బిగ్ బాస్ తెలుగు 9 లోకి నిఖిల్ ప్రియురాలు, షో కోసం కావ్య ఎంత పనిచేసింది?
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 స్టార్ట్ అవ్వబోతుంది. ఈసారి బిగ్ బాస్ లో సర్ ప్రైజింగ్ స్టార్స్ సందడి చేయబోతున్నారు. అందుకోసం తాము చేస్తున్న ప్రాజెక్ట్స్ ను వారు త్యాగం చేయడానికి కూడా రెడీ అయ్యారు.
- FB
- TW
- Linkdin
Follow Us

రీసెంట్ గా బిగ్ బాస్ తెలుగు సీజన్ 9పై ప్రోమో రిలీజైన దగ్గర నుంచి ఈ రియాల్టీ షో గురించి ఆడియన్స్ లో ఆసక్తికర చర్చ కొనసాగుతోంది. బిగ్ బాస్ లోకి వచ్చే కంటెస్టెంట్స్ గురించి నెట్టింట హాట్ టాపిక్ నడుస్తోంది. ఈసారి హౌస్‌లోకి ఎవరెవరు అడుగు పెట్టనున్నారన్న దానిపై ఓ రేంజ్‌లో ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి.
ఇప్పటికే 'కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్', 'కూకి జాతి రత్నాలు' లాంటి ప్రీ-షోల ద్వారా కొంతమంది కంటెస్టెంట్లను ఎంపిక చేసినట్టు సమాచారం. ఈ షోలలో కనిపించిన ఇమ్మానుయేల్, బమ్ చిక్ బబ్లూ, రీతూ చౌదరి, జబర్దస్త్ ఐశ్వర్యతో పాటు మరో ఇద్దరు ముగ్గురు టీవీ ఆర్టిస్టుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నారు. వీరిలో చాలామంది బిగ్ బాస్ హౌస్‌లోకి ప్రవేశించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రోలింగ్ మెటీరియల్స్ గా నిలిచే వివాదాస్పద వ్యక్తులకు కూడా బిగ్ బాస్ టీమ్ నుండి కాల్స్ వెళ్లుతున్నట్టు సమాచారం. ఎప్పుడూ సంచలనాలకు కేంద్రంగా ఉండే వ్యక్తులు ఈసారి బిగ్ బాస్ 9లో కీలక పాత్ర పోషించే అవకాశం కనిపిస్తోంది. . అందులో భాగంగా ఇప్పుడు ఒక ముఖ్యమైన పేరు ఒకరిది తెరపైకి వచ్చింది ఆమె ఎవరో కాదు సీరియల్ స్టార్ కావ్య శ్రీ.
కావ్య శ్రీ ‘చిన్ని’ అనే సీరియల్‌లో హీరోయిన్ గా నటిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల అనూహ్యంగా ఈ సీరియల్‌లో ఆమె పాత్రను చంపేసి, కొత్త హీరోయిన్‌ను పరిచయం చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామంతో పాటు రీసెంట్ గా బిగ్ బాస్ సీజన్ 9 ప్రోమో కూడా రిలీజ్ అవ్వడంతో , ఆమె బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారన్న వార్తలు మరింతగా వైరల్ అవుతున్నాయి.
గత సీజన్‌లో కావ్య శ్రీ మాజీ ప్రియుడు నిఖిల్ బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లి, టైటిల్ విన్నర్‌గానూ నిలిచిన విషయం తెలిసిందే. బిగ్ బాస్ హౌస్ లో కావ్య గురించి చాలాసార్లు డిస్కర్షన్ కూడా వచ్చింది. దాంతో బిగ్ బాస్ హౌస్ లో లేకపోయినా.. కావ్య పేరు మాత్రం బాగా హైలెట్ అయ్యింది. ఈక్రమంలో అప్పుడు నిఖిల్ బిగ్ బాస్‌కి వెళ్లడం ఓ హైలైట్ అయితే, ఇప్పుడు కావ్య శ్రీ రాబోతుందని ప్రచారం జరగడం ఆడియన్స లో ఎక్కడ లేని క్యూరియాసిటీని కలిగిస్తోంది.
మరీ ముఖ్యంగా ఆమె సీరియల్‌ను సడెన్‌గా వదిలేయడం, బిగ్ బాస్ ఆఫర్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే భావిస్తున్నారు ఆడియన్స్. ఈ విషయంలో ఎవరు క్లారిటీ ఇవ్వకపోయినా.. కామన్ ఆడియన్స్ లో మాత్రం చర్చ నడుస్తోంది. ఆమె బిగ్ బాస్ 9లో ఉండే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తోంది.
టీవీ సీరియల్స్‌తో పాటు, బిగ్ బాస్ వంటి రియాలిటీ షోల్లో పాల్గొనడం ద్వారా పాపులారిటీతో పాటు రెమ్యూనరేషన్ కూడా భారీగా పెరుగుతుంది. 100 రోజుల షో కోసం సీరియల్స్ కన్నా ఎక్కువ డబ్బులు వస్తుండటం, కెరీర్ లో ఫేమ్ తో పాటు మంచి అమౌంట్ కూడా వస్తుండటంతో ఈ అవకాశాన్ని ఎవరు వదిలేసుకుంటారు.
ఈ క్రమంలో బిగ్ బాస్ తెలుగు 9లో కావ్య శ్రీ ఎంట్రీ ఖాయం అంటున్నారు సీరియల్ ఫ్యాన్స్. నిఖిల్ తర్వాత ఇప్పుడు కావ్య బిగ్ బాస్‌కి రావడం ఆసక్తికర మలుపు కావొచ్చు. కావ్య బిగ్ బాస్ లోకి వస్తే నిఖిల్ గురించి ఏం స్పందిస్తుంది అనేది ఆసక్తి కరంగా మారింది. అధికారిక ప్రకటన రాకపోయినా, చిన్ని సీరియల్ నుంచి ఆమె తప్పుకోవడం, బిగ్ బాస్ ప్రోమోలు రావడం అన్నీ కలిపి ఈ ఊహాగానాలకు బలం ఇస్తున్నాయి. ఇక ప్రస్తుతం అఫీషియల్ అనౌన్స్ మెంట్ కోసం అంతా ఎదురు చూస్తున్నారు.