MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • Ramya Krishnan: కృష్ణవంశీకి రమ్యకృష్ణనే మొగుడా?.. భర్తకి శివగామి క్రేజీ కౌంటర్‌

Ramya Krishnan: కృష్ణవంశీకి రమ్యకృష్ణనే మొగుడా?.. భర్తకి శివగామి క్రేజీ కౌంటర్‌

రమ్యకృష్ణ, దర్శకుడు కృష్ణవంశీ రిలేషన్‌కి సంబంధించి ఆ మధ్య పలు వార్తలు వచ్చాయి. కానీ తనకు రమ్యకృష్ణనే మొగుడు అంటూ కృష్ణవంశీ కామెంట్‌ చేయగా, దీనికి ఆమె కౌంటర్‌ ఇచ్చింది. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Mar 30 2026, 12:52 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
విలక్షణ నటిగా రాణిస్తోన్న రమ్యకృష్ణ
Image Credit : Asianet News

విలక్షణ నటిగా రాణిస్తోన్న రమ్యకృష్ణ

రమ్యకృష్ణ ఇప్పుడు విలక్షణ నటిగా రాణిస్తోంది. ఒకప్పుడు ఆమె గ్లామర్‌ పాత్రలతో మెప్పించింది. తిరుగులేని స్టార్‌ హీరోయిన్‌గా రాణించింది. దాదాపు రెండు దశాబ్దాలపాటు చిత్ర పరిశ్రమ ని ఊపేసింది. ఇప్పుడు క్యారెక్టర్‌ ఆర్టిస్ట్ గా మారి విలక్షణ పాతలతో మెప్పిస్తోంది. `బాహుబలి` సినిమాతో ఆమె సెకండ్‌ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిందని చెప్పొచ్చు. ఇటీవల ఆమె `రంగమార్తాండ`లో మరో అద్భుతమైన పాత్రలో మెప్పించింది. ఎమోషనల్‌ రోల్‌ చేసి కన్నీళ్లు పెట్టించింది. `జైలర్‌`తో సూపర్‌ హిట్‌ అందుకుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ప్రేమించి పెళ్లి చేసుకున్న రమ్యకృష్ణ, కృష్ణవంశీ
Image Credit : meramyakrishnan/Instagram

ప్రేమించి పెళ్లి చేసుకున్న రమ్యకృష్ణ, కృష్ణవంశీ

ఇదిలా ఉంటే రమ్యకృష్ణ.. దర్శకుడు కృష్ణవంశీని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. కృష్ణవంశీ రూపొందించిన `చంద్రలేఖ` చిత్రంలో రమ్యకృష్ణ హీరోయిన్‌గా నటించింది. ఇందులో నాగార్జున హీరో. ఈ సినిమా సమయంలో ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. మళ్లీ వీరిద్దరు కలిసి పనిచేయలేదు. చాలా రోజుల ఇటీవల కృష్ణవంశీ రూపొందించిన `రంగమార్తాండ`లో రమ్యకృష్ణ నటించింది.

Related Articles

Related image1
Prakash Raj: ప్రకాష్‌ రాజ్‌ తల్లి కన్నుమూత.. అనాథగా కష్టాలు, పేషెంట్‌గా వచ్చినవాడితో లవ్‌ మ్యారేజ్‌
Related image2
Ustaad Bhagat Singh Day 11 Collections: ఉస్తాద్‌కి పెరిగిన కలెక్షన్లు.. హిట్‌ కావాలంటే ఇంకా ఎన్నో కోట్లు రావాలంటే?
35
రమ్యకృష్ణ, కృష్ణవంశీ విడిపోతున్నట్టు రూమర్లు
Image Credit : meramyakrishnan/Instagram

రమ్యకృష్ణ, కృష్ణవంశీ విడిపోతున్నట్టు రూమర్లు

అయితే రమ్యకృష్ణ, కృష్ణవంశీ మధ్య విభేదాలు వచ్చాయని చాలా సార్లు వార్తలు వచ్చాయి. రమ్యకృష్ణ చెన్నైలో ఉంటుందనే కామెంట్లు వచ్చిన నేపథ్యంలో ఆ మధ్య దర్శకుడు కృష్ణవంశీ స్పందించి వివరణ ఇచ్చాడు, షూటింగ్‌ల నిమిత్తం ఆమె వెళ్లి వస్తుంటుందని, రెగ్యూలర్‌గా తాము కలుసుకుంటూనే ఉంటామని, తమ మధ్య ఎలాంటి దూరంగా లేదని తెలిపారు. తాము కలిసే ఉంటున్నట్టు వెల్లడించారు. అవి కేవలం రూమర్లు మాత్రమే అని స్పష్టం చేశారు. 

45
కృష్ణవంశీకి రమ్యకృష్ణ మొగుడు ?
Image Credit : Krishna Vamsi\Twitter

కృష్ణవంశీకి రమ్యకృష్ణ మొగుడు ?

కానీ ఓ సందర్భంలో రమ్యకృష్ణపై దర్శకుడు కృష్ణవంశీ హాట్‌ కామెంట్‌ చేశారు. `రమ్యకృష్ణకి నేను మొగుడిని కాదు, నాకే ఆమె మొగుడు` అన్నారు. దీనిపై రమ్యకృష్ణ స్పందించింది. `క్వీన్‌` అనే మూవీ రిలీజ్‌ టైమ్‌లో ఇచ్చిన ఇంటర్వ్యూలో దీనిపై ఆమె బోల్డ్ కామెంట్‌ చేసింది. `ఎవరికి ఎవరు మొగుడైతే ఏంటి(నవ్వుతూ). ఆయన సరదాగా అలా అని ఉంటారు. కొన్నిసార్లు ఆయన భార్య, నేను భర్త కావచ్చు, పాత్రలు మార్చుకోవచ్చు. అయినా భార్యాభర్తల మధ్య అవగాహన ఉండాలి. ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ఇదే మేం నమ్ముతాం` అని తెలిపింది రమ్యకృష్ణ. ఈ ఇంటర్వ్యూ క్లిప్‌ ఇప్పుడు బయటకు వచ్చింది. ఇది అభిమానులను ఆకట్టుకుంటోంది.

55
జైలర్‌ 2లో నటిస్తోన్న రమ్యకృష్ణ
Image Credit : zee telugu

జైలర్‌ 2లో నటిస్తోన్న రమ్యకృష్ణ

రమ్యకృష్ణ ప్రస్తుతం రామ్‌ గోపాల్‌ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోంది. ఇందులో ఆమె మోడ్రన్‌ ఉమెన్‌గా, ట్రావెల్‌ని ఇష్టపడే మహిళగా కనిపించబోతుంది. అలాగే తమిళంలో రజనీకాంత్‌ సరసన `జైలర్‌ 2`లో నటిస్తోంది. నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ రూపొందిస్తోన్న ఈ చిత్రం చిత్రీకరణ దశలో ఉంది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
రమ్య కృష్ణ
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Toxic Movie: టాక్సిక్ ఓటీటీ రిలీజ్ డీటెయిల్స్.. యశ్ పాన్ ఇండియా మూవీ ఎప్పుడు, ఎందులో చూడాలంటే
Recommended image2
Sivakarthikeyan: భార్యతో రొమాంటిక్ గా శివకార్తికేయన్ పెళ్లి రోజు సెలెబ్రేషన్స్.. వైరల్ ఫోటోస్
Recommended image3
OTT: తవ్వే కొద్దీ ట్విస్టులు, ఆమె దెబ్బకు పోలీసులు ఉక్కిరి బిక్కిరి.. ఓటీటీలో అస్సలు మిస్ కాకూడని మూవీ
Related Stories
Recommended image1
Prakash Raj: ప్రకాష్‌ రాజ్‌ తల్లి కన్నుమూత.. అనాథగా కష్టాలు, పేషెంట్‌గా వచ్చినవాడితో లవ్‌ మ్యారేజ్‌
Recommended image2
Ustaad Bhagat Singh Day 11 Collections: ఉస్తాద్‌కి పెరిగిన కలెక్షన్లు.. హిట్‌ కావాలంటే ఇంకా ఎన్నో కోట్లు రావాలంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved