radha: రాధ కంప్లైంట్‌పై అంబిక కౌంటర్.. మోసపోయింది నేనే అంటూ చెల్లికి అక్క ట్విస్ట్
Recommended image3
Michael Jackson: రజనీకాంత్ కోసం మైఖేల్ జాక్సన్ పాడాల్సింది.. 16 ఏళ్ల తర్వాత తమన్ చెప్పిన సీక్రెట్!
Related Stories
Recommended image1
Prakash Raj: ప్రకాష్‌ రాజ్‌ తల్లి కన్నుమూత.. అనాథగా కష్టాలు, పేషెంట్‌గా వచ్చినవాడితో లవ్‌ మ్యారేజ్‌
Recommended image2
Ramya Krishnan: కృష్ణవంశీకి రమ్యకృష్ణనే మొగుడా?.. భర్తకి శివగామి క్రేజీ కౌంటర్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved