శోభిత ధూళిపాళకు ఫేవరెట్ తెలుగు హీరో ఎవరో తెలుసా, నాగచైతన్య మాత్రం కాదు?
అక్కినేని వారి కోడలు, నాగచైతన్య భార్య, బాలీవుడ్, టాలీవుడ్ హీరోయిన్ శోభిత దూళిపాళకు ఫేవరెట్ హీరో ఎవరో తెలుసా? ఆమె ఎక్కువగా ఎవరి సినిమాలు చూసేది, చైతు కాకుండాత శోభిత అభిమానించే తెలుగు హీరో ఎవరో తెలుసా?

స్టార్ హీరోయిన్ కాకపోయినా తన పాత్రలతో టాలీవుడ్ ఆడియన్స్ లో గుర్తింపు మాత్రం సాధించింది. ఇక ఎప్పుడు ఎలా ప్రేమలో పడిందో తెలియదు కానీ, సమంతతో విడాకుల తరువాత ఆమె నాగచైతన్య ప్రేమలో పడటం, వీరు చెట్టాపట్టాలేసుకుని ఫారెన్ ట్రిప్పులకు తిరగడం , ఆతరువాత ఎంగేజ్మెంట్, పెళ్లీ అన్నీ చకచకా జరిగిపోయాయి. ప్రస్తుతం వీరిద్దరు హ్యాపీ లైఫ్ ను లీడ్ చేస్తున్నారు. శోభిత కూడా పెళ్లి తరువాత ఫ్యామిలీ లైఫ్ కే కాస్త ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టు తెలుస్తోంది. సినిమాలు కూడా పెద్దగా చేయడం లేదు. ఇక ముందు ముందు ఇండస్ట్రీకి ఆమె గుడ్ బై చెప్పినా ఆశ్చర్చపోవలసింది లేదు.
తెలుగమ్మాయి అయిన శోభిత దూళిపాళ డైరెక్ట్ గా బాలీవుడ్ హీరోయిన్ అవ్వడమే కాదు, టాలీవుడ్ లో పెద్ద ఫ్యామిలీకి కోడలు కూడా అయ్యింది. ఒక తెలుగమ్మాయి మోడల్ అవ్వడం, ఫిల్మ్ ఇండస్ట్రీలోకి రావడం గొప్ప విషయమే. ఎందుకుంటే ప్రస్తుతం తెలుగు అమ్మాయిలను గతంలో మాదిరిగా మన ఇండస్ట్రీలో ఎంకరేజ్ చేయడంలేదు అవకాశాలు ఇవ్వడంలేదు. ఈక్రమంలో మోడల్ గా శోభిత కెరీర్ ను స్టార్ట్ చేయడమే కాకుండా, బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడి నుంచి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా అడుగు పెట్టింది.
శోభితకు సబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ విషయం ఒకటి బయటకు వచ్చింది. నాగచైతన్య ఒక టాలీవుడ్ హీరో, అతన్ని ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్న శోభితకు ఫేవరెట్ హీరో ఎవరై ఉంటారు? ప్రేమించి పెళ్లి చేసుకుంది కదా అని తన భర్తనే తన ఫేవరెట్ హీరో అని చెప్పలేదు కదా? అయితే శోభిత చిన్నతనం నుంచి ఓ టాలీవుడ్ స్టార్ హీరోకు వీరాభిమాని అని తెలుస్తోంది.
ఆయన ఎవరో కాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. చిననతనం నుంచి శోభితకు పవన్ కళ్యాణ్ సినిమాలంటే చాలా ఇష్టమట. ఆయన సినిమాలు ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాల్సిందేనట. పవర్ స్టార్ ను అంతగా అభిమానించేదట శోభిత. ఇప్పటికీ పవన్ కళ్యాణ్ సినిమాలు థియేటర్ లో చూడటం అంటే శోభితకు ఎంతో ఇష్టమట.
ఇక గూఢచారి సినిమాతో టాలీవుడ్ లో గుర్తింపుతెచ్చుకున్న శోభిత, తెలుగు, తమిళ, హిందీ భాషల్లో పలు సినిమాల్లో నటించింది. కొన్నివెబ్ సిరీస్ లు కూడా చేసింది ఈ హీరోయిన్. ఇక నాగచైతన్య విషయానికి వస్తే తండేల్ సినిమా సూపర్ హిట్ తరువాత కాస్త గ్యాప్ తీసుకున్నాడు. ప్రస్తుతం విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ దండుతో ఓ మిథికల్ థ్రిల్లర్ సినిమా చేస్తున్నాడు నాగచైతన్య. ఇప్పటికే ఈసినిమా షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా నాగచైత్య కెరీర్ లో 24వ సినిమాగా తెరకెక్కుతోంది. ఇక తన 25వ చిత్రం కోసం భారీ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది. తెలిసిన దర్శకులను కాకుండా ఈసారి కిషోర్ అనే కొత్త దర్శకుడితో తన 25వ చిత్రం చైతూ చేయబోతున్నాడని టాక్

